Saris transportation obstruced by tdp looted

Election 2014, Indian polls 2014, saris transportation obstructed by TDP looted, Telugu Desam party

saris transportation obstructed by TDP looted

అడ్డుకున్న చీరల తరలింపు, ఆ చీరల దోపిడీ

Posted: 04/07/2014 09:57 AM IST
Saris transportation obstruced by tdp looted

తాతా తాతా సూది దొరికింది అన్నాడట మనుమడు.  ఏదిరా అంటే పోయిందన్నాడట.  తాత వెదుకుతున్న సూది దొరకటం జరిగింది, అది మళ్ళీ పోవటం కూడా జరిగిపోయింది.  నెల్లూరు జిల్లాలో తరలిస్తున్న చీరలను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు.  కానీ పోలీసులు రావటానికి ముందుగానే వాటిని మరో బృందం వచ్చ దోచుకుపోయింది.

నెల్లూరు జిల్లా పెళ్ళకూరు మండలంలో శిరసనం బేడు రాజుపాలెం సమీపంలో ఆదివారం అర్థరాత్రి అప్రమత్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అక్రమంగా తరలిస్తున్న చీరెల బస్తాలను పట్టుకున్నారు.  రవాణా చేస్తున్న వాహనాలను ఆపి పోలీసులకు ఫోన్ చేసారు.  అయితే పోలీసు బలగాలు వచ్చే లోపులోనే మరో యువకుల బృందం ద్విచక్ర వాహనాలలో వచ్చి ఆ వాహనాలు అలా ఉండగానే అందులోంచి చీరల మూటలను తీసుకుని అక్కడి నుండి పారిపోయారు.

పోలీసులు ఆలస్యంగా రావటం, ఆ వ్యవధిలో పట్టుకున్న చీరెలు దొరికినట్లే దొరికి మళ్ళీ పోవటం మీద స్థానికుల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుండగా నాయుడుపేట ఎస్సై శివశంకర రావు, పెళ్ళకూరు ఎస్సై ఆంజనేయ రెడ్డి, అక్కడ కూడిన జనాలను చెదరగొట్టారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles