Raghuram Rajan To Head Federal Reserve మనం వద్దన్న వ్యక్తినే అగ్రరాజ్యం కావాలంటుందా.?

Raghuram rajan ideal choice to lead us federal reserve chairman

Raghuram Rajan, ex RBI governer, Raghuram Rajan economist, Barrons newspaper article, Rajan US Central Bank, Rajan Federal Reserve

US President Donald Trump is expected to soon announce a successor to Federal Reserve Chair Janet Yellen, whose term expires early next year.

అగ్రరాజ్య కేంద్రీయ బ్యాంకు చైర్మన్ గా రఘురాం రాజన్..?

Posted: 11/01/2017 11:41 AM IST
Raghuram rajan ideal choice to lead us federal reserve chairman

రఘురామ్ రాజన్.. ప్రముఖ అర్థిక నిపుణుడు.. భారతీయుడైన రాజన్ ను భారత దేశం వద్దు.. అని తరిమేసింది. అయితే అగ్రరాజ్యం మాత్రం ఆయనను అక్కున చేర్చుకుంది. భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బిఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌.. అమెరికా కేంద్ర బ్యాంక్‌.. ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ అయ్యే అవకాశం కల్పించనుందా? అంటే అవుననన్న సంకేతాలే వస్తున్నాయి. రాజన్ సేవలను అందుకోవాలని.. దేశం ప్రగతిబాటలో పయనించేందుకు ఆయన అర్థిక విధానాల అవలంభన అత్యంత అవసరమని భావిస్తుంది అమెరికా.

అంతర్జాతీయ ఆర్థిక అంశాలు విషయవిశేషాల పత్రిక ‘బారన్స్‌’ ఈ మేరకు రాజన్ పేరును అమెరికా కేంద్రీయ బ్యాంకు చైర్మన్ గా ప్రతిపాదించింది. ఆ పదవికి రాజన్‌ ముమ్మాటికి సరైన అభ్యర్థి అంటోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పదవికి రాజన్ అత్యంత సరైన అభ్యర్థి అని పేర్కొంది. చికాగో యూనివర్సిటీ బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఆర్థిక శాస్త్ర ఆచార్యుడిగా పని చేస్తున్న రాజన్ ఆర్‌బిఐ గవర్నర్ గా భారత ఆర్థిక వ్యవస్థను ఎలా చక్కిదిద్దిందీ ఆ పత్రిక గుర్తు చేసింది. ఫెడ్‌ రిజర్వ్ ప్రస్తుత చైర్ పర్సన్‌ జానెట్ ఎలెన్ వచ్చే ఏడాది ప్రారంభంలో రిటైర్‌ అవుతారు. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఆ స్థానంలో మరోకర అర్థిక నిపుణుడిని ప్రకటించాలి. దీంతో రఘురాం రాజన్ పేరును బారన్స్ తెరపైకి తీసుకువచ్చింది.
 
ఇందుకోసం ఇప్పటికే కొంత మంది పేర్లతో కూడిన ఒక జాబితా అధ్యక్షుడికి అందింది. అందులో రాజన్ పేరు లేదని సమాచారం. అయినా బారన్స్ పత్రిక రాజన్ పేరును తెరపైకి తీసుకురావడం విశేషం. ఆర్బిఐ గవర్నర్ గా భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త జవసత్వాలు కల్పించడంతో పాటు 2008 ఆర్థిక సంక్షోభాన్ని రాజన్ మూడేళ్ల ముందే గుర్తించి హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేసింది. ఫెడ్ రిజర్వ్‌ చైర్మన్ పదవికి రాజన్ కు ఉన్నన్ని మంచి అర్హతలు ప్రస్తుత పరిస్థితుల్లో కాగడా వేసి వెతికినా మరొకరిలో కనిపించవని పేర్కొంది. దీంతో రాజన్ పేరును ట్రంప్ పరిగణలోకి తీసుకుంటారా..? లేక అగ్రరాజ్యానికి చెందిన నిపుణులనే పెడ్ చైర్మన్ గా నియమిస్తారా..? అన్నది వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles