Priyanka Gandhi greets telangana on Bathukamma Festival తెలంగాణ బతుకమ్మతో ఇందిరమ్మ.. ఫోటోను పంచుకున్న ప్రియాంక

Priyanka gandhi greets people of telangana with rare indira gandhi photo on bathukamma festival

Bathukamma, Indira Gandhi, 1978 warangal, Indira Gandhi bathukamma, bathukamma greetings, priyanaka gandhi bathukamma greetings, Priyanka Gandhi, Telangana, Congress, National, Politics

AICC General Secretary Priyanka Gandhi wished the people of Telangana, especially the women of Telangana, auspicious Bathukamma festival. He tweeted that his grandmother Indira Gandhi’s participation in the Bathukamma festival held in Orugallu in 1978 was a sweet memory.

తెలంగాణ బతుకమ్మతో ఇందిరమ్మ.. ఫోటోను పంచుకున్న ప్రియాంక

Posted: 09/28/2022 04:46 PM IST
Priyanka gandhi greets people of telangana with rare indira gandhi photo on bathukamma festival

తెలంగాణలో బతుకమ్మ పండుగకు ప్రత్యేక స్థానం ఉంది. పెత్తారు అమావాస్యను పురస్కరించుకుని ప్రారంభమైయ్యే ఎంగిలి పూల బతుకమ్మతో పండుగ పర్యదినాలు ప్రారంభమై తొమ్మిది రోజుల పాటు కొనసాగి దుర్గాష్టమి నాడు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. బతుకమ్మ అంటే ‘మాతృదేవత సజీవంగా వస్తుంది’ అని విశ్వాసం. ఇక దీనిని గౌరీ దేవికి వసంతోత్సవంగా కూడా పరిగణించిన తెలంగాణ ఆడపడచులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. వాయినాల తరహాలోనే ప్రసాదాలను అందరితో పంచుకుని.. అందరి నుంచి ప్రసాదాలను స్వీకరించి కుటుంబసభ్యులతో కలసి సేవించే పండగ.

ఎంగిలి పూల బతుకమ్మతో తొలి రోజు ప్రారంభమైన బతుకమ్మ ఉత్సవాలు.. రెండవ రోజు అత్కుల బతుకమ్మగా, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మగా, నాల్గవ రోజు నానబియ్యం బతుకమ్మగా, ఐదవ రోజు అట్ల బతుకమ్మగా, ఆరవ రోజు అలిగిన బతుకమ్మగా, ఏడవ రోజు వేపకాయల బతుకమ్మగా, ఎనమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మగా, తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మగా నామకరణం చేయబడిన విషయం తెలిసిందే. కాగా తెలంగాణ రాష్ట్ర అవిష్కృతమైన తరువాత ఇది రాష్ట్రీయ పండుగగా ప్రత్యేక గుర్తింపును పోందింది. అయితే ఇప్పుటి నాయకులు అందరూ బతుకమ్మ ఉత్సవాలు చేస్తున్నారు.

కానీ బతుకమ్మ ఉత్సవాల గురించి తెలంగాణ సంస్కృతి గురించి దశాబ్దాల క్రితమే తెలుసుకున్న దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ అప్పుడే బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ‌లో వేడుక‌గా జ‌రిగే బ‌తుక‌మ్మ పండుగ పర్వదినాల సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంకా గాంధీ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఈ ఆస‌క్తిక‌ర పోస్ట్ పంచుకున్నారు. ముందుగా తెలంగాణ ప్ర‌జ‌లంద‌రికీ... ప్ర‌త్యేకించి తెలంగాణ ఆడ‌ప‌డు‌చుల‌కు అమె బ‌తుక‌మ్మ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ పండుగను త‌న నాన‌మ్మ, మాజీ ప్ర‌ధాని ఇందిరా గాంధీ ఘనంగా జరుపుకునేవారని పేర్కోన్నారు.

ఇందుకు రుజువుగా అప్పటి పాతఫోటోను అమె తన సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులతో పాటు తెలంగాణ ప్రజలు, ఆడపడచులతో పంచుకున్నారు. ఇందిరా గాంధీ బ‌తుక‌మ్మ ఉత్స‌వాల్లో పాలుపంచుకున్న పాత ఫొటోను పంచుకున్నారు. 1978లో తెలంగాణ‌లో ప‌ర్య‌టించిన సంద‌ర్భంగా ఇందిరాగాంధీ బ‌తుక‌మ్మ ఉత్స‌వాల్లో పాల్గోన్నప్పటి ఫోటోను ఇది. ఈ సంద‌ర్భంగా పూల‌తో అలంక‌రించిన బ‌తుక‌మ్మ‌ను త‌న చేతుల్లో ప‌ట్టుకుని ఉన్న ఇందిరా గాంధీ ఫొటోను ప్రియాంకా గాంధీ షేర్ చేశారు. 1978లో ఓరుగల్లులో త‌న‌ నానమ్మ ఇందిరా గాంధీ బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడం ఒక మధుర స్మృతిగా నిలిచింద‌ని ప్రియాంకా పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bathukamma  Indira Gandhi  1978 warangal  Priyanka Gandhi  Telangana  Congress  National  Politics  

Other Articles