అటు ఊచల హెచ్చరికలు.. ఇటు పదేపదే తప్పిదాలు..! Don't Troll Lokesh, You May Land in Jail

Don t troll lokesh you may land in jail

lokesh trolled in social media, AP IT minister nara lokesh trolled in social media, nara lokesh jail, nara lokesh jail bars, troll, social media, whatsapp, facebook, twitter, TdP, telugu desam, Nara Lokesh, Chandrababu Naidu, Andhra pradesh, politics

AP IT Minister Lokesh is toying with the idea of initiating criminal action against 'miscreants' who are 'trying' to 'tarnish' the image of government and the party.

అటు ఊచల హెచ్చరికలు.. ఇటు పదేపదే తప్పిదాలు..!

Posted: 04/18/2017 04:33 PM IST
Don t troll lokesh you may land in jail

టీడీపీ పార్టీకి చిన్నబాబు అనగానే అందరూ ఠక్కున గుర్తుపడతారు. అయన మరెవరో కాదు టీడీపీ అధ్యక్షుడు చంద్రాబాబు తనయుడు నారా లోకేష్. ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికైన ముహూర్తం బాగోలేనట్టుంది. అప్పటి వరకు చిన్నబాబు పార్టీలో క్రీయాశీలకంగా వ్యవహరిస్తూ.. పార్టీని గాడిలో పెట్టే పనులతో పాటు కార్యకర్తల సంక్షేమం కోసం కూడా పాటుపడ్డారు. అయితే ఎమ్మెల్సీగా ఎన్నిక కవడం విషయాన్ని పక్కనబెడితే అయన ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయడం నుంచే అయనపై నెట్ జనులు జోకులు వేసుకుంటున్నారు.

ఎమ్మెల్సీగా నేను రాను.. రానున్న సాధారణ ఎన్నికలలో పార్టీ అదేశించిన స్థానం నుంచి పోటీ చేసి గెలిచి ఆ తరువాత ప్రభుత్వంలోకి వస్తానని తేల్చిచెప్పిన లోకేష్ బాబు.. హఠాత్తుగా తన నిర్ణయాన్ని మార్చుకుని ఎమ్మెల్సీగా ఎన్నికకావడంతో పాటు.. మంత్రిగానూ పగ్గాలను అందుకున్నారు. దీంతో తాను తీసుకున్న నిర్ణయానికే తాను కట్టుబడటంలో లోకేష్ బాబు విఫలమయ్యారన్న వార్తులు వినిపిస్తునే వున్నాయి, ఈ క్రమంలో ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఆయన నాలుక తీరగకపోవడం, నుంచి ఆయనపైన నెట్ జనులు జోకులు వేసుకుంటున్నారు.

భక్తి శ్రద్దలతో అనే పదాన్ని శ్రద్దాంజలి అని పలకడం నుంచి ఆయనపై జోకులు పేలుతున్నాయి. అంతకు ముందు కేవలం టీఆరఎస్ నేతలు మాత్రమే ట్విట్టర్ పిట్ట అని ముద్దుగా పిలిచేవారు. కానీ నెట్ జనులు మాత్రం స్థాయివుందా లేదా అన్న విషయాన్ని కూడా మర్చిపోయి మరీ విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం లోకేష్ రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి. రాష్ట్ర మంత్రి పరువును బజారుపాలు చేస్తూ సోషల్ మీడియాలో జోకులు వేసుకుంటూ నవ్వించడం, వాటిని విరివిగా ప్రచారం చేయడం కూడా టీడీపీకి పార్టీకి మింగుడు పడని పరిణామాలను తీసుకువస్తుంది.

బాబా సాహెబ్ అంబేథ్కర్ 126వ జయంతి సందర్భంగా వర్థంతి అని పలికడం నెట్ జనులను మరింతగా నవ్వించింది. అంబేధ్కర్ వర్థంతి సందర్భంగా అందరీకి శుభాకాంక్షలు చెప్పిన మంత్రి ఎవరైనా వున్నారంటే అది కేవలం లోకేస్ బాబే అంటూ నెట్ జనులు అయనను తెగవాడేసుకుంటున్నారు. ఇలా నెట్ జనుల చేతిలో ఆయన చిక్కి శల్యం కాకముందే.. ఆయన డ్యామేజ్ అయిన పరువును కాపాడటానికి టీడీపీ చర్యలు చేపట్టినట్టు సమాచారం.

ఇకపై టీడీపీ పార్టీపైన కానీ లేదా పార్టీ ప్రధాన కార్యదర్శి, ఏపీ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పై కానీ జోకులను క్రియేట్ చేసి.. వాటిని పోస్టు చేసినా.. లేక షేర్ చేసిన నెట్ జనులపై చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం సిద్దమైంది. పార్టీ ఇమేజ్ తో పాటు తన ఇమేజ్ ను డ్యామేజ్ చేసే విధంగా ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే.. వారిపై చర్యలు తీసుకోవాలని పార్టీ నిర్ణయించింది. దీనిపై రాష్ట్ర పౌర సంబంధాల శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఈ అంశాన్ని బడ్జెట్ సమావేశాల్లోనే అసెంబ్లీలో పెట్టాలని భావించామని, కానీ పెట్టలేకపోయామని అన్నారు.

ఇదిలావుంటే అటు జైలు ఊచలు లెక్కించాల్సి వస్తుందన్న హెచ్చరికలు చేస్తున్న తరుణంలోనే మళ్లి చిన్నబాబు నోరు జారారు. తాజాగా, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని కరపలో నిర్వహించిన సభలో లోకేశ్ పాల్గొన్నారు. రాబోయే రెండేళ్లలో అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కరించడమే తన లక్ష్యమని లోకేశ్ చెప్పాలనుకున్నారు. అయితే, పొరపాటుపడ్డ లోకేశ్.. ‘రాబోయే రెండేళ్లలో అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్య ఏర్పాటే తన లక్ష్యంగా పెట్టుకున్నానని అన్నారు. దీంతో, ఆశ్చర్యపోవడం కరప వాసుల వంతు అయింది. మరి డ్యామేజ్ కంట్రోల్ చర్యలు ఎవరిపైన తీసుకుంటారో.. ఎలాంటి చర్యలు చేపడతారో వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : troll  social media  whatsapp  facebook  twitter  TdP  telugu desam  Nara Lokesh  Chandrababu Naidu  Andhra pradesh  politics  

Other Articles