Sania | Saina | Kcr

Telangana cm kcr political strategy behind saina nehwal saniamirza

Telangana, cm, kcr, saniamirza, sainanehwal, batminton, top

telangana cm kcr political strategy behind saina nehwal, saniamirza. chief minister K Chandrasekhar Rao to honour badminton player Saina Nehwal who has become the world number one, like the way the state government had honoured tennis player Sania Mirza in the past.

కెసిఆర్ సైనాను కాదని సానియా మీర్జాను

Posted: 04/02/2015 01:49 PM IST
Telangana cm kcr political strategy behind saina nehwal saniamirza

సానిమా మీర్జా, సైనా నెహ్వాల్ ఇద్దరూ హైదరాబాదీలే. ఇద్దరు ప్రపంచం మెచ్చే మేటి స్పోర్ట్స్ పర్సన్స్. కానీ ఇద్దరిలోంచి ఎవరు కాస్త బెటర్ గా ఆడుతున్నారని ఆరా తీస్తే మాత్రం సైనా నెహ్వాల్ ప్రస్తుతం అదరగొడుతోంది. అయితే ఆట సంగతి ఏమో కానీ వీరిద్దరి మధ్య తెలంగాణ కెసిఆర్ మాత్రం నలిగిపోతున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా సానియా మీర్జాను గతంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నియమించారు. ఏకంగా కోటి రూపాయలను చెక్కు రూపంలో ఆమెకు అందించారు. అయితే తెలంగాణ క్రీడాకారిణి, అందులో ప్రపంచ స్థాయి పేరున్న సానియా పై ఎవరూ పెద్దగా వ్యతిరేకించలేదు. అయితే తాజాగా సైనా నెహ్వాల్ గురించి కెసిఆర్ గుర్తించకపోవడంపై సర్వత్రా చర్చ సాగుతోంది. అసలు సానియా మీర్జాకు మాత్రమే కెసిఆర్ కోటి ఎందుకు ఇచ్చారు మరి సైనా నెహ్వాల్ కు కూడా కోటి ఇవ్వచ్చు కదా ఇలా అనేక ప్రశ్నలు వస్తున్నాయి. అయితే అసలు కెసిఆర్ సానియామీర్జాను ఆకాశానికి ఎత్తెడంపై ఓ పుకారు షికారు చేస్తోంది. ఇంతకీ అదేంటంటే...

తెలంగాణ ప్రభుత్వం తమ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రపంచ స్థాయిలో ఎంతో పేరున్న సానియా మీర్జాను నియమించుకుంది. అందుకు గాను తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కోటి రూపాయలు కూడా ఇచ్చేశారు. అయితే కెసిఆర్ ఇలా సానియామీర్జానే ఎందుకు తెలంగాణ బ్రాండ్ అంబాసిటర్ గా ఎంచుకున్నారు. ప్రస్తుతం ఎంతో వేగంగా దూసుకెళుతున్న సైనా నెహ్వాల్ గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్న. అయితే ముందు నుండి ముస్లిం మైనార్టీల భజన చేస్తూ వచ్చిన కెసిఆర్, వారిని ఆకట్టుకోవడంలో రకరకాల ప్రయత్నాలను చేస్తూవచ్చారు. అందులో భాగంగానే ఓ మతానికి చెందిన సానియామీర్జాను బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తే పార్టీకి కొంత సింపధి వర్కౌట్ అవుతుందని కెసిఆర్ ఆలోచించారట. అందుకే హిందువైన సైనా నెహ్వాల్ ను వదిలి, ముస్లిమైన సానియాను కెసిఆర్ అందలం ఎక్కించారని ఓ పుకారు. అయితే కలిసినప్పుడల్లా కోటి రూపాయలు ఇస్తున్న కెసిఆర్ కు సైనా నెహ్వాల్ మాత్రం కనిపించడం లేదా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరి ప్రతిభ ఆధారంగా చూసినా సైనానే దూసుకెళుతోంది. అయితే చెక్కులతో సానియా ను కలిసే కెసిఆర్, సైనా ను మాత్రం పూల బొకేలతో కలుస్తున్నారని మండిపడుతున్నారు. తాజాగా సైనా నెహ్వాల్ ప్రపంచ బ్యాట్మింటన్ ఫెడరేషన్ లో అగ్రస్థానాన్ని పొందింది. తాజాగా ప్రకటించిన జాబితాలో సైనా నెహ్వాలే టాప్ పొజిషన్ లో ఉంది. మరి కెసిఆర్ గారికి మాత్రం సైనా కనిపించడం లేదని కేవలం సానియా మాత్రమే కనిపిస్తారా అని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  cm  kcr  saniamirza  sainanehwal  batminton  top  

Other Articles