Vishal sikka is next ceo of infosys

vishal sikka, Infosys ceo vishal sikka, vishal sikka selected as infosys ceo, infosys company, infosys news, infosys new ceo, vishal sikka new ceo of infosys,

Vishal sikka selected as ceo of infosys it company

ఇన్ఫోసిస్ సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న విశాల్ సిక్కా

Posted: 06/12/2014 03:32 PM IST
Vishal sikka is next ceo of infosys

(Image source from: vishal sikka is next ceo of infosys)

2014 రెవెన్యూ ప్రకారం... భారతదేశంలో వున్న ప్రముఖ ఐటీ కంపెనీలలో మూడవ స్థానాన్ని సంపాదించుకున్న ఇన్ఫోసిస్ లో కొత్త మార్పులు సంతరించుకుంటున్నాయి. తాజాగా ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీగా విశాల్ సిక్కా నియమితులయ్యారు. నిన్నటిదాకా ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన నారాయణమూర్తి... ఆ పదవి నుంచి తప్పుకుని గౌరవ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు.

ఈ విధంగా పదవీ మార్పులు చేసిన సందర్భంగా బెంగుళూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నారాయణమూర్తి మాట్లాడుతూ... ‘‘ఇన్ఫోసిన్ కంపెనీకి సీఈవోగా నియమితులయిన విశాల్ సిక్కాకు నా ధన్యవాదాలు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి పీహెచ్ డీ పూర్తి చేసిన విశాల్ సిక్కా లాంటి మేధావులు ఇటువంటి కంపెనీలకు ఎంతో ముఖ్యం. ఆయన నాయకత్వంలో ఇన్ఫోసిస్ మరింతగా అభివృద్ధి చెందుతూ ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని ఆశిస్తూ అభినందిస్తున్నాను’’ అని చెప్పారు.

ఆగస్టు 1వ తేదీ నుంచి ఇన్ఫోసిస్ పదవీబాధ్యతలను స్వీకరించనున్న విశాల్ సిక్కా కూడా ఈ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఇన్ఫోసిస్ సీఈవోగా బాధ్యతలను చేపట్టబోతున్నందుకు నాకు ఎంతో సంతోషంగా వుంది. డిజిటల్ ప్రపంచాన్ని భారతదేశానికి పరిచయం చేసింది ఇన్ఫోసిస్సే’’నంటూ పేర్కొన్నారు. అలాగే ఈయనతోపాటు ఇన్ఫోసిస్ సీవోవోగా యూవీ ప్రవీణ్ రావు నియమితులయ్యారు. నారాయణమూర్తి తనయుడు అయిన రోహన్ మూర్తి జూన్ 14వ తేదీవ ఇన్ఫోసిస్ నుంచి వైదొలుగుతున్నారు. మొన్నటిదాకా ఎగ్టిక్యూటివ్ వైస్ ఛైర్మన్ గా కొనసాగిన క్రిస్ గోపాలక్రిష్ణ్ కూడా తన పదవి నుంచి తప్పుకుని నాన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ గా కొనసాగుతారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles