Kejriwal faced egg throwing at varanasi

Kejriwal faced egg throwing at Varanasi, Kasi Viswanadh temple, Aam Admi party chief Arvind Kejriwal, BJP Narendra Modi, Kejriwal road show at Varanasi

Kejriwal faced egg throwing at Varanasi

కాశీవిశ్వనాధుని సందర్శించిన కేజ్రీవాల్ కి కోడిగుడ్లు

Posted: 03/25/2014 05:02 PM IST
Kejriwal faced egg throwing at varanasi

కాలభైరవ కాశీ విశ్వనాధ ఆలయాలను సందర్శించిన ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వాహకుడు అరవింద్ కేజ్రీవాల్ మీద కొందరు నిరసనకారలు కోడిగుడ్లు, ఇంక్ చల్లారు. 

శివ గంగ ఎక్స్ ప్రెస్ లో వారణాసి చేరుకున్న కేజ్రీవాల్ అక్కడ రోడ్ షో కి ముందుగా కాశీ విశ్వనాదుని సందర్శించారు.  బయటకు రాగానే ఆయన మీద కోడి గుడ్లతో కొందరు నిరసనకారులు ప్రహారం చేసారు.  ఆఆపా ఉత్తర ప్రదేశ్ ఇన్ ఛార్జ్ సంజయ్ సింగ్, మాజీ ఢిల్లీ న్యాయశాఖా మంత్రి సోమనాథ్ భారతి మీద కూడా గుర్తు తెలియని వ్యక్తులచేత సిరా, కోడిగుడ్లు పడ్డాయి. 

వారణాసి నుండి పోటీ చేస్తున్న భాజపా ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీకి పోటీగా కేజ్రీవాల్ వారణాసి నుండి పోటీ చెయ్యటానికి ప్రజల మద్దతును కోరటం ఆయన ప్రసంగంలోని అజెండా.  వారణాసిలో కేజ్రీవాల్ కి అడుగడుగునా నిరసనులు ఎదుర్కోవలసిన అవసరం ఏర్పడింది.  కాశీ విశ్వనాధుని మందిరం నుండి చందనం ముఖంలో నొసటన పూసుకున్న కేజ్రీవాల్ మీడియాకు కేవలం చిరునవ్వు మాత్రమే చిందించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles