Govt cuts import duty on refined palm oil to 12.5% రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. ధరల తగ్గింపుపై కేంద్రం చర్యలు..

Amid assembly elections centre cuts import duty on crude palm oil to lower retail edible oil prices

Assembly Elections, five states assembly elections, import duty, Oil Prices, Palm oil, Edible oil imports, oil year, consumption, import, export, petrol price, diesel price, farmers year long protest, minimum support price, farmers demands, farm laws withdrawl, PM Narendra Modi, Amit Shah, Punjab Elections, Haryana assembly Elections, Uttar Pradesh assembly Elections, National Politics

The government on Tuesday reduced basic customs duty on crude palm oil to 10 per cent, which will help bring down the edible oil prices in the retail market. The Central Board of Indirect Taxes and Customs (CBIC) in a notification cut the basic customs duty on crude palm oil to 10 per cent and refined palm oil to 37.5 per cent with effect from Wednesday.

రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. ధరల తగ్గింపుపై కేంద్రం చర్యలు..

Posted: 12/21/2021 09:27 PM IST
Amid assembly elections centre cuts import duty on crude palm oil to lower retail edible oil prices

కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం వచ్చే ఏడాది తొలినాళ్లలో జరిగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించినట్లు వుంది. దేశవ్యాప్త ప్రజలపై ఇంధన ధరలు ప్రభావం చూపిన విషయాన్ని గ్రహించిన సర్కార్.. ఇప్పటికే గత కొన్నిరోజులుగా వాటి జోలికి కూడా వెళ్లడం లేదు. అంతర్జాతీయంగా బ్యారెట్ క్రూడ్ అయిల్ ధరలు తగ్గినా.. వాహనాదారులకు మాత్రం ఆ ప్రయోజనాన్ని కల్పించకుండా ఎక్సైజ్ సుంఖం పేరుతో తన్నుకుపోయిన ప్రభుత్వం.. రానున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఆ ప్రభావం పడకూడదని ముందస్తు చర్యలకు తీసుకుంటోంది. దీంతో ఓ మెట్టు దిగిన ప్రభుత్వం ఇంధన ధరలపై భారీగా పెంచిన ఎక్సైజ్ సుంకాన్ని కూడా స్వల్పంగా తగ్గించింది.

దాదాపు ఏడాది కాలంగా కేంద్ర ప్రభుత్వ నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా పోరాడిన రైతుల విషయంలోనూ సర్కారు పలు మెట్టు దిగిన విషయం తెలిసిందే. సాగు చట్టాలను వెనక్కు తీసుకోవడంతో పాటు ఇకపై రైతులు పండించే పంటలకు ఎంఎస్పీ పై కూడా చట్టం తీసుకువస్తామని.. దాంతో పాటు రైతులు కోరిన పలు డిమాండ్లను కూడా నేరవేర్చుతామని అంగీకరిస్తూ ఏకంగా లిఖితపూర్వక హామిని కూడా ఇచ్చింది. దీంతో ప్రజల పల్స్ తమకు వ్యతిరేకంగా మారుతుందని అర్థమైన మోడీ సర్కర్ ఈ చర్యలకు పూనుకుందన్న ఊహాగానాలు ఊపందుకుంది. అందుకనే అటు ఇంధనం, ఇటు రైతు సమస్యలను దెబ్బకు పరిష్కారించాయని వాదనలు వినబడుతున్నాయి.

ఇక వంటగ్యాస్ సబ్సీడీ సిలిండర్ ధరను కూడా గత రెండు నెలలుగా పెంచేందుకు కూడా సాహపించడం లేదు. అయితే అంతకుముందే తమకు కావాల్సినంతగా పెంచేశారని విపక్షాలు అరోపిస్తున్నాయి. ప్రజలు వంటింట్లో ఇప్పటికే మోదీ సర్కార్ పోగ పెట్టిందని.. ఎన్నికల ముందు వారు ఎన్ని వేశాలు వేసినా.. గెలిచిన తరువాత వారు పెంచే ధరలను ప్రజలు మర్చిపోలేరని.. మనుషులను విభజించి పాలించే పరదేశీయులు వదిలివెళ్లిన సూత్రాన్ని పట్టుకున్న ప్రధాని.. పైకి మాత్రం ఐక్యత, ఒక్కటి, సభ్ కా వికాస్ అంటూ సూక్తులు చెబుతారని ఇప్పటికే విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. నాలుగేళ్లు ప్రజలపై భారం మోపి ఎన్నికల నేపథ్యంలో మాత్రం తగ్గిస్తూ మసిబూసి మారేడు కాయను చేస్తోందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

ఇక కరోనా లాంటి కష్టకాలంలోనూ కేంద్రం ప్రజలను అదుకునే చర్యలకు స్వస్తి పలికి.. ఓ వైపు రైళ్ల ప్రయాణాలపై భారం పెంచిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇక ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు వచ్చిన గొప్ప వ్యక్తుల ఇళ్లు కార్యాలయాలపై ఐటీ దాడులు కూడా నిర్వహించిన ఘటన కేంద్రంలోని మోడీ సర్కారుదేనని ఆరోపిస్తున్నారు. ఇలా విపక్షాలు ఎన్ని అరోపణలు చేస్తున్నా.. ప్రజలు తమ ప్రభుత్వంతో ఇబ్బందులు పడుతున్న విషయాలను పసిగడుతూ.. వాటి ధరలను తగ్గించే చర్యలకు కేంద్రం పూనుకుంటోంది., ఇందులో భాగంగా తాజాగా వంటనూనెల ధరలను తగ్గించే ప్రయత్నాలకు కేంద్రప్రభుత్వం పూనుకుంది.

దేశీయంగా సరఫరా పెంచి, వంటనూనెల ధరలను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా రిఫైర్డ్‌ పామాయిల్‌పై బేసిక్‌ కస్టమ్‌ సుంకాన్ని 17.5 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించింది. సవరించిన ఈ బేసిక్‌ కస్టమ్‌ డ్యూటీ (BCD) నేటి నుంచి అమలులోకి రానుండగా.. వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు అమలులో ఉంటుందని సీబీఐసీ పేర్కొంది. డిసెంబర్ 2022 వరకు లైసెన్స్ లేకుండా రీఫైన్డ్‌ పామాయిల్‌ను దిగుమతి చేసుకునేందుకు వ్యాపారులకు అనుమతి ఉంటుందని సోమవారం జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.

ఇదే సమయంలో ముడి పామాయిల్, పలు ఇతర వ్యవసాయ వస్తువుల కొత్త డెరివేటివ్ ఒప్పందాలపై నిషేధం విధించింది. ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయికి చేరుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ చర్యలు చేపట్టింది. అంతకు ముందు జూన్‌లో నూనె ధరల పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ ఏడాది డిసెంబర్‌ 31 వరకు రిఫైర్డ్‌ పామాయిల్‌ దిగుమతిపై నిషేధం విధించింది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం.. సోమవారం రిటైల్‌ మార్కెట్లో వేరు శెనగ నూనె కిలో రూ.181.48, ఆవనూనె రూ.187.43, వనస్పతి రూ.138.5, సోయాబీన్ ఆయిల్ రూ.150.78, పొద్దుతిరుగుడు నూనె రూ. 163.18, పామాయిల్ రూ.129.94గా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles