TDP | National party | Lokesh | Tamilnadu | Karnataka

Tdp party plans to get national level identification

TDP, National party, lokesh, nara chandrababu, karnataka, tamilnadu, bengalore, chennai, hyderabad, mahanadu

TDP party plans to get national level identification. Nara chandrababu naidu son nara lokesh focus to TDP party national level. n tamilnadu, orissa, karnataka and maharastra tdp has some political strength.

జాతీయ పార్టీగా టిడిపి.. రంగంలోకి లోకేష్..?

Posted: 04/27/2015 11:18 AM IST
Tdp party plans to get national level identification

ఒకప్పుడు జాతీయ రాకీయాల్లో చక్రం తిప్పిన చంద్రబాబు నాయుడు ఇప్సడు పార్టీనీ జాతీయ స్థాయికి తీసుకువెళ్లడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశాల్లో పాగా వేయడానికి కసరత్తు మొదలుపెట్టింది. ఇక్కడ పార్టీ సభ్యత్వాన్ని భారీ ఎత్తున చేపట్టి సత్తా చాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో తెలుగు వారి గురించి పార్టీ శ్రేణులు అధ్యయనం చేశాయి. త్వరలో జరగనున్న పార్టీ మహానాడులో ఈ మేరకు ప్రకటన చేయాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. అయితే గతంలో ఎన్డీయే హయాంలోని ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కీలకంగా వ్యవహరించారు. అంతకు ముందే ఎన్టీఆర్ పార్టీని స్థాపించినపుడు కూడా కేంద్రంలో చక్రం తిప్పింది తెలుగుదేశం పార్టీ. బహుశా పాత విషయాలను గుర్తుకు పెట్టుకోవడంతో పాటు, తెలుగు రాష్ట్రాల్లో అంతకు ముందు ఉన్న బలాన్ని ఉపయోగించుకొని, మరిన్ని రాష్ట్రాల్లో పార్టికి ఉన్న సానుకూలతను వాడుకోవాలని టిడిపి ఆలోచిస్తున్నట్లు సమాచారం.

తమిళనాడు,కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సాపొరుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడానికి స్వయంగా నారా లోకేష్ రంగంలోకి దిగారట. ఆయన నేతృత్వంలో ఈ నాలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు మే ఒకటో తేదీన హైదరాబాద్‌లో సమావేశమవుతున్నారని సమాచారం. దీనికి హాజరు కావాల్సిందిగా తమిళనాడులోని తెదేపాకు సంబంధించి కీలక వ్యక్తులు, కార్యకర్తలకు హైదరాబాద్ కేంద్ర కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. కర్ణాటక, తమిళనాడుపై లోకేష్ ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం. ఇక్కడ తెలుగువారి ప్రాబల్యం చాలా ఎక్కువ. చెన్నై, బెంగళూరు లాంటి నగరాల్లో లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారు. వారిలో తెదేపా అభిమానులూ ఎక్కువే. కొన్ని దశాబ్దాలపాటు ఈ రాష్ట్రాల్లో ఉన్న తెలుగు కుటుంబాల్లో చాలా వరకు పార్టీ మద్దతుదారులు ఉన్నారు. ఒక్క తమిళనాడులోనే కనీసం ఐదు లక్షల సభ్యత్వాలైనా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. కర్ణాటకకు గాలి ముద్దుకృష్ణమనాయుడు, పయ్యావుల కేశవ్; తమిళనాడుకు బీద మస్తాన్‌రావు, కురుగుండ్ల రామకృష్ణను ఇంఛార్జులుగా నియమిస్తారని, మహానాడులో ఈ నియామకాల గురించి ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. మరి మొత్తానికి గత కొంత కాలం నుండి వినిపిస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ హోదా నిజంగా సాధ్యమా.. తెలుగుదేశం పార్టీ తెలుగు రాష్ట్రాలతో పాటు మిగిలిన రాష్ట్రాలకు కూడా విస్తరిస్తుందా అన్నది ప్రస్తుతానికి సమాధానాలు లేని ప్రశ్నలు. అయినా ఇంకా లోకేష్ బాబు ఏ ఎన్నికల్లో పోటీనే చెయ్యలేదు కానీ అప్పుడే జాతీయ స్థాయిలో ఆలోచిస్తున్నారా అని కూడా కొందరు అనుకుంటున్నారట. మరి లోకేష్ బాబు వీటిని వింటే ఏం సమాధానం చెబుతారో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  National party  lokesh  nara chandrababu  karnataka  tamilnadu  bengalore  chennai  hyderabad  mahanadu  

Other Articles