The History Of Sangameshwar temple at Alampur Which is built by Pandavas | Mythological Stories

Sangameshwar temple alampur history pandavas built

Sangameshwar temple history, Alampur Sangameshwar temple, Alampur Temple, pandavas history, dwaparayug, kurukshetra fight

Sangameshwar temple Alampur History Pandavas Built : The History Of Sangameshwar temple at Alampur Which is built by Pandavas in dwaparayug.

పాండవులు ప్రతిష్టాత్మకంగా ప్రతిష్టించిన ‘శైవక్షేత్రం’ విశేషాలు

Posted: 05/22/2015 07:40 PM IST
Sangameshwar temple alampur history pandavas built

ద్వాపరయుగంలో పాండవులు కృష్ణా, తుంగభద్రానదుల సంగమమున ప్రతిష్టాత్మక శైవక్షేత్రమైన ‘కూడలి సంగమేశ్వర క్షేత్రం’ ప్రతిష్టించారు. ఈ క్షేత్రము పాలమూరు జిల్లా అలంపూర్ తాలూకాలో కృష్ణా, తుంగభద్రల సంగమం (కూడలి) దగ్గర వెలసింది. ఈ పుణ్యక్షేత్రము కృష్ణ, తుంగభద్ర నదుల మధ్య వెలసింది కాబట్టి.. అక్కడి ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఈ క్షేత్రములో మహాశివరాత్రి పర్వదినాన శివార్చనలు, సంబరాలు జరుగుతాయి.

పురాణ గాథ :

ద్వాపరయుగంలో పాండవులు మాయాజూదంలో ఓడిపోయిన అనంతరం అరణ్యంలో ఒక ఆశ్రమం నిర్మించుకొని నివసించేవారు. అప్పుడు కౌరవులు తమ భోగభాగ్యాలను వారిముందు ప్రదర్శించాలన్న అహంకారంతో ‘ఘోషయాత్ర’ పేరిట బయలుదేరారు. అయితే.. కౌరవులను తమ శతృవులుగా భావించే గంధర్వులు.. వారిని బంధిచి గంధర్వలోకానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని పసిగట్టిన పాండవాగ్రజుడు ధర్మరాజు.. గంధర్వుల చెరనుంచి కౌరవులను విడిపించమని భీముడు, అర్జునులను ఆదేశించాడు. అతని ఆదేశంమేరకు వారిద్దరూ గంధర్వుల చెరనుంచి విడిపించగా.. దానిని అవమానంగా భావించిన కౌరవ వీరులు అవమానంతో హస్తినాపురం చేరారు.

అపుడు కృష్ణుడు పాండవులను దండకారణ్యంలో గడపవలసిందిగా ఆదేశించగా.. వారు అరణ్య ప్రాంతాల్లో సంచరిస్తూ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తూ జీవనయాత్ర సాగిస్తున్నారు. అక్కడి ప్రజలను ఆదరిస్తూ, వారి వారి మన్ననలను పొందుతూ సంచార జీవితము గడిపేవారు. అలా సంచరిస్తూ మనసులను జలవిన్యాసాలతో ఆహ్లాదపరచే కృష్ణ, తుంగభద్ర నదుల సంగమానికి చేరుకున్నారు. రెండు నదుల సంగమము (కూడలి) కావున సంగమేశ్వరుని ప్రతిష్టించి పూజలు చేసి తరించాలని ధర్మరాజు తన కోరికను తన భార్య, సోదరులకు వెల్లడించాడు.

అతని కోరికను నెరవేర్చాలని భావించిన భీమసేనుడు... తన శక్తిసామర్థ్యాలతో కాశి క్షేత్రం చేరతాడు. అక్కడ అన్నపూర్ణ, విశ్వనాథస్వాముల ప్రార్థన చేసి అక్కడనున్న ఒక పవిత్ర శివలింగాన్ని తీసుకొని ఆఘమేఘాలమీద కృష్ణా, తుంగభద్రల సంగమానికి చేరుకున్నాడు. పాండవులు సకల పూజా ద్రవ్యాలు సేకరించి రెండునదుల కలయిక గట్టుపై ఆ శివలింగమును ప్రతిష్టించి, పూజా కార్యక్రమములు సాగించారు. ఇలా ఈ విధంగా ఈ క్షేత్రం ఏర్పడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sangameshwar temple  Alampur Temple  Pandavas History  

Other Articles