బాలయ్యతో బైరెడ్డి డిస్కషన్లు.. మళ్లీ పార్టీలోకి? | Seema Key Leader Back to TDP Soon

Byreddy back to tdp

Byreddy Rajasekhar Reddy, Byreddy Rajasekhar Reddy TDP, Byreddy Rajasekhar Reddy Back to Telugu Desam Party, Byreddy Chandrababu Naidu

Byreddy Rajasekhar Reddy plans to Back Telugu Desam Party. Already discussed with MLA Balakrishna for Clarence.

బైరెడ్డి బ్యాక్ టూ టీడీపీ

Posted: 09/02/2017 03:30 PM IST
Byreddy back to tdp

నంద్యాల ఊపుతో టీడీపీలోకి ప్రతిపక్షం నుంచి వలసలు కొనసాగుతాయని అధికార పక్ష నేతలు చెబుతున్నప్పటికీ ఎన్నికల వరకు అది జరగొచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ లోపు పార్టీ నుంచి వెళ్లిపోయినా కొందరు పాత నేతలు మాత్రం మళ్లీ పసుపు కండువా వేసుకునేందుకు రెడీ అయిపోతున్నారు. అందులో మొదటగా రాయలసీమ నుంచి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పేరు వినిపిస్తోంది.

రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడిగా ఎలాంటి ప్రభావం చూపలేకపోయిన బైరెడ్డి తన ఉనికి కనుమరుగు అయిపోయే స్థితికి చేరుకున్నారు. మళ్లీ టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. టీడీపీ తరపును రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బైరెడ్డి రాష్ట్ర విభజన సమయంలో సొంత కుంపటి పెట్టుకున్నారు. నంద్యాల ఉప ఎన్నికలో కూడా రాయలసీమ పరిరక్షణ సమితి తరపున భవనాశి పుల్లయ్యను బరిలోకి దింపారు. అయితే ఊహించని విధంగా తమ అభ్యర్థికి కేవలం 154 ఓట్లు మాత్రమే వచ్చాయి.

దీంతో, తన రాయలసీమ పోరాటాన్ని విరమించుకోవాలనే నిర్ణయానికి ఆయన వచ్చినట్టు తెలుస్తోంది. టీడీపీలోకి చేరేందుకు ఆయన దాదాపు సిద్ధమైపోయారని సమాచారం. ఈ నెల 5వ తేదీన ముచ్చుమర్రిలో తన సన్నిహితులతో సమావేశం నిర్వహించనున్నారని... అక్కడే తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. మరోవైపు టీడీపీలో చేరే విషయమై ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో హైదరాబాదులో ఇప్పటికే బైరెడ్డి చర్చలు జరిపారని చెప్పుకుంటున్నారు. అన్ని కుదిరితే వారంలోనే బైరెడ్డి మళ్లీ సెకిలెక్కే ఛాన్సుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Byreddy Rajasekhar Reddy  Telugu Desam Party  MLA Balakrishna  

Other Articles