New research prints blood vessels from inkjet printer

New research prints blood vessels from inkjet printer

New research prints blood vessels from inkjet printer

inkjet.gif

Posted: 08/14/2012 01:29 PM IST
New research prints blood vessels from inkjet printer

New research prints blood vessels from inkjet printer

 అత్యధిక  రిజల్యూషన్ కలిగిన చిత్రాలను  ముద్రించే  పరిజ్ణానాన్ని   సింగపూర్  శాస్త్రవేత్తలు రెట్టింపు చేశారు.  దీని ద్వారా  ఎలాంటి  ఇంక్, రంగు అవసరం లేకుండానే  అంగుళానికి  లక్ష  చుక్కలను  ముద్రించారు.  ఇది చిత్రాలను  ముద్రించే  విధానాల్లో  విప్లవాత్మక మార్పులకు  దారితీస్తుందని భావిస్తున్నారు.  శాస్త్రవేత్తల కమిటీలో భారత సంతతికి చెందిన కార్తిక్  కుమార్  కూడా ఉన్నారు.  సింగపూర్ లోని   ఇన్ స్టిట్యూట్  ఆఫ్  మెటీరియల్స్  రీసెర్చ్  అండ్  ఇంజినీరింగ్  (ఐఎంఆర్ ఈ) కి చెందిన  శాస్త్రవేత్తలు  ఈ ఘనత  సాధించారు.  వీరు స్పష్టమైన  పుల్ స్పెక్ట్రమ్ రంగులు  కలిగిన  చిత్రాలను  అంగుళానికి  లక్ష  చుక్కల చొప్పున  ముద్రించే  విధానాన్ని  రెట్టింపు చేశారు. 

దీని వల్ల నకిలీ ముద్రణకు తావు ఉండదు.  ప్రస్తుతమున్న ఇంక్ జెట్, లేజర్ జెట్ ప్రింటర్లు అంగుళానికి 10 వేల చుక్కల్ని  మాత్రమే అందించగలవు.  నానోమీటర్  పరిమాణంలో  ఉన్న లోహ నిర్మాణాలపై  ఎలాంటి  ఇంకు,  రంగులు లేకుండానే  పూర్తిస్థాయి వర్ణ చిత్రాలను  శాస్త్రవేత్తలు  తయారు చేశారు.  చిన్నపాటి  లోహపు తునకలను గాజులో  కలపడం  ద్వారా  తయారుచేసే స్టెయిన్డ్  గాజు నుంచి వీరు ప్రేరణ పొందారు.  గాజులోని  లోహపు తునకలు  కాంతిని చెల్లాచెదరు  చేసి స్టెయిన్డ్ గాజులో రంగులను  కలిగిస్తాయి.  ఇదే విధానాన్ని  ఉపయోగించి  ఆధునిక  నానో పరిజ్ణానం  సాయంతో  శాస్త్రవేత్తలు లోహపు  నానో నిర్మాణాలను  ఒక క్రమపద్దతిలో  అమర్చారు.  ఆ తర్వాత కాంతిని  పరావర్తనం  చెందించి,  కావల్సిన  రంగుల చిత్రాలను  పొందేలా  ఉపరితలాన్ని  రూపొందించారు.  వర్ణంలోని  నానో  చుక్కల పరిమాణం, వాటి మద్య ఉన్న  దూరాన్ని బట్టి రంగుల చిత్రాల  రిజల్యూషన్ ఉంటుంది.  అని కార్తిక్  కుమార్ చెప్పారు.  చుక్కలు  ఎంత  దగ్గరగా ఉంటే  చిత్రం అంత స్పష్టంగా  ఉంటుందని  వివరించారు.  ఈ చిన్న రంగుల చుక్కలను కచ్చితమైన  స్థానంలో  ఉంచడం ద్వారా అత్యంత  స్పష్టమైన చిత్రాలను  తాము రూపొందించామని  తెలిపారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gold price hits record in india track overseas mkts
Deccan chronicle shares  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles