మనం సినిమాల్లో చూస్తుంటాం- విలన్లు తమ పిల్లలను వెనకేసుకురావటం, వాళ్ళ తప్పులకు కొమ్ముకాస్తూ, అయితే ఏంటట అని అడుగుతుంటారు.
పిల్లలన్నాక తప్పు చేస్తారు- రేప్ లు కూడా చేస్తారు అయితే వాళ్ళని ఉరేస్తారా అంటూ ముంబై శక్తి మిల్స్ లో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ ముగ్గురు నిందితులను వెనకేసుకొచ్చారు సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు ములాయమ్ సింగ్ యాదవ్. వాళ్ళకి ఉరిశిక్ష ఖరారు చేసిన సుప్రీం కోర్టు తీర్పును తప్పు పడుతూ, పిల్లలకు ఉరిశిక్ష విధిస్తారా అంటూ మొరాదాబాద్ లో ఎన్నికల ప్రచారంలో ప్రసంగించిన ములాయమ్ సింగ్ సవాల్ చేసారు. అత్యాచార నిరోధక చట్టాన్ని కూడా ఆయన సవాల్ చేసారు.
అంతకు ముందంతా బాగానే ఉంటుంది కానీ ప్రేమికుల మధ్య విభేదాలు రాగానే అతను రేప్ చేసాడంటుందా అమ్మాయి. ఇక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు, కోర్టులో కేసులు నడుస్తాయి అంటూ ములాయమ్ సింగ్ గురువారం నాడు వ్యాఖ్యలు చేసి వివాదాలకు తెరదించారు.
రాజకీయనాయకులు ఏమైనా మాట్లాడారంటే దానివెనక రాజకీయ లబ్ధి ఉంటుంది. అసలే తక్కువ సమయం ఉన్నప్పుడు సామాన్యంగా అవసరమైన మాటలే మాట్లాడుతారు. అందులోనూ ములాయమ్ సింగ్ లాంటి రాజకీయ అనుభజ్ఞులు. ఆ మాట ఆయన ఎందుకన్నారు, ఎక్కడున్నప్పుడు అన్నారు, ఏ సందర్భంలో అన్నారు అన్నది చూస్తే అసలు విషయం తెలిసిపోతుంది.
ముజప్ఫర్ నగర్ అల్లర్లలో చాలామంది మహిళలు అత్యాచారానికి గురయ్యారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మైనార్టీల వోట్లను గెలుచుకోవటానికే ఆయన అలా అన్నారని ఇతర రాజకీయనాయకులకైతే స్పష్టంగా అర్థమైంది.
మహిళలకే కాదు సమాజానికే వ్యతిరేకమైన ఈ వ్యాఖ్యలను ఖండించటమే కాదు వోటెయ్యకుండా ములాయమ్ ని శిక్షించండంటూ కిరణ్ బేడి పిలుపునిచ్చారు. కాంగ్రెస్, భాజపా, ఆఆపా అన్ని పార్టీల నాయకులూ ములాయమ్ సింగ్ యాదవ్ వ్యాఖ్యలను తీవ్రస్థాయిలో ఖండించారు. అత్యాచారాన్ని చిన్న తప్పుగా మాట్లాడిన ములాయమ్ సింగ్ ని అందరూ దుయ్యబట్టారు.
ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన తన రాజకీయ లబ్ధికోసం చేస్తే, దాన్ని ఖండించినవారిలో చాలామంది తమ రాజకీయ లబ్ధికోసం కూడా ఖండించటం జరిగింది. అయితే రాజకీయాల కోసం సమాజంలో మహిళల భద్రతకు పెనుసవాలుగా ఉన్నాయి ములాయమ్ సింగ్ వ్యాఖ్యలంటూ రాజకీయాలకు సంబంధం లేనివారు కూడా ఆయన మాటలను ఘాటుగా విమర్శించారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more