Rs 20 crores offered by bjp to madanlal aap

Rs 20 crores offered to Madanlal, AAP MLA Madanlal, Bharatiya Janata Party, Narendra Modi, BJP Prime Ministerial candidate, Arun Jaitely

Rs 20 crores offered by BJP to Madanlal AAP, MLA madanlal

ఆఆపాను కూలదీయటానికి 20 కోట్ల ఎర?

Posted: 02/03/2014 05:22 PM IST
Rs 20 crores offered by bjp to madanlal aap

ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని ఢిల్లీలో కూలదీయటం కోసం భారతీయ జనతా పార్టీ తనకు రూ.20 కోట్లను  ఎర వేస్తోందని ఢిల్లీ కస్తూర్బా నగర్ శాసనసభ్యుడు మదన్ లాల్ మీడియా సమావేశంలో తెలియజేసారు. 

ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు ఒకరోజు ముందు డిసెంబర్ 7 న ముందు తన దగ్గరకు వచ్చారని చెప్పిన మదన్ లాల్ ఈ ఆరోపణను నిరూపించుకోవటానికి తన దగ్గర సాక్ష్యాధారాలేమీ లేవని అన్నారు.  అదే రోజున గుర్తు తెలియని ఒక నంబర్ నుంచి ఫోన్ వచ్చిందని, తనను ఒక పెద్ద నాయకుడితో పరిచయం చేస్తానని అన్న ఆ గొంతు అరుణ్ జైట్లీ పేరు చెప్పిందని, దానితో నోరుముయ్యమని చెప్పి ఫోన్ పెట్టేసానని మదన్ లాల్ అన్నారు. 

ఆ తర్వాత కొద్ది రోజుల క్రితం గుజరాత్ ముఖ్యమంత్రి, భాజపా ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ తరఫునుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చారని, ఏం కావాలి మీకు అని అడిగితే నాతోపాటు 9 మంది ఎమ్మెల్యేలను ఆఆపా లోంచి బయటకు వచ్చి వేరే పార్టీ పెట్టి భాజపాకు మద్దతునివ్వమని కోరారని చెప్పిన మదన్ లాల్, 40 ఏళ్ళ వయసులో ఉన్న వారిద్దరిలో ఒకరి పేరు సంజయ్ సింగ్ అని తనకి గుర్తుందని అన్నారు. 

ఆ విధంగా ఆఆపా లోంచి బయటకు వచ్చినట్లయితే ముఖ్యమంత్రిని చేస్తామని దానితోపాటు రూ.20 కోట్ల రూపాయలను కూడా ఇస్తామని, అంతే కాకుండా క్యాబినెట్ మంత్రులుగా తీసుకుని మిగిలినవారికి రూ.10 కోట్ల రూపాయలను ఇస్తామని చెప్పారన్నారాయన. 

అలా తన దగ్గరకు వచ్చిన ప్రతిసారీ వెనువెంటనే పార్టీ అధినాయకుడికి తెలియజేస్తూవచ్చానని కూడా మదన్ లాల్ అన్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles