Sensex zooms 293 points to go past 28k, Nifty above 8600

Sensex zooms 293 points nifty above 8600

sensex, nifty, indian share market, indian stock exchange, Tata Consultancy Services, infosys, sensex at a low, two year low of sensex, janet yellen, janet yellen united states reserve federal chairperson, united states federal reserve bank, united states federal reserve

Equities jumped as the benchmark Sensex recaptured the 28,000-level by surging 293 points and Nifty breached the 8,600-mark on continued buying by investors.

విదేశీ మార్కెట్ల సానుకూల ప్రభావం.. లాభాల్లో దేశీయ సూచీలు..

Posted: 08/12/2016 06:19 PM IST
Sensex zooms 293 points nifty above 8600

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలను నమోదు చేసుకున్నాయి. విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలతో దేశీయ సూచీలు లాభాలను అర్జించాయి. దీంతో సెన్సెక్స్ 28 వేల మార్కుకు చేరుకోగా, అటు నిఫ్టీ కూడా 8600 మార్కును అధిగమించింది. అమెరికా స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్లో సంచనాలు సృష్టించాయి. మొదటిసారి 1999 నాటి గరిష్ట స్థానానికి ఎగిసి రికార్డుల వర్షం కురిపించాయి. ఆయిల్ ధరలు పెరుగుతున్నాయనే వార్త, మాకీస్, కోహ్ల్స్ డిపార్ట్మెంట్ స్టోర్లు బలమైన రాబడులు ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలపర్చాయి.

దీంతో అమెరికా మూడు మేజర్ స్టాక్ సూచీలు డౌజోన్స్, నాస్డాక్, ఎస్ అండ్ పీ 500 రికార్డు స్థాయిలో క్లోజ్ అయినట్టు బైస్పోక్ ఇన్వెస్ట్మెంట్ గ్రూపు వెల్లడించింది. వీటి ప్రభావంతో ఐఐపీ డాటా విడుదలకు ముందుకు కూడా మార్కెట్లు లాభాలలో పయనించాయి. ఫలితంగా మార్కెట్లు ముగింపు సమయానికి సెన్సెక్స్ 293 పాయింట్లు ఎగబాకి 28 వేల 152 పాయింట్ల వద్దకు చేరుకోగా, అటు నిఫ్టీ 85 పాయింట్లు లాభంతో 8,672 పాయింట్ల వద్ద ముగిసింది. ఇవాళ మొత్తంగా 2838 సంస్థల షేర్లు ట్రేడింగ్ లో పాల్గోనగా వాటిలో 1392 సంస్థల షేర్లు నష్టాల బాటలో పయనించగా, 1264 సంస్థల షేర్లు లాభాలను గడించాయి. కాగా 182 సంస్థల షేర్లు తటస్థంగా నిలిచాయి.

ఇవాళ్లి ట్రేడింగ్ రమారమి అన్ని సూచీలు లభాల బాటలోనే పయనించగా, అటో, బ్యాకింగ్, బ్యాకింగ్ నిఫ్టీ, మెటల్స్ మధ్యతరహా పరిశ్రమల సూచీలు అధిక లాభాలను అర్జించాయి. క్యాపిటల్ గూడ్స్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, క్యాపిటల్ గూడ్్స, ఎఫ్ఎంజీసీ, కన్జూమర్ డ్యూరబుల్స్, చిన్న తరహా పరిశ్రమల సూచీలు స్వల్ప లాభాలను అర్జించాయి. కాగా హెల్త్ కేర్, ఐటీ, అయిల్ అండ్ గ్యాస్, టెక్నాలజీ సూచీలు స్వల్పంగా నష్టపోయాయి, ఈ నేపథ్యంలో  ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, యస్ బ్యాంక్, హిందాల్కో, టాటా మోటార్స్ తదితర కంపెనీల షేర్లు లాభాల్లో పయనించగా, బీపీసీఎల్, టెక్ మహీంద్రా, సిప్లా, ఐడియా, ఇన్ఫోసిస్ తదితర కంపెనీల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  indian share market  indian stock exchange  

Other Articles