Gomateshwara bahubali statue history karnataka state jainism

gomateshwara bahubali story, gomateshwara bahubali life history, gomateshwara bahubali wikipedia, gomateshwara bahubali wiki, gomateshwara bahubali statue, gomateshwara bahubali statue news, gomateshwara bahubali statue details, gomateshwara bahubali life story, gomateshwara bahubali place, indian history, jainism, indian jainism history

gomateshwara bahubali statue history karnataka state jainism

జైనమత ప్రబోధకుడైన ‘బాహుబలి’ ఏకశిలా విగ్రహ విశేషాలు

Posted: 11/11/2014 03:30 PM IST
Gomateshwara bahubali statue history karnataka state jainism

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అద్భుతకట్టడాలుగా పేరొందినవన్నీ మానవ నిర్మితాలే! ఆనాడు ఎంతోమంది శ్రామికులు ఎన్నోకష్టాలు ఎదుర్కొంటూ అద్భుతమైన భారీ కట్టడాలను ఎన్నో నిర్మించారు. సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన నేటి కట్టడాలకంటే అవి ఎంతో బలమైనవిగా, ఆకర్షణీయంగా వున్న నేపథ్యంలో వాటిని మానవ అద్భుతనిర్మాణాలను వర్ణించడం జరుగుతోంది. ఇతర దేశాల్లో వున్న వాటికంటే భారతదేశంలో పురాతన కాలానికి చెందిన కట్టడాలు లెక్కలేనన్నీ వున్నాయి. అటువంటిలో ఈ ‘బాహుబలి’ విగ్రహం ఒకటి! ఈయన పూర్తిపేరు గోమటేశ్వర బాహుబలి. జైనమత ప్రబోధకుడు. ఆనాడు ఈయన అందించిన సేవలకుగాను అప్పటి ప్రజలు ప్రత్యేకంగా ఒక విగ్రహాన్ని నిర్మించారు. ఇప్పుడా విగ్రహం భారతదేశంలో వున్న ఏడు అద్భుత విగ్రహాల్లో ఒకటిగా స్థానం కల్పించుకుంది.

విగ్రహ విశేషాలు :

1. క్రీ.శ. 983 ప్రాంతంలో గంగా రాజైన రాచమల్ల (రాచమల్ల సత్యవాక్ IV క్రీ.శ.975-986)కు మంత్రి అయిన చాముండరాయ కర్నాటక రాష్ట్రంలోని శ్రావణబెలగోల పట్టణానికి దగ్గర్లోని చంద్రగిరి కొండ మీద నిర్మించారు. ఈ విగ్రహం ఒక తామరపుష్పంపై నిల్చి ఉంటుంది. తలభాగం నుంచి తొడలప్రాంతం వరకు ఎటువంటి ఆధారం లేకుండా వున్న ఈ విగ్రహం 17.8 మీటర్ల పొడవు వుండి.. విగ్రహ ముఖం 6.5 ft m పరిమాణంలో ఉంటుంది. జైన ఆచారం ప్రకారం ఈ విగ్రహం పూర్తి నగ్నంగా నిర్మించడం జరిగింది. తెల్లటి గ్రానైట్ ద్వారా ఈ మహావిగ్రహాన్ని ఆవిష్కరించారు.

2. ఈ విగ్రహం గొప్ప మతసంబంధమైన సంకేతంగాను గుర్తింపు పొందింది. జైనమతంలో మొదటగా మోక్షం (పుట్టుక, మరణం అనే చక్రబంధం నుంచి విముక్తి) పొందింది బాహుబలియేనని జైనులు విశ్వసించడం వల్లే ఈ విగ్రహానికి మంచి పేరొచ్చింది. ఇది ఎంత ఎత్తుగా వుంటుందంటే.. దాదాపు 30 కి.మీ. దూరంనుంచి చూసినా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చక్కటి శరీర సౌష్టవం, ఏకశిల పరిమాణం, కళానైపుణ్యం, హస్త నైపుణ్యాల మేలు కలయికలాంటి అంశాల కారణంగా మధ్యయుగ కర్నాటక శిల్పకళకు సంబంధించి ఈ విగ్రహం ఒక విశిష్ట సాధనగా పేరుగాంచింది. అంతేకాదు.. అతిపెద్ద ఏకశిలా విగ్రహంగానూ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధించింది.

bahubali-abhishekam-statues

మరికొన్ని విషయాలు :

గోమటేశ్వర విగ్రహమున్న ప్రదేశమంలో చుట్టుపక్కల కూడా జైనమతం, జైన తీర్థంకరులకు సంబంధించిన అనేక విగ్రహాలు నిండి వుంటాయి. ఇదిలావుండగా.. ప్రతి 12 సంవత్సరాలకోసారి వేలాదిమంది భక్తులు ఈ ప్రదేశానికి చేరుకుని  ‘‘మహామస్టకాభిషేకం’’ నిర్వహిస్తారు. ఎంతో బ్రహ్మాండమైన రీతిలో నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా వేయి సంవత్సరాల పురాతనమైన గోమటేశ్వర విగ్రహాన్ని పాలు, పెరుగు, నెయ్యి, కుంకుమపువ్వు, బంగారు నాణేలతో అభిషేకిస్తారు. ఈ రకమైన అభిషేకం చివరిసారిగా 2006 ఫిబ్రవరిలో నిర్వహించారు. మళ్లీ 12 ఏళ్ల తర్వాత అంటే.. 2018లో ఈ అభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gomateshwara bahubali  jainism  indian history stories  telugu news  bahubali  

Other Articles