లాభాల్లో మార్కెట్లు.. అర్నెళ్లలో నిఫ్టీ బిగెస్ట్ గెయినింగ్ డే Sensex surges over 450 points

Sensex closes up 456 points on surge in it shares asian cues

Rs500 Notes, Rs1000 Notes, BSE, NSE, Black Money, Indian Stocks, Sensex, sensex bse, sensex today, sensex today india, sensex today closing, sensex share price, sensex shares, sensex gainer and losers, sensex graph, nifty, nifty top gainers, nifty top 50, bse sensex, bse nse, global markets, Asian markets, BSE, NSE

Equity benchmarks turned positive for the week as well as for the calendar year. The NSE Nifty closed above the 8100 level and posted the biggest one-day gain in last six months

లాభాల్లో మార్కెట్లు.. అర్నెళ్లలో నిఫ్టీ బిగెస్ట్ గెయినింగ్ డే

Posted: 11/25/2016 07:17 PM IST
Sensex closes up 456 points on surge in it shares asian cues

డిసెంబర్ మాసం డెరివేటివ్ల సిరీస్ ప్రారంభం కావడంతో ఇవాళ దేశీయ మార్కెట్లలో లాభాలు వికసించాయి. విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాల నేపథ్యంలో దేశీయ మార్కెట్లు భారీ స్థాయిలో లాబాలను అందుకున్నాయి. రూపాయి విలువ భారీ స్థాయిలో పడిపోవడంతో ఐటీ సంస్థల షేర్లు కూడా లాభాలను అందుకున్నాయి. దీనికి తోడు పలు దిగుమతులపై కేంద్రం విధించిన అంక్షల నేపథ్యంలో మార్కెట్లు పాజిటివ్ గా ట్రెండయ్యాయి. అటు నిఫ్టీ ఏకంగా బిగెస్ట్ గెయినింగ్ డే ( అత్యధిక లాభాలను అర్జించిన)రోజుగా నమోదు చేసుకుంది.

అసియా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలకు తోడు ఐటీ షేర్లు పుంజుకోవడంతో మార్కెట్లు ఇవాళ ఉదయం నుంచి లాభాల బాట పట్టాయి. మార్కెట్ ప్రారంభంతోనే సెన్సెక్స్ 136 పాయింట్ల లాభాంతో 25 వేల 996 పాయింట్లతో అరంభం కాగా, అటు నిఫ్టీ కూడా 42 పాయింట్ల లాభంతో 8 వేల 7 పాయింట్లను అందకుని కీలకమైన 8 వేల మార్కును అధిగమించింది. ఈ క్రమంలో లాభాలను అధిమి పట్టుకున్న మార్కెట్లు ముగింపులో మరిన్నీ లాభాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 456 పాయింట్లు లాభంతో 26 వేల 316 పాయింట్ల వద్ద ముగియగా, అటు నిఫ్టీ 149 పాయింట్ల లాభంతో 8వేల 114 పాయింట్ల వద్ద ముగిసింది.

ఈ నేపథ్యంలో అన్ని కీలక సూచీలు లాభాలలోనే పయనించాయి. ఐటీ, హెల్త్ కేర్, చిన్నతరహా పరిశ్రమల సమాఖ్య సూచీలను లాభాలు ముంచెత్తగా, బ్యాకింగ్ నిఫ్టీ, బ్యాకింగ్, టెక్నాలజీ, కన్జూమర్ డ్యూరబుల్స్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంజీసీ, అయిల్ అండ్ గ్యాస్, మెట్సల్; మధ్యతరహా, మధ్యతరహా నిఫ్టీలకు చెందిన సూచీలు భారీ లాభాలను అందుకున్నాయి. కాగా అటో, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ సూచీలు స్వల్ప లాభాలను అందుకున్నాయి. ఈ క్రమంలో టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్పోసిస్, సన్ ఫార్మా, హెచ్ సి ఎల్ తదితర సంస్థల షేర్లు అధిక లాభాలను ఆర్జించగా, భారతీ ఇన్ఫ్రాటెల్, ఏసీసీ, బజాజ్ అటో, ఏషియర్ మెటర్స్, భారతీ ఎయిర్ టెల్ తదితర సంస్థల షేర్లు నష్టాల్లో కూరుకుపోయాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rs500 Notes  Rs1000 Notes  sensex  nifty  nse  bse  stock market  global markets  business  

Other Articles