Is Modi will not come to inauguration of Amaravati

Modi for inauguration of amaravati

Amaravati, Chandrababu, inauguration, Chandrababu Naidu, AP, AP capital, capital City of AP, Babu with Modi, Chandrababu Naidu in delhi, Chandrababu Naidu Delhi Tour, Chandrababu Naidu with Modi

AP cm Chandrababu naidu invited Pm Modi for the inauguration of Amaravati. Amaravati inauguration on this dasara. AP govt did all arrangements for the inauguration.

మోదీ అమరావతికి వస్తాడా.? రాడా.?

Posted: 10/14/2015 11:32 AM IST
Modi for inauguration of amaravati

ఏపి నూతన రాజధాని అమరావతి శంఖుస్థాపనకు చంద్రబాబు ప్రభుత్వం అంతా సిద్దమవుతోంది. అందుకుగాను కావాల్సినఅ అన్ని ఏర్పాట్లను కూడా చంద్రబాబు నాయుడు ముందుండి పర్యవేక్షిస్తున్నారు. చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా. ప్రతి ఆంధ్రుడు తల ఎత్తుకునేలా అమరావతి ఏర్పాట్లను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తోంది ఏపి ప్రభుత్వం. అయితే ఈ కార్యక్రమానికి అందరిని ఆహ్వానిస్తున్నారు చంద్రబాబు నాయుడు. జపాన్ ప్రధానిని, సింగపూర్ ప్రధానిని, ప్రధాని మోదీని, కేంద్ర మంత్రులను, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను, గవర్నర్ లను, పలువురు రాజకీయ, వివిధ రంగాల ప్రముఖులకు ఆహ్వానం పంపారు చంద్రబాబు నాయుడు. అయితే ప్రధాని నరేంద్ర మోదీని గతంలోనే కలిసిన చంద్రబాబు ఖచ్చితంగా అమరావతి శంఖుస్థాపనకు రావాలని మరీ మరీ చెప్పారు. అయితే తాజాగా అమరావతి శంఖుస్థాపనకు మోదీ వస్తారా .? రారా .? అన్న సందిగ్దం ఏర్పడింది. ఇలా ఎందుకు అని అనుకుంటున్నారా..?

అమరావతి శంఖుస్థాపనకు చంద్రబాబు నాయుడు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకుగాను అధికారులను పురమాయించారు. అయితే అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి మోదీని ప్రత్యేకంగా ఆహ్వానించారు చంద్రబాబు నాయుడు. ప్రధాని మోదీ కూడా వస్తానని హామీ ఇచ్చినట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. దసరా నాటి కార్యక్రమాల వివరాలను కూడా మీడియా కు వెల్లడించింది ప్రధాని కార్యాలయం. కానీ తాజాగా చంద్రబాబు నాయుడు మరోసారి దిల్లీకి ప్రయాణం కావడం.. మరోసారి మోదీతో భేటి కానుండటం చర్చనీయాంశంగా మారింది. మోదీ అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి రావడం లేదా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మోదీ ఆహ్వానం కంటే ముందు సింగపూర్ ప్రధానికి, జపాన్ ప్రధానికి చంద్రబాబు నాయుడు ఆహ్వానం పంపండం మోదీకి కాస్త కోపం తెప్పించింది అని సమాచారం. ఒకసారి ప్రధాని కార్యాలయం నుండి ప్రధాని షెడ్యూల్ విడుదల అయ్యాక కూడా చంద్రబాబు నాయుడు మళ్లీ మోదీతో భేటికి కారణాలు ఏంటా అని రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మోదీని ప్రసన్నం చేసుకోవడానికే తాజాగా దిల్లీ భేటి అని కూడా ప్రచారం నడుస్తోంది. మరి నిజంగా మోదీ అలకపూనారో లేదంటే వేరే కారణాలు ఉన్నాయో తెలియాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles