Srihari wife shanthi enter to politics

actor Srihari, wife disco Shanthi, enter politics, Disco Shanthi, Disco Shanthi to contest in Elections 2014, Kukatpally, Secunderabad Constituency, Lok Satta Party, MP Anjan Kumar Yadav, Srihari wife shanthi

Srihari wife shanthi enter to politics. actress who is also known as Disco Shanthi, might contest in the next elections from either Kukatpally or Secunderabad Constituency.

శ్రీహరి భార్య రాజకీయాల్లోకి

Posted: 01/28/2014 04:57 PM IST
Srihari wife shanthi enter to politics

ప్రముఖ సినీ నటుడు, నిత్యం సమాజ సేవ చేయాలని పరితపించే కీ.శే. శ్రీహరి రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు మరింత సేవ  చేయాలని అనుకొని వచ్చే ఎన్నికల్లో కూకట్ పల్లి నుండి పోటీ చేస్తానని చెప్పాడు. కానీ ఆ కోరిక నెరవేరకుండానే చనిపోయిన సంగతి అందరికి తెలిసిందే. ఇప్పుడు తన భర్త కలను నెరవేర్చడానికి అతని భార్య, ప్రముఖ నటి అయిన డిస్కోశాంతి త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయబోతుందా అంటే అవుననే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు.

ఇన్ని రోజులు తన భర్త పోయిన దు:ఖంలో ఉన్న డిస్కోశాంతి ఇప్పుడిప్పుడే ఆ బాధ నుండి బయటకి వచ్చి వచ్చే ఎన్నికల్లో పోటీకి రంగం సిద్దం చేసుకుంటుందని అంటున్నారు. అయితే ఈమె ఏ పార్టీ నుండి పోటీ చేయబోతుంది ? శ్రీహరి చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీ నుండే పోటీ చేస్తుందా అంటే... ఆయన పోయిన తరువాత ఏ పార్టీ వారు ఈమెను సంప్రదించక పోయే సరికి స్వంతత్ర అభ్యర్థిగా కూకట్ పల్లి నియోజక వర్గం నుండి కానీ, సికింద్రాబాద్ నియోజక వర్గం నుండి కానీ బరిలో దిగే అవకాశాలు కనిపిస్తాయంటున్నారు.

కూకట్ పల్లి ప్రస్తుత ఎమ్మెల్యే, లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ నుండి గట్టి పోటీ ఎదుర్కోవాల్సి వస్తే... సికింద్రాబాద్ ఎంపీ, శ్రీహరి ఫ్రెండ్ అయిన అంజన్ కుమార్ యాదవ్ సహాయంతో సికింద్రాబాద్ నుండి పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి డిస్కోశాంతి రాజకీయాల్లోకి రానుండటంతో రాజకీయ పార్టీలు ఆమెను బుట్టలో వేసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles