manikyala rao sensational comments on TDP govt రాష్ట్ర ప్రగతి మర్చి.. రాజకీయ లబ్దికే ఓటు..

Manikyala rao sensational comments on tdp government

narayana, cpi, national secretary, BJP, TDP, Congress, chandrababu, special status, special package, Manikyala Rao, tonsure, Political analysts, PM Modi, politics

Minister manikyala rao sensational comments on TDP government, says it will be a huge loss to TDP just like a tonsure whereas its just a loss of single hair to them.

రాష్ట్ర ప్రగతి మర్చి.. రాజకీయ లబ్దికే ఓటు..

Posted: 02/20/2018 03:30 PM IST
Manikyala rao sensational comments on tdp government

బీజేపీ నేత, ఆంధ్రప్రదేశ్ అమాత్యుడు పైడికొండల మాణిక్యాలరావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలోని అధికార తెలుగుదేశం పార్టీతో పోత్తును ఇప్పటికిప్పుడు తెంచుకునే ఉద్దేశం లేదంటూనే ఆయన చేసిన వ్యాఖ్యలను రాజకీయ విశ్లేషకులు తప్పబడుతున్నారు. పార్టీలే పరమావదిగా నేతలు పనిచేస్తే.. అది కొంతకాలానికి మాత్రమే పరిమితం అవుతుందని, ఇప్పటికే అనేక మంది నేతలు ఇలాంటి చర్యలతో కాలగర్భంలో కలసిపోయి ఉనికి చాటుకునేందుకు కూడా అష్టకష్టలు పడుతున్నారని పేర్కొంటున్నారు.

అయితే అదే సమయంలో ప్రజల కోసం పనిచేసే నేతల వెంట.. ప్రజలు నిత్యం వుంటారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే బీజేపి నేత మాణిక్యాల రావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచినా ఫర్వాలేదని అనిపించేలా వున్నాయని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. నవ్విపోతురు గాక నాకేటి అన్నట్లుగా కేవలం రాజకీయ ప్రయోజనాలను, పార్టీ పరంగా నిర్ణయాలను తీసుకునే నేతల వెంట ఎవరుంటారని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అంధ్రరాష్ట్ర వ్యక్తిగా హుందాగా కేంద్రం వద్దకు వెళ్లి నిధులు రాబట్టుకు రావాల్సిన నేతలు.. ఇలా వెంట్రకంత నష్టమేనని వ్యాఖ్యలు చేయడం సముచితం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వస్తే కొండ వస్తుందని, టీడీపీతో తెగదెంపులు చేసుకుంటే, ఓ వెంట్రుకపోయినట్టని వ్యాఖ్యానించిన ఆయన తీరును అంధ్రప్రాంత వాసులు ఎండకడుతున్నారు. రాష్ట్ర ప్రగతి కన్నా రాజకీయ ప్రగతిపైనే నేతల దృష్టి సారించారని మండిపడతున్నారు. టీడీపీకి బోడిగుండు మిగులుతుందని వ్యాఖ్యానించిన క్రమంలో ఆ పార్టీలో మంత్రులుగా ఎలా కొనసాగుతున్నారన్న ప్రశ్నలు సైతం ఉత్పన్నమవుతున్నాయి. టీడీపీ ఎన్డీయే నుంచి వెళ్లిపోయినా కేంద్రంలోని తమ ప్రభుత్వం ఏమీ కాదన్న మంత్రి వ్యాఖ్యలు ప్రజలు గమనిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. రాష్ట్రం గురించి మరచి రాజకీయ ప్రయోజనమే మేరకే నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ నేతల పరిస్థితులను ఓ పర్యాయం గమనించాలని కోరుతున్నారు.

రాజకీయ లబ్ది కోసమే రాష్ట్ర విభజనకు పాల్పడిన కాంగ్రెస్ నేతలకు రాష్ట్రంలోనే ఉనికిని కరువయ్యేలా చేసిన చరిత్ర ప్రజలదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అదే కాంగ్రెస్ నేతలు తాజాగా అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పిస్తామని కొత్త అంశాన్ని తెరపైకి తెస్తున్న క్రమంలో బీజేపి నేతలు అప్రమత్తంగా వ్యవహరించాల్సింది పోయి.. అవసర వ్యాఖ్యలు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రజలు జాతీయస్థాయిలో కాంగ్రెస్ ను అదరించేలోపు బీజేపి నేతలు మేలుకోవాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles