సమైక్య సింహాలు కావూరి, చిరంజీవి, పురందేశ్వరి, కయ్యానికి కాలుదువ్వి.. సై .. సై ..సమైక్యం అంటూ.. పార్లమెంట్ లో గాండ్రించి , సమైక్య పంజా దెబ్బ ఎలా ఉంటుందో... ఇటలీ బుల్లెమ్మ కళ్లకు కట్టినట్లు తొలిసారి సీమాంద్ర మంత్రులు చూపించారు. కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉంటే ..ప్రజల సమస్యలపై పోరాటం చేయకూడదని ఏక్కడైన రాసిందా? అంటూ ..కాంగ్రెస్ పెద్దలను నిలదీశారు.
లోక్ సభలో..రైల్వే బడ్జెట్.. కూతవేయగానే.. సీమాంద్ర ఎంపీలు, సీమాంద్ర మంత్రులు తొలిసారిగా స్పీకర్ వెల్ లోకి వెళ్లి ..తమ నిరసన తెలపటంతో.. లోక్ సభ సమైక్య నినాదాలతో.. హోరెత్తిపోయింది.
కావూరి, చిరంజీవి, పురందేశ్వరి... తమ సీట్లు వదిలిపెట్టి.. స్పీకర్ వెల్ లోకి వెళ్లి .. సమైక్య నినాదాం వినిపించారు. ఒకనొక సమయంలో.. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కావూరి, చిరంజీవికి కనుసైగలతో.. హెచ్చరించినప్పటికి.. సమైక్యాంద్ర కోసం .. తెగించి ముందుకు అడుగువేసి సభలో సమైక్యనినాదం వినిపించారు.
ఇక కేంద్ర మంత్రి పురందేశ్వరి అయితే.. కొన్ని నిమిషాల పాటు లోక్ సభలో పురివిప్పి సమైక్య నాట్యం చేసినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. సీనియర్ నాయకుడు పల్లంరాజు మాత్రం.. తన స్థానం కదలకుండానే.. సమైక్యాంద్ర నినాదం చేయటం జరిగింది. అయితే ఈరోజు సీమాంద్ర మంత్రులు తెగించిన తీరు చూస్తే.. తెలంగాణ నేతల్లో భయం మొదలైనట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ ఎలాగైన..రేపు తెలంగాణ బిల్లు పెట్టాలని తీవ్రంగా క్రుషి చేస్తుంది. ఎన్ని అడ్డంకులు ఎదురైన సరే ..తన పంతం నెగ్గించుకోవటానికి .. ఇటలీ బుల్లెమ్మ ఇష్టం వచ్చిన ప్రయోగాలు సీమాంద్ర నేతల పై చేస్తున్నట్లు సమాచారం.
ఒక పక్క ప్రధాని మంత్రి విందుకు వెళ్లిన బిజేపి నేతలు .. తెలంగాణ బిల్లు పై తెల్చి చెప్పటం జరిగింది. తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వాలంటే.. ముందుగా సీమాంద్ర సమస్యలను పరిష్కారించండని బిజేపి నేతలు బల్ల గుద్ది మరి చెప్పినట్లు సమాచారం.
కావూరి, చిరంజీవి , పురందేశ్వరి దూకుడు దెబ్బ కు.. కాంగ్రెస్ హైకమాండ్.. ఈరోజు సాయంత్రం కోర్ కమిటీ భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ కమిటీలో.. కాంగ్రెస్ హైకమాండ్. ఏం నిర్ణయం తీసుకుంటారో అనే విషయం పై తెలంగాణ నేతలు, సీమాంద్ర నేతలు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికే ఆరుగురు సీమాంద్ర ఎంపీలను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. సీమాంద్ర మంత్రులు దూకుడు.. బిజేపి నేతలు చెప్పిన సమాధానం పై ఆలోచించి వ్యవహరిస్తారని కాంగ్రెస్ పెద్దలు అంటున్నారు.
ఈరోజు లోక్ సభలో జరిగిన తీరు పై సీమాంద్ర ప్రజలు హార్షం వ్యక్తం చేస్తున్నారు. సీమాంద్ర మంత్రులు ఇదే పని తెలంగాణ ప్రకటన చేసిన రోజే సమైక్య సింహాలు మాదిరి గర్జించి ఉంటే ..ఈ సమస్య ఇంత దూరం వచ్చేది కాదని.. సీమాంద్ర ప్రజలు అంటున్నారు. తెలంగాణ నేతలు.. సీమాంద్ర నేతల చర్యలు ఎలా అడ్డుకోవాలో తెలియక.. సీమాంద్ర నేతలపై విచిత్రమైన విమర్శలు చేస్తున్నారు.
కావూరి వ్యాఖ్యలను పట్టించుకోకుండా .. నోరు మూయించిన ..చిదంబరం లోక్ సభలో.. కావూరి దూకుడు చూసి.. తన కళ్లజోడును సరిచేసుకొని చూసినట్లు సమాచారం. ఈరోజే ఇలా ఉంటే.. ఇక రేపు ఎలా ఉంటుందోనని లోక్ సభలోని సభ్యులు గుసగుసలాడుకుంటున్నారు.
ఒక పక్క తెలంగాణ బిల్లు పెడితే.. పార్లమెంట్లో ఆత్మహత్యలు చేసుకుంటామని.. సీమాంద్ర నేతలు హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరును.. దేశ ప్రజలు గమనిస్తున్నారు. సీమాంద్ర నేతలు ఎందుకు గోల చేస్తున్నారు.
సీమాంద్ర ప్రజలు సమస్యలను పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ మొండిగా ఎందుకు ముందుకు పోతుందో అర్థంకావటం లేదు.. ‘‘పరిగెత్తి పాలు తాగటానికి కేంద్రం ఎందుకు ఉత్సహం చూపిస్తుందో ’’ అర్థం కావటం లేదని జాతీయ నాయకులు అంటున్నారు.
తొమ్మిది సంవత్సరాల నుండి. కాంగ్రెస్ పార్టీ తొక్కుడుబిల్ల, అష్టచమ్మా, ఆటలు ఆడుకుంటూ కూర్చుందా? తెలంగాణ బిల్లును టైబుల్ ఐటమ్ పెట్టి కోర్ కమిటిలో ఆమోదం పొందారు. ఇప్పుడు తెలంగాణ బిల్లు ఏ ఐటమ్ గా పెట్టి .. లోక్ సభలో ఆమోదం పొందుతారో చూడాలని.. సీమాంద్ర నేతలు అంటున్నారు.
తెలంగాణ కోసం పది జిల్లా నేతల కోరిక మేరకు రాష్ట్రాన్ని విడదీస్తే.. ఇక పదమూడు జిల్లలా నేతలు చెబుతున్న సమస్యలను పట్టించుకోకుండా..కల్లు తాగిన కోతి మాదిరి సోనియా వ్యవహరిస్తుందని.. సీమాంద్ర ప్రజలు అంటున్నారు.
సమైక్యాంద్ర కోసం పోరాడిన నేతల్నే మళ్లీ సమైక్య సింహాలుగా గెలిపిస్తాం, లేకుండా సీమాంద్ర సన్యాశుల్లా మిగిలిపోతారని .. సీమాంద్ర ప్రజలు , సీమాంద్ర నేతలను హెచ్చరిస్తున్నారు.
ఇప్పుడు గానీ కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రవర్తిస్తే .. ఇక సీమాంద్ర లో ఉన్న కాంగ్రెస్ కొంపలు, కాంగ్రెస్ పార్టీ మొత్తం .. కాలగర్బంలో కలిసిపోతాయని .సమైక్యవాదులు హెచ్చరిస్తున్నారు.
లోక్ సభలో రేపటి జరగబోయే.. రణరంగం పై అన్నీ పార్టీల నేతలు, సుదీర్ఘం చర్చలు జరుపుతున్నారు. తెలంగాణ నేతలు కాంగ్రెస్ పార్టీపై పూర్తి నమ్మకంతో ఉన్నట్లు సమాచారం. ఇక సీమాంద్ర నేతలు మాత్రం ప్రతిపక్ష నేతలు, సీమాంద్ర మంత్రులపై భరోసాతో రరేపు లోక్ సభలోకి అడుగుపెట్టానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ..పార్లమెంట్ వద్ద భారీ బలగాలను..మోహరించినట్లు సమాచారం. ఇప్పటికే.. సీమాంద్రకు చెందిన వ్యక్తులకు పార్లమెంట్ పాస్ ఇవ్వొద్దని కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు జారీ చేసినట్లు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
నిన్న లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ పై జరిగిన దాడి, ఈరోజు సభలో సీమాంద్ర నేత టిడిపి ఎంపీ శివప్రసాద్, తెలంగాణ నేత ఎంపీ మంధా జగన్నాథంలపై జరిగిన దాడులతో.. రాష్ట్ర ప్రజలు భయపడుతున్నారు.
రేపు సభలో ఏం జరుగుతుందోనని.. అందరు హైటెన్షన్ లో ఉన్నట్లు సమాచారం. ఇక మీడియా వారి గురించి చెప్పే పనే లేదు.. రేపు కెమెరా కంటినిండా.. విందు భోజనమే అని.. మీడియా పై కొంత మంది నేతలు జోకులు వేసుకుంటున్నారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more