జంపింగ్ బాషాకు లక్కు దక్కనుందా? | ministry for jumping minority MLA

Ministry for jumping minority mla

ministry for jumping minority MLA, Ananthapuram Kadiri MLA, Attar Chand Basha, అత్తార్ చాంద్ బాషా, ఏపీ రాజకీయాలు, పొలిటికల్ న్యూస్, అనంతపురం, కదిరి ఎమ్మెల్యే, AP political news, AP news, politics, latest political news

ministry for jumping minority MLA. Ananthapuram Kadiri MLA Attar Chand Basha chances to got ministry in CBN cabinet.

జంపింగ్ బాషాకు లక్కు దక్కనుందా?

Posted: 05/26/2016 04:28 PM IST
Ministry for jumping minority mla

ఇరు తెలుగు రాష్ట్రాల్లో జంపింగ్ ల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. తెలంగాణ లో ఒక్క రేవంత్ రెడ్డి తప్ప తెలుగు తమ్ముళ్లంతా కారెక్కగా, ఏపీలో మాత్రం ఆకర్ష్ దెబ్బకి ప్రతిపక్ష వైకాపా విలవిలలాడిపోతుంది. ఈ వలసలు ఇంకా కొనసాగి పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశం లేకపోలేదు కూడా. భారీగా డబ్బు, పదవులు ఆశ చూపి తమ నేతలను లాగేసుకుంటున్నారని జగన్ గగ్గోలు పెడుతున్నప్పటికీ అదంతా అరణ్య రోదనగానే మిగులుతుంది. ఈ సంగతి కాసేపు పక్కన పెడితే పార్టీ ప్రాబల్యం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం అధినేత చంద్రబాబు దృష్టిసారించినట్లు అర్థమవుతోంది. ఇప్పటికే కర్నూల్ తోపాటు, విజయనగరం-బొబ్బిలి రాజకీయాలను చక్కదిద్దిన ఆయన ఇప్పుడు మిగతా ప్రాంతాల్లో దృష్టిసారించారు.

కోస్తా, రాయలసీమ జిల్లాల నాయకత్వ లోపాలను సరిదిద్దటంతోపాటు పార్టీ మారిన నేతలకు మంత్రి పదవులు కూడా కట్టబెట్టేందుకు సిద్దమౌతున్నారు. ఈ జాబితాలో అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా కూడా ఉన్నారంట. అనంతపురం జిల్లాలో మొత్తం టీడీపీకి పట్టుఉన్నప్పటికీ, ఉరవకొండ, కదిరిలో మాత్రం వైసీపీ విజయం సాధించింది.  వీరిలో మైనారిటీ వర్గానికి చెందిన అత్తార్ చాంద్ బాషా కీలకం. నిజానికి ఆయన తొలుత టీడీపీలోనే ఉండేవారు. ఎన్నికలకు కాస్తంత ముందుగా ఆయన వైసీపీకి మారారు. బలమైన అభ్యర్థి అయిన టీడీపీ నేత కందికుంట వెంకటప్రసాద్ పై చాంద్ బాషా ఘనవిజయం సాధించారు. కట్ చేస్తే... ఇటీవలే 17 మంది వైకాపా ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరగా అందులో చాంద్ బాషా కూడా ఒకరు. అయితే మంత్రి ఆశ చూపడటంతోనే ఆయన తిరిగి టీడీపీ గూటికి చేరారన్న టాక్ ఇప్పుడు జిల్లాలో బలంగా వినిపిస్తుంది. పరిటాల కుటుంబంతో ఎప్పటి నుంచో మంచి సంబంధాలు ఉండటంతోపాటు, వివాదరహితుడిగా పేరు ఉండటంతో చాంద్ బాషాకు మంత్రి బెర్తు దక్కడం దాదాపు లాంఛనమే కానుంది. అయితే దీనిపై జేసీ వర్గం నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ananthapuram  kadiri MLA  Attar Chand Basha  cabinet  

Other Articles