cash for vote, Phone tapping, chandrababu, babu security and drivers role

Cash for vote case acb probe on chandra babu security drivers role

cash for vote case, ACB, Telangana Government, Chandrababu, Security, Drivers, ACB probe on babu drivers, acb probe in chandrababu security, section 8, hyderabad, Revanth reddy, mathaiah jerusalem sebestian, udaya simha, jennybabu, srinivasulu naidu

Telangana ACB officials probe on AP chief minister chandrababu drivers and security role in cash for vote case

చంద్రబాబు సెక్యూరిటీ, డ్రైవర్ల నెంబర్లపై ఏసీబి ఆరా..?

Posted: 08/22/2015 01:56 PM IST
Cash for vote case acb probe on chandra babu security drivers role

ఓటుకు కోట్లు కేసును తెలంగాణ ఏసీబీ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సహా నలుగురిని ఇప్పటికే అరెస్టు చేసిన ఏసీబి.. ఇప్పుడు పలువురిని విచారిస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద పనిచేస్తున్న డ్రైవర్లు, సెక్యూరిటీ సిబ్బంది ప్రమేయంపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే యువనేత నారాలోకేష్ డ్రైవర్ కు నోటీసులు ఇచ్చిన ఏసీబికి.. తమ విచారణలో మరిన్ని విస్తుగోలిపే విషయాలను వెలుగుచూసినట్లు తెలుస్తోంది.

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వీరి ఫోన్ నెంబర్లతో ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించినట్టు సమాచారం. రికార్డయిన కాల్ డేటా ఆధారంగా ఏసీబీ అధికారులు కూపీ లాగుతున్నారు. బుధవారం చంద్రబాబు ఇంటికి వెళ్లిన తెలంగాణ పోలీసులు, ఆయన ఇంటి సమీపంలో విచారించారు. చంద్రబాబు నాయుడి కుమారుడు లోకేష్ వద్ద పనిచేస్తున్న భద్రత సిబ్బంది, వారి ఫోన్ నెంబర్లపైనా ఆరా తీశారు. వచ్చిపోయే కార్ల నెంబర్లను సేకరించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు మళ్లీ నోటీసులు ఇచ్చేందుకు హడావుడి చేసినట్టు సమాచారం.

మరోవైపు ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో విజయవాడ కోర్టు నోటీసులతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయింది. కోర్టు నోటీసులు తదనంతర పరిణామాలపై సీఎస్‌ రాజీవ్‌ శర్మ శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శితో పాటు పలువురు పోలీస్‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాల్‌ డేటా భద్రపరచడంతోపాటు న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరిపినట్లు సమాచారం. విజయవాడ కోర్టు ఆదేశాల మేరకు క్రితం రోజు సాయంత్రం ఏపీ పోలీస్‌ అధికారులు తెలంగాణ సీఎస్‌కు నోలీసులు అందజేశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cash for vote case  ACB  Telangana Government  Chandrababu  Security  Drivers  

Other Articles