Ys jagan family upset seemandhra election results

jagan family upset, ys jagan upset in seemandhra results, seemandhra election results, ysr congress party, 2014 election, 2014 election results.

ys jagan family upset seemandhra election results

పాయే ..పాయే .జగన్ పరువు పోయే?

Posted: 05/17/2014 04:24 PM IST
Ys jagan family upset seemandhra election results

పాయే..పాయే… జగన్ పరువు పాయే అని ఆ పార్టీలోని కార్యకర్తలు అంటున్నారు. సీమాంద్ర లో ఓటర్ కొట్టిన దెబ్బకు.. వైసీపీ అధికారం రాకుండా పోయింది. సరికొత్త హామీలలో, పవన్ పంచ్ డైలాగ్స్ తో సీమాంద్ర ప్రజలు బాగా ఆకట్టుకున్నారు జగన్ కుటుంబ సభ్యులు. కానీ 2014 ఎన్నికల్లో మాత్రం జగన్ పప్పులు ఉడకలేదు. పులివెందలలో జగన్ గెలిచినప్పటికి.. విశాఖలో పోటీ చేసిన జగన్ తల్లి విజయమ్మ ఓడిపోవటం జరిగింది.

సీమాంద్రలో అధికారం మాదే అని అతి విశ్వాసంతో.. రొమ్ము విరుచుకున్న జగన్ పార్టీకి సీమాంద్ర ప్రజలు హర్రర్ సినిమా చూపించారు. కొన్ని ప్రాంతాల్లో జగన్ పార్టీ నేతలో గెలిచినప్పటికి.. అధికారం లేదని బాధ అందరిలో కనిపిస్తుంది.

విలవిలలాడుతున్న జగన్ పార్టీ నేతలు

వైఎస్ విజయమ్మ విశాఖలో పోటీ చేసి , బీజేపీ పార్టీ నేత హరిబాబు పై ఓడిపోయింది. దీంతో విజయమ్మ ఓటమిని తలచుకొని వైసీపీ నేతలు విలవిలలాడుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే.. ‘‘తల్లినే గెలిపించుకోలేని జగన్ .. ఇక సీమాంద్ర ప్రజలకు ఏం చేస్తాడనే విమర్శలు పార్టీలో వినిపించటంతో.. గెలిచిన జగన్ మనసు విలవిలలాడిపోతుందని ..పార్టీలోని సీనియర్ నాయకులు అంటున్నారు.

అందుకే మీడియా ముందు జగన్ ..తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడ్ని టార్గెట్ చేయటం జరిగింది. మేము ఎంతో ఓవర్ టైం పని చేసిన సీమాంద్ర ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకోలేదని జగన్ బాధపడుతూ చెప్పటం జరిగింది. అయితే పార్టీలోని నాయకులు మాత్రంలో చెబుతున్నారు. మేము అతిగా ప్రచారం చేయటం, ప్రెస్టెజ్ ఇష్యూగా తీసుకొని, ప్రత్యర్థుల పై విసిరిన కామెంట్ల ఫలితమే.. మాకు ఇలా జరిగిందని అంటున్నారు.

మొత్తానికి జగన్ ఫ్యామిలీకి దక్కాల్సిన పవర్ దూరంగా వెళ్లిపోయింది. మళ్లీ పవర్ జగన్ దక్కలాంటే.. ఐదు సంవత్సారాలు ఆగాల్సిందే. అప్పటి దాక జగన్ ప్రతిపక్షంలో కూర్చునో..ఐదు సంవత్సరాల పాటు ఓదార్పు యాత్ర చేసుకోవాల్సిందేనని.. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles