two more TDP MLAs to join TRS Ahead of MLC Polls

2 tdp mlas may join into trs

A days ahead of Legislative Council elections under MLAs' quota, Telangana TDP received another jolt as its two more MLAs to join TRS, 2 TDP MLAs, may join, TRS,

A days ahead of Legislative Council elections under MLAs' quota, Telangana TDP received another jolt as its two more MLAs to join TRS

టీఆర్ఎస్ లోకి మరో ఇద్దరు టీటిడిపీ ఎమ్మెల్యేలు

Posted: 05/31/2015 10:56 PM IST
2 tdp mlas may join into trs

కూకట్ పల్లి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే మాదవరం కృష్ణారావు ఇచ్చిన షాక్ నుంచి తేరుకోక ముందే, తెలంగాణ టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగలనుందా..? అంటే అవుననే సమాధానాలే వినబడుతున్నాయి. టీఆర్ఎస్లోకి మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు చేరే అవకాశముందని సమాచారం. జూన్ 1న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వనున్నట్టు సమాచారం. టీడీపీ ఎమ్మెల్యేలు వెంటనే టీఆర్ఎస్లోకి చేరకపోయినా ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం చేరవచ్చని తెలుస్తోంది.

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా శాసనసభ సభ్యుల కోటాలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్.. పార్టీ శాసనసభ్యులకు అవగాహన కల్పించారు. పార్టీ ఎమ్మెల్యేలపై తనకు పూర్తి నమ్మకం వుందని, గడిచిన ఏడాది కాలంప పాటు నిజాయితీ పనిచేశారని, ఎమ్మెల్సీ ఎన్నికలలోనూ అదేవిధంగా పనిచేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఐదుగురు అభ్యర్థులను గెలిపించకునే సత్తా తమ పార్టీకి వుందని, అంతే కాకుండా మరో ఎమ్మెల్యే మద్దతు టీఆర్ఎస్ అభ్యర్థులకు అదనంగా వుందని కేసీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కేసీఆర్ ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 2 TDP MLAs  may join  TRS  

Other Articles