Uber Claims No Sensitive Data Exposed in Latest Breach సైబర్ దాడిలో ఎలాంటి డాటా లీక్ కాలేదు: ఉబర్

Uber says it was likely hacked by eenage hacker gang lapsus

Uber hacker, Uber systems hack, cybersecurity incident, cyber security breach, young hacker, Uber computers, screenshots, Uber staff member, cyber security analyst, Graham Cluley, WhatsApp claiming, software tools, security experts, Synopsys Software Integrity Group, Silicon Valley

Uber said Friday it was investigating a "cybersecurity incident," declining to comment on reports a young hacker had gained access to the ride-hailing company's computer network. Uber put out word of the breach in a tweet, and a hacker claiming to be 18 years old then posted screenshots taken from inside Uber computers.

ఉబర్ పై సైబర్ దాడి.. ఎలాంటి డాటా లీక్ కాలేదన్న సంస్థ

Posted: 09/20/2022 08:10 PM IST
Uber says it was likely hacked by eenage hacker gang lapsus

అమెరికాకు చెందిన ప్రముఖ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ, ప్రపంచంలోనే అతి పెద్ద ఇంటర్నెట్ ట్యాక్సీ ఉబర్ సంస్థ తాజాగా ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇటీవల ఓ 18 ఏళ్ల హ్యకర్ ఉబర్ సంస్థకు చెందిన ఉద్యోగిని మభ్యపెట్టి అతని నుంచి క్రెడెన్షియల్స్ పోంది.. వాటి సాయంతో డేటా చౌర్యం చేసినట్లుగా స్ర్కీన్ షాట్లు తీసిన వాట్సాప్ లో పోస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా డేటా లీక్ అయ్యిందన్న అలజడి రేగి.. ఉబర్ కస్టమర్లు అందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా ఉబర్ సంస్థ ఓ ప్రకటనను విడుదల చేసింది.

ఇటీవల తమ సంస్థలోని ఓ ఉద్యోగి సాయంతో చోరబడిని హ్యాకర్ ఎలాంటి డేటాను తస్కరించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని సంస్థ ప్రకటించింది. తమ సంస్థకు చెందిన సున్నితమైన డేటా (ట్రిప్ హిస్టరీ లాంటి) ఏదీ చౌర్యానికి గురైనట్లు ఆధారాలు లేవని చెప్పింది. ప్రస్తుత్తం తమ సంస్థ నిర్వహిస్తున్న ఉబర్, ఉబర్ ఈట్స్, ఉబర్ ఫ్రైయిట్, ఉబర్ డ్రైవర్ సహా అన్ని యాప్ లు యధాతథంగానే నడుస్తున్నాయని ప్రకటనలో పేర్కోంది. సంస్థకు చెందిన ఓ ఉద్యోగి యాప్, వర్క్ స్పేస్ మెసేజింగ్ యాప్ లోకి హ్యాకర్లు చొరబడటంతో ఉబర్ డేటా ఉల్లంఘనకు గురైంది.

అయితే ఇటీవల ఓ కొత్తగా హ్యాకింగ్ నేర్చుకుంటున్న ఓ హ్యాకర్ తమ సంస్థకు చెందిన ఉద్యోగి లాగిన్ ఐడీ, పాస్ వర్డులను మభ్యపెట్టి తెలుసుకుని.. సంస్థ కంపూటర్లలోకి చోరబడ్డాడన్న విషయాన్ని ఉబర్ ధ్రువీకరించింది. గత ఏడాది నుంచి చురుగ్గా ఉన్న ‘లాప్సస్$’ అనే హ్యాకింగ్ గ్రూప్‌ తమపై ఈ సైబర్ దాడికి పాల్పడిందని ఉబర్ వెల్లడించింది. టెక్నాలజీ కంపెనీలను హ్యాక్ చేసేందుకు లాప్సన్ ఈ పద్ధతులను పాటిస్తోందని, ఈ ఏడాదిలోనే మైక్రోసాఫ్ట్, సిస్కో, శామ్‌సంగ్, ఎన్విడియా, ఓక్టా వంటి వాటిపై కూడా సైబర్ దాడి చేసిందని ఉబెర్ పేర్కొంది. గత వారమే ఉబర్ పై సైబర్ దాడి జరిగిందని వార్తలు వచ్చాయి. కానీ అప్పుడు దాడి పరిధి అస్పష్టంగా ఉంది.

హ్యాకర్లు అనేక అంతర్గత సిస్టమ్‌లను యాక్సెస్ చేసినట్లు ఉబెర్ ఇప్పుడు స్పష్టం చేసింది. అయితే, ఏదైనా మెటీరియల్ ఇంపాక్ట్ ఉందా? అన్నదానిపై కంపెనీ ఇంకా దర్యాప్తు చేస్తోంది. కాగా, హ్యాకర్లు తమ కంపెనీ మొబైల్ యాప్‌లకు శక్తినిచ్చే ‘ప్రొడక్షన్ సిస్టమ్‌లను’ యాక్సెస్ చేయలేదని ఉబర్ పేర్కొంది. కాబట్టి వినియోగదారుల ఖాతాలు, క్రెడిట్ కార్డ్ నంబర్‌లు, బ్యాంక్ ఖాతా సమాచారం, ట్రావెల్ హిస్టరీ వంటి సున్నితమైన సమాచారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించే డేటా బేస్‌లు కూడా సురక్షితంగా ఉన్నాయని కంపెనీ హామీ ఇచ్చింది. తమ వినియోగదారుల క్రెడిట్ కార్డు సమాచారంతో పాటు వ్యక్తిగత డేటాను చాలా భద్రంగా ఉంచుతామని, అదనపు రక్షణ కల్పిస్తామని ఉబర్ తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles