Low gold prices drive demand ahead of diwali

diwali, dasshera, dhantheras, gold prices, 6 week high, jewelleries, customers, gold sale, restictions on import, arun jaitley

Low gold prices drive demand ahead of Diwali

దీపావళి వేళ.. జోరందుకున్న పసిడి అమ్మకాలు..

Posted: 10/22/2014 04:16 PM IST
Low gold prices drive demand ahead of diwali

దీపావళి పండుగ సందర్భంగా పసిడి ఆభరణాల అమ్మకాలు దేశవ్యాప్తంగా భారీగా పెరిగాయి.  కొనుగోలుదారులతో జ్యూయలరీ షాపులు కళకళలాడుతున్నాయి. బంగారు ధరలు నిలకడగా వుండటం చేత అమ్మకాలు జోరందుకున్నాయి. దీంతో బులియన్ మార్కెట్లో బంగారం ధర ఆరు వారాల గరిష్టస్థాయిని నమోదు చేసుకుంది. వరుస పండుగలు, ఆ తరువాత పెళ్లిళ్ల మాసాలను దృష్టిలో పెట్టుకొని  జ్యూయలరీ షాపుల వారు మహిళల కోసం రకరకాల డిజైన్లలో ఆభరణాలను అందుబాటులోకి తెచ్చారు. హైదరాబాద్‌లో మహిళలు జోరుగా బంగారం కొనుగోళ్లు చేస్తున్నారు.  బంగారంపై పెట్టుబడి పెట్టడం మంచిదన్న భావన చాలామందిలో నెలకొంది.  

ధన్ త్రయోదశి పర్వదినాన బంగారు, వెండి ఆభరాణాలు కోనుగోలు చేస్తే మంచిదన్న విశ్వాసం ఉత్తరాధి నుంచి వచ్చి దక్షిణాధిలో కూడా ప్రభావాన్ని చూపింది. ధన్ త్రయోదశిని పురస్కరించుకుని నిన్న బంగారు దుకాణాల్లో వ్యాపారాలు జోరందుకున్నాయి. దాదాపు మూడేళ్లుగా బంగారం ధర నిలకడగా ఉండటం వల్ల కూడా కొనుగోలుదారులు కొనుగోలుకు ముందుకు వచ్చారు.  దీపావళి తర్వాత పసిడి ధర పెరిగే అవకాశం ఉందని.  పండుగ తర్వాత పసిడి దిగుమతులపై కేంద్ర ప్రభత్వం మళ్లీ ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పాడం కూడా అమ్మకాల జోరును పెంచాయి. ఇదే అదనుగా భావించిన బంగారం వ్యాపారులు బంగారం ధరను పెంచారు. ఆభరణాలపై కూడా ధరను అధికంగా వసూలు చేశారు.

పసిడి దిగుమతులు విపరీతంగా పెరిగిన కారణంగా దిగుమతి సుంకాన్ని 10 శాతానికి పెంచారు. ఇంకా ఇతరత్రా పలు ఆంక్షలు విధించారు. ఈ కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గినప్పటికీ మన దేశంలో మాత్రం తగ్గలేదు. ఇప్పుడు మరోసారి ఆంక్షలు విధిస్తే బంగారం ధర ఓ మాదిరిగా పెరిగే అవకాశం ఉంది. ఈ అంశాన్ని దృష్టిలోపెట్టుకొని కూడా కొంతమంది బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు.

అటు దుబాయ్ లోనూ దీపావళి సందడి అలుముకుంది. దుబాయ్ లో వున్న హిందువులు ఇవాళ ధన్ తెరాస్ ను జరుపుకోనుండడంతో బంగారు ఆభరణాల దుకాణాలన్నీ హిందువులతో కిటకిటలాడాయి. అమావాస్యకు ముందు వచ్చే త్రయోధశి రోజున ధన్ తెరాస్ ను జరుపుకోవడం అనవాయితి. ఈ రోజున బంగారు అభరణాలు కొంటే మంచిదన్న విశ్వాసంతో అటు దుబాయ్ లోనూ మహిళా కొనుగోలు దారులతో దుకాణాలు కిటకిటలాడాయి. బర్ దుబాయ్ లోని అన్ని మాల్స్ లో వున్న బంగారు దుకాణాలతో పాటు డైరాలో వున్న గోల్డ్ సోక్యూ మహిళలు పెద్ద సంఖ్యలో ఆభరణాల కోనుగోళ్లకు బారులు తీరారు. అధికంగా వజ్రాలతో పోదిగిన ఆభరణాలకే మహిళలు మొగ్గు చూపుతున్నారు.

ప్రతీ ఏడాది ఈ పవిత్రమైన రోజున ఏదో ఒక ఆభరణం కోంటానని దీంతో తాను ధనికురాలనని భావిస్తానని బర్ దుబాయ్లో షాపింగ్ చేసిన మీనాక్షి బోయిర్ అనే వితంతురాలు అన్నారు. డబ్బు వున్న పక్షంలో తాను బంగారు ఆభరణాలను, లేని సమయంలో కనీసం బ్రేస్లెట్ అయినా కోంటానని చెబుతున్నారు. ఈ ఏడాది కూడా తన కోసం నగలు కొనేందుకు వచ్చానన్నారు. జలుబుతో భాధపడుతూ కూడా పవిత్రమైన రోజున కొబ్బరి బర్ఫీ తీన్నానని నీరు భరద్వాజ్ తెలిపారు. తన అస్వస్థతను పక్కన బెట్టి మరీ బర్ఫీని ఎంజాయ్ చేశానన్నారు. సాయంత్రం ధన్ తెరాస్ ను పురస్కరించుకుని బంగారు బ్రేస్ లెట్  కోసం దుకాణానికి పరుగులు తీశానని చెప్పారు.

మరోవైపు బంగారు అభరణాల ధరలు తగ్గుముఖం పట్టడంతో ఎక్కువ మంది ఆభరణాల కోనుగోలుకు సముఖం వ్యక్తం చేస్తున్నారు. దుబాయ్ లో 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర 136 ధిరములుగా వుంది. దీంతో 18 వేల రూపాయలకే పది గ్రాముల బంగారు ఆభరాలను సోంతం చేసుకునేందుకు, అందులోనూ పవిత్రమైన ధన్ తెరాస్ రోజున కోనుగోళ్లకు మహిళలు ఉత్సాహం చూపారు. ధరలు తగ్గినా.. కొనుగోలుదారులు పెద్ద సంఖ్యలో పెరగడంతో బంగారు దుకాణాలదారులు సంతోషాన్ని వెలిబుచ్చారు. ఓ వైపు ధరలు తగ్గడం, మరోవైపు ధన్ తెరాస్ రావడంతో గత వారం రోజుల నుంచి రద్దీని బాగానే వుందని మర్హబా జువెలర్స్ సీఈఓ దీపక్ జగ్జీవన్ సోని చెప్పారు. ధన్ తెరాస్ రోజున రద్దీని దృష్టిలో పెట్టుకుని తాము అనేక రకాల డిజైన్లలో అభరాణాలు సిద్దం చేశామని చెప్పారు.

 బంగారు, వెండి ఆభరణాలకు ధరలు తక్కువగా వుండడం, మంచి శుభసూచకంగా మారిందని లాలీ జువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ అనురాగ్ సిన్హా. ధరలు తక్కువగా ఉండడంతో తాము కనీస ధరలకే బంగారాన్ని కోనుగోలు చేశామన్న తృప్తి కోనుగోలుదారులలో ఉత్పనమైందని, అందుచేత అధికంగా కోనుగోళ్లు జరిగాయన్నారు. తమ డబ్బుకు పరిపూర్ణత చేకూరిందని భావిస్తేనే మహిళా కోనుగోలుదారుల జోరు వుంటుందన్నారు. అయితే పండగ రోజున సంప్రదాయక ఆభరణాలకు మాత్రం మహిళా కస్టమర్లు ఆస్తకి చూపలేదని, కేవలం తమ దైనిందిక జీవితాలలో కలసిపోయే అభరణాలకే అధికాసక్తి కనబర్చారని అనురాగ్ సిన్హా అన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles