AAP MLA Amanatullah Khan gets bail in graft case ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ కు ఏసీబీ కోర్టులో ఊరట..!

Aap mla amanatullah khan gets relief in delhi waqf board graft case

AAP MLA Amanatullah Khan, MLA Amanatullah Khan judicial remand, MLA Amanatullah Khan sent to 14 days in jail, MLA Amanatullah Khan grafts case, MLA Amanatullah Khan, MLA Amanatullah Khan Delhi Waqf Board, MLA Amanatullah Khan ACB Court, MLA Amanatullah Khan bail, Delhi's Rouse Avenue Court, Bail, graft case, Delhi, Crime

Delhi's Rouse Avenue Court granted bail to AAP MLA Amanatullah Khan, in a case connected with alleged irregularities in appointment, misappropriation of funds and misuse of official position as chairman of the Delhi Waqf Board. The ACB had arrested Khan after day-long questioning and raids at multiple locations, including the Okhla MLA's premises, on September 16.

ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ కు ఏసీబీ కోర్టులో ఊరట..!

Posted: 09/28/2022 05:52 PM IST
Aap mla amanatullah khan gets relief in delhi waqf board graft case

దేశ రాజధాని ఢిల్లీ వక్ఫ్ బోర్డులో అవకతవకలు, అక్రమ నియామకాలకు సంబంధించిన కేసులో ఏసీబీ అరెస్ట్‌ చేసిన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు బెయిల్ లభించింది. రోజ్ అవెన్యూ కోర్టు ఆయనకు పలు షరతులతో మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. రెండేళ్ల కిందట ఢిల్లీ వక్ఫ్ బోర్డులో జరిగిన అక్రమ నియామకాలపై ఢిల్లీ పోలీస్‌ విభాగానికి చెందిన అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దర్యాప్తు జరుపుతున్నది. ఇందులో భాగంగా ఈ నెల 16న ఢిల్లీలోని అధికార ఆప్‌ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌, ఆయన వ్యాపార భాగస్వామి హమీద్ అలీ ఖాన్ మసూద్ ఉస్మాన్ నివాసాల్లో ఢిల్లీ పోలీసులు రైడ్‌ చేశారు.

రూ.12 లక్షల డబ్బు, డబ్బులు లెక్కించే యంత్రం, అక్రమంగా కలిగి ఉన్న ఒక పిస్టల్‌, నాలుగు బులెట్లను ఎమ్మెల్యే అనుచరుడు హమీద్ అలీ ఖాన్ నివాసం నుంచి స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఓఖ్లా ఎమ్మెల్యే అయిన అమానతుల్లా ఖాన్‌, ఢిల్లీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌గా ఉన్నారు. ఏసీబీ సమన్లు జారీ చేసిన విషయాన్ని ఆయన ట్వీట్‌ చేశారు. కొత్త వక్ఫ్ బోర్డు కార్యాలయాన్ని నిర్మించినందున తనకు సమన్లు ​​అందాయని అందులో ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 16న ఏసీబీ కార్యాలయానికి హాజరైన ఆప్‌ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను ఏసీబీ అధికారులు పలు గంటలపాటు ప్రశ్నించారు.

2020లో ఢిల్లీ వక్ఫ్ బోర్డులో జరిగిన 32 అక్రమ నియామకాలపై ఆరా తీశారు. అనంతరం ఆయనను అరెస్ట్‌ చేసినట్లు ప్రకటించారు. మరోవైపు ఏసీబీ కస్టడీ అనంతరం అమానతుల్లా ఖాన్‌కు కోర్టు సోమవారం 14 రోజులు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. అలాగే ఆయన దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరిపింది. అయితే అమానతుల్లా ఖాన్‌ ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని ఆయన తరుఫు సీనియర్‌ న్యాయవాది రాహుల్ మెహ్రా వాదించారు. నిధులు, నియామకాల్లో ఎలాంటి అవకతవకలు, అక్రమాలు జరుగలేదన్నది ప్రాథమిక ఆధారాల ద్వారా తెలుస్తున్నదని అన్నారు. ఈ నేపథ్యంలో ఆప్‌ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు బెయిల్‌ మంజూరు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles