Heavy rains likely across Telangana for next three days రాష్ట్రానికి ఎల్లో అలెర్ట్‌ జారీ.. రానున్న రెండు రోజులు భారీ వర్షాలు

Yellow alert issued to telangana several districts likely to recieve heavy rainfall

Yellow alert to 24 districts of Telangana, India Meteorological Department (IMD), Yellow alert to Adilabad, Yellow alert to Kumram Bheem Asifabad, Mancherial, Nirmal, Jagtial, Jayashankar Bhupalpally, heavy rainfall to 24 districts of Telangana, Nizamabad, Rajanna Sircilla, Karimnagar, Peddapalli, Mulugu, Bhadradri Kothagudem, Siddipet, Yadadri-Bhongir, Rangareddy, Hyderabad, Medchal-Malkajgiri, Vikarabad, Sangareddy, Medak, Kamareddy, Mahbubnagar districts.

In the wake of cyclonic circulation, many parts of the State are likely to record heavy rainfall over the next three days. According to the IMD, districts like Kumurambheem-Asifabad, Mancherial, Jagtial, Peddapalli, Jayashankar-Bhupalapally, Mulugu, Bhadradri-Kothagudem, Khammam, Nalgonda, Suryapet, Mahabubabad, Warangal, Hanamkonda, Jangaon, Siddipet, Yadadri-Bhongir, Rangareddy, Hyderabad, Medchal-Malkajgiri, Vikarabad, Sangareddy, Medak, Kamareddy and Mahbubnagar will see heavy rainfall.

రాష్ట్రానికి ఎల్లో అలెర్ట్‌ జారీ.. రానున్న రెండు రోజులు భారీ వర్షాలు

Posted: 09/28/2022 03:38 PM IST
Yellow alert issued to telangana several districts likely to recieve heavy rainfall

తెలంగాణలో రానున్న రెండు, మూడు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి నుంచి మరో రెండు మూడు రోజుల పాటు రాష్ట్రంలోని ఏకంగా 24 జిల్లాల వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసిన వాతావరణ శాఖ ఏ రోజు ఏయే జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయో కూడా సూచించింది.

పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని.. మరికొన్నిచోట్ల ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, సిద్ధిపేట జిల్లాతో పాటుగా ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి-భవనగిరి, రంగారెడ్డి, వికారాబాద్‌, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్ గిరి, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.

రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ కు కూడా ఎల్లో అలెర్ట్‌ జారీ చేసిన భారత వాతావరణ శాఖ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో వేగంతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వచ్చే నెల (అక్టోబర్) ఒకటో తేదీన తూర్పు, మధ్య బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని.. దానివల్ల వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని వెల్లడించింది. కాగా ఆవర్తనం మరింతగా బలపడి అల్పపీడనంగా కూడా అవకాశాలు లేకపోలేదని సూచించారు. ఈ నేపథ్యంలో మరిన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వానలు పడుతున్నాయని, హైదరాబాదులో భారీవర్షాలు కురుస్తాయని తెలిపింది.

* సెప్టెంబర్ 28వ తేదీన (బుధవారం) తెలంగాణ వ్యాప్తంగా వానలు పడతాయని.. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో ఓ మోస్తరుగా.. మిగతాచోట్ల భారీ వానలు కురుస్తాయని తెలిపింది.
* సెప్టెంబర్ 29న (గురువారం) ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, జనగాం, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో సాధారణ వానలు.. మిగతా చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని సూచించింది
* సెప్టెంబర్ 30న (శుక్రవారం) నిర్మల్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్, నారాయణపేట్, మహబూబ్ నగర్, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్లగొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. మిగతా జిల్లాల్లో ఓ మోస్తరు వానలు పడతాయని వివరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles