సీనియర్ కమేడియన్ అలీ అధికార వైసీపీ పార్టీకి రాజీనామా చేయనున్నారా.? అంటే ఔనన్న సమాధానాలే వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని అధికార వైసీపీ పార్టీలో సినీమారంగం నుంచి ఆశించినంత స్థాయిలో మద్దతు లేదు. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అన్ని రంగాల నుంచి అభినందనలు వెల్లివిరిసినా.. సీనిరంగం నుంచి మాత్రం ఆశించిన స్థాయిలో అభినందనలు కూడా వెల్లివిరయలేదు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన మరోక అంశముంది. సినీరంగం నుంచి పెద్దలు రాకపోయినా.. దర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురళి, హస్యనటుడు అలీ, పృధ్వీరాజ్, ఇలా కొందరు మాత్రం ఏమీ ఆశించకుండానే వైసీపీ అండగా నిలిచారు.
వైసీపీలో చేరిన అలీ.. పార్టీ కోసం ప్రచారం చేయడమే కాదు.. తన మిత్రడిని ఆయన పార్టీని కూడా కాదనుకుని మరీ జగన్ పాదయాత్ర సమయంలోక్రియాశీలంగా వ్యవహరించారు. పార్టీ అధికారంలోకి రాకముందు ఆయన తన వంతుగా పార్టీ కోసం కృషి చేశారు. జిల్లాలు, పట్టణాల్లో పర్యటించిన వైసీపీకి ఓటు వేయాలని ఓ సినీకళాకారుల బృందంతో ప్రచారం చేశారు. అయితే 2019 ఎన్నికల తరువాత పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయనకు జగన్ కూడా అంతే ప్రాదాన్యత ఇచ్చారు. పార్టీలో సముచిత స్థానం కల్పించాలని భావించిన జగన్.. తాను ముఖ్యమంత్రి ఆయన తరువాత అలీని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవెలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా నియమించారు.
తెలుగు చిత్రసీమ రంగం హైదరాబాదులో స్థిరపడిన నేపథ్యంలో.. అక్కడి నుంచి విశాఖకు తీసుకువచ్చేందుకు అలీ చేస్తున్న కృషిని కూడా జగన్ ప్రశంసించారు. దీంతో పాటు సినిమా టికెట్ల అంశంలోనూ ప్రముఖ అగ్రనటులతో పాటు అలీని కూర్చోబెట్టి అభిప్రాయాలు సేకరించారు. ఈ అంశం ముగిసిన తరువాత సీఎం జగన్.. హాస్యనటుడు అలీని ప్రత్యేకంగా పిలుపించుకుని.. ఆయనకు రాజ్యసభ అవకాశం ఇస్తానని హామి ఇచ్చారని వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో అలీ వాటిని బలపర్చేలా.. త్వరలో మీకు ఓ గుడ్ న్యూస్ ఉంటుందని కొండంత సంతోషాన్ని తన మన్సుసులో దాచుకుని మరీ చెప్పారు.
దీంతో అలీకి రాజ్యసభ పక్కా అని అందరూ ఫిక్స్ అయిపోయారు. అలీ కూడా ఈసారి జగన్ తనకు అవకాశమిస్తారని భావించినట్లు ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. అయితే ఎవరూ ఉహించని విధంగా పార్టీ తరుపు నుంచి రాజ్యసభకు వెళ్లే వారిలో అలీ పేరు లేకపోవడం ఆయన కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పగా అప్పటికే పూర్తైన రాజకీయ సమీకరణల నేపథ్యంలో అధి సాధ్యంకాదని చెప్పిన జగన్.. అవకాశం వచ్చినప్పుడు ఆయనను రాజ్యసభకు పంపుతానని హామి ఇచ్చారన్న వార్తలు వినిపించాయి. అయితే తీరా ఆ అవకాశం వచ్చిన తరువాత అలిని పార్టీ అధినేత విస్మరించారా.? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇన్నాళ్లుగా రాజ్యసభ నోటిఫికేషన్ కోసం ఎదురుచూసిన తరువాత.. సామాజిక రాజకీయ కారణాలను తమ భుజాలపైకి ఎత్తుకున్న వైసీపీ అధిష్టానం తనను విస్మరించడంతో ఆయన పార్టీ అధిష్టానంపై కినుకు వహించారని సమాచారం. పార్టీ గెలుపులో కీలకంగా వ్యహరించిన తనను పక్కనబెట్టిన వైసీపీ అధిష్టానం.. తనకు దిమ్మదిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే షాక్ ఇవ్వడంతో అలీ మనస్తాపం చేందినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తనకు అత్యంత సన్నిహిత నేతలతో మాట్లాడిన ఆయన.. ఇకపై నుంచి పార్టీ వ్యవహారాలకు కాస్త దూరంగా ఉండాలని భావిస్తున్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more
May 18 | గుజరాత్ కాంగ్రేస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పటీదార్ ఉద్యమ నేత హర్థిక్ పటేల్.. సరిగ్గా ఎన్నికలకు ముందు తన మనసు మార్చుకున్నారు. 24 గంటల ముందు తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో చర్చించిన తరువాత... Read more
Mar 18 | కాంగ్రెస్ పార్టీకి కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకొనే కోమటిరెడ్డి బ్రదర్స్.. కాషాయ బాట పట్టనున్నారా?. అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొన్న తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నేత వివేక్ వెంకటస్వామితో భేటీ... Read more
Mar 18 | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీని మరింత ఆందోళనకు గురి చేశాయి. మరీ ముఖ్యంగా పంజాబ్‌లో అధికారాన్ని తిరిగి అందుకుంటామన్న అంచనాలు నెలకొనగా, తాజా పలితాలతో అక్కడి కూడా పరిస్థితి అద్వానంగా... Read more
Mar 17 | రాష్ట్రంలో 2024లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ వ్యతిరేక ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకురావాలన్న యోచనలో జనసేన ఉన్నట్లు తెలుస్తోంది. జనసేన 9వ ఆవిర్భావ సభలో ప్రసంగించిన పవన్ కల్యాణ్ ఈ మేరకు సంకేతాలను... Read more