Former delhi cm sheila dikshit residence

Former Delhi CM Sheila Dikshit residence, Manmohan Singh shifts to Sheila Dikshit residence, Sheila Dikshit Bangla rennovated with 17 laksh

Former Delhi CM Sheila Dikshit residence

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ వైభవం!

Posted: 07/03/2014 06:54 PM IST
Former delhi cm sheila dikshit residence

అది నం. 3, మోతీలాల్ నెహ్రూ మార్గ్, న్యూఢిల్లీ.  పూర్వం ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అధికారిక నివాసం.  ప్రస్తుతం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసం.

ఢిల్లీ ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేపట్టిన సమయంలో షీలా దీక్షిత్ అధికారిక నివాసాన్ని ఆమె అభిరుచికి తగ్గట్టుగా మార్పులు చెయ్యటానికి 16.81 లక్షల రూపాయల ఖర్చైందని సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ తెలియజేసింది.  వివరాలలోకి పోతే,

అందులో 31 ఎసిలు, 21 హీటర్లు, మరెన్నో ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు అమర్చబడ్డాయి.  

సమాచార హక్కు కింద అందిన సమాచారాన్నిబట్టి ఇప్పుడు ఆ బంగ్లాలో 31 ఎసిలు, 15 కూలర్లు, 25 హీటర్లు, 16 ఎయిర్ ప్యూరిఫైయర్స్, 12 గీజర్లు ఉన్నాయి.  ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగిన తర్వాత షీలా దీక్షిత్ ఒక ప్రైవేట్ అపార్ట్ మెంట్ లో 2000 చ.అడుగుల ఫ్లాట్ లో నివసించారు.  ఆ తర్వాత ఆ బంగ్లాను వదిలిపెట్టి కేరళలో గవర్నర్ గా అక్కడి రాజ్ భవన్ లోకి వెళ్ళారు.  

పాత బంగ్లాలోని ఎలక్ట్రికల్ ఎక్విప్ మెంట్ లో కొన్నిటిని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో అవసరానికి అనుగుణంగా వాడారట.  మిగిలినవాటిని కూడా కార్యాలయాలలో అవసరాన్నిబట్టి వాడుతారట.  

నాలుగు బెడ్ రూమ్ ల బంగ్లా 1920 లో 3.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది.  

షీలా దీక్షిత్ తర్వాత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాసంగా మారినప్పుడు ఈ బంగ్లాకి మరోసారి దశ తిరిగి 35 లక్షల రూపాయలతో సొబగులను సంతరించుకుందట.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles