Shambhu lingeswara temple history special story kakatiya kingdom yadava kings

shambhu lingeswara temple history, shambhu lingeswara temple special story, shambhu lingeswara temple photos, shambhu lingeswara temple wikipedia, shambhu lingeswara temple historical story, kakatiya kingdom, kakatiya kings, yadava kings, lingeswara temples, shiva temples

shambhu lingeswara temple history special story kakatiya kingdom yadava kings : the history of shambhu lingeswara temple which is made by yadava kings in kakatiya kingdom before 1000 years.

కాకతీయుల కాలంనాటి చారిత్రాత్మక శివాలయం

Posted: 01/31/2015 07:49 PM IST
Shambhu lingeswara temple history special story kakatiya kingdom yadava kings

కొన్ని చారిత్రాత్మక విషయాలు కాలగర్భంలో కలిసిపోవడంతో ప్రతిష్టాత్మకమైన ఎన్నో సమాచారాలు అంతగా వెలుగులోకి రాలేకపోయాయి. కాకతీయుల సామ్రాజ్యం గురించి అందరికీ తెలిసే వుంటుంది కానీ.. వారి రాజ్యాంగంలో నిర్మించిన కొన్ని విశేషమైన కట్టడాలు ఆలస్యంగా వెలుగుచూశాయి. అందులో ఒకటిగా శంభులింగేశ్వర స్వామి దేవాలయాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు.

దాదాపు 1000 సంవత్సరాల క్రితంనాటికి సంబంధించిన ఈ శివాలయం.. ఓ మారుమూల ప్రాంతంలో వున్న నేపథ్యంలో చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన చారిత్రాత్మక సమాచారాలు అంతగా వెలుగులోకి రాలేదు కానీ.. దీని నిర్మాణశైలి కాకతీయుల కాలంనాటిదేనని అక్కడి లభించిన కొన్ని శాసనాల ద్వారా చారిత్రాత్మక నిపుణులు వెల్లడించారు. ఈ ఆలయంలో కొన్ని నమ్మశక్యంకానీ నిజాలు వెలుగులోకి వచ్చాయి. అవేమిటో తెలుసుకుందాం...

ఆలయ విశేషాలు :

ఈ ఆలయం నల్లగొండజిల్లా కోదాడ దగ్గరలోని మేళ్లచెరువులో వుంది. జాతీయ రహదారి నుంచి కేవలం 10 కి.మీ. దూరంలో వుంటుంది. ఇక్కడ లభించిన శిలాశాసనాల ప్రకారం ఇది 11వ శతాబ్దంలో యాదవరాజులు నిర్మించినట్లు నిపుణులు తెలుపుతున్నారు. ఈ ఆలయం ఎంతో ప్రత్యేకమైంది. ఎందుకంటే.. 1.83 మీ. ఎత్తు, 0.34 మీ. చుట్టుకొలత కలిగి వున్న ఈ ఆలయం ప్రతి సంవత్సరం పెరుగుతూ వుంటుంది. ఈ శివలింగం పెరిగే ఎత్తు ఒక ఎత్తయితే.. ప్రతి అడుగు తర్వాత ఒక వలయం ఏర్పడటం మరో ఆశ్చర్యం. ఈ విధంగా ఇది పెరుగుతూ.. మొదటి మూడు నామాలు పెట్టే స్థలం నుంచి ఇప్పుడు ఆరునామాలు పెట్టేంత స్థలం ఏర్పడిందని ఆలయ అర్చకులు చెబుతుంటారు.

ఇంకొక విచిత్రం ఏమిటంటే.. ఈ శివలింగం పై భాగంలో ఓ చిన్న ఖాళీ ప్రదేశముంది. ఈ ప్రదేశంలో ఎప్పుడూ నీరు ఊరుతూనే వుంటుంది. ఈ నీరు విగ్రహంపై అభిషేకంలా ఉబుకుతుంది. అంటే శివుని ఝటాఝూటంలోని గంగమ్మ వారిలా ఈ నీళ్లు ఉబుకుతూ వుంటుంది. ఈ నీటిని ఎంత తీసివేసినా.. తిరిగి మళ్లీ ఊరుతూనే వుంటుంది. దేశంలో కేవలం వారణాసిలో మాత్రమే వుండేది. ఇప్పుడు ఈ శివాలయం కూడా అలాగే వుండటంతో దీన్ని దక్షిణ కాశీ అని పిలుస్తారు.

చరిత్ర :

కాకతీయుల కాలంలో ఒక ఆవు ప్రతిరోజూ వచ్చి ఈ శివలింగానికి క్షీరాభిషేకం చేసేదట. దానిని గమనించిన ఓ యాదవ కాపరి.. ఆ రాయి శివలింగం అని తెలియక దాన్ని 11 ముక్కలుగా చేసి వేర్వేరు ప్రదేశాల్లో పారేశాడట. అయితే రెండో రోజు చూస్తే అది తిరిగి మళ్లీ అక్కడ లింగంగా ప్రత్యక్షమై కనిపించిందట. ఈ మొత్తం వ్యవహారం ఆ కాపరికి అర్థం కాక రాజుగారికి వెళ్లి వినిపించాడు. దాంతో ఆయన ఆ రాయిని పరిశీలించిన అనంతరం దాన్ని శివలింగంగా గుర్తించి ఆలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shambhu lingeswara temple  kakatiya kingdom  yadava kings  

Other Articles