Man Tips Waitress And Then Asks Her To Give It Back వెయిటర్ కు టిప్ ఇచ్చి.. కేసు వేసిన కస్టమర్..

Us customer who gave a tip worth rs 2 lakh to waitress asks her to return it

Alfredo's Pizza Cafe, restaurant, tip, Rs 2 lakh, scranton, the office, waitress, Mariana Lambert, customer, Tips For Jesus, Eric Smith, Pennsylvania, USA

A restaurant in Pennsylvania, USA, is suing a customer for more than $3,000. This is because the customer had originally given a generous tip to a waitress working at the food outlet but then demanded the money back. This waitress named Mariana Lambert at Alfredo's Pizza Cafe located in Scranton, Pennsylvania was left beyond happy after the customer left her a tip of $3,000 (Rs 2.3 lakh).

వెయిటర్ షాక్.. టిప్ ఇచ్చి కేసు వేసిన కస్టమర్..

Posted: 09/20/2022 09:10 PM IST
Us customer who gave a tip worth rs 2 lakh to waitress asks her to return it

రెస్టారెంటు, నక్షత్ర హోటళ్లకు వెళ్లినప్పుడు అక్కడ సర్వ్ చేసిన వెయిట్రస్ లకు టిప్స్ ఇవ్వడం సాధారణం. అయితే డబ్బున్న సంపన్నులు చేతికి యుముకలు లేనట్టుగా టిప్స్ ఇస్తుంటారు. సామాన్యులు తమ శక్తిమేర టిప్స్ ఇస్తుంటారు. కాగా, ఎవరైనా కస్టమర్ కొంచెం పెద్ద టిప్స్ ఇస్తే.. సదరు వెయిటర్ల ఆనందానికి హద్దులుండవు. ఈ విషయంలోనూ పలు వివాదాలు ఉత్పన్నమయ్యాయి. ఒక్కో హోటల్ లో ఎవరికి టిప్ ఇస్తే వారికే సోంతం. కాగా మరికొన్ని హోటళ్లలో సిబ్బంది అందరూ పంచుకుంటారు. ఈలాంటి వివాదాల్లో ఉద్యోగాలు కోల్పోయిన వెయిటర్లు కూడా లేకపోలేరు.

అయితే టిప్స్ ఇచ్చిన ఏ ఒక్కరు దానిని తిరగి అడగరు. లేదా తమ డబ్బు దొంగలించబడిందని కేసు పెట్టరు. ఎందుకంటే టిప్స్ అనేవి వెయిటర్లు చేసిన సేవలకు మెచ్చి ఇచ్చే మొత్తం. కానీ ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఒక వెయిట్రెస్‌కు భారీగా టిప్ ఇచ్చిన ఒక వ్యక్తి.. ఇంటికెళ్లాక తన డబ్బు పోయినట్లు కంప్లయింట్ చేశాడు. ఈ ఘటన అమెరికాలో వెలుగు చూసింది. పెన్సిల్వేనియాలోని ఆల్‌ఫ్రెడోస్ పిజ్జా కేఫ్‌లో మరియానా లాంబర్ట్ అనే యువతి వెయిట్రెస్‌గా పనిచేస్తోంది. జూన్ నెలలో ఈ రెస్టారెంటుకు వచ్చిన ఎరిక్ స్మిత్ అనే కస్టమర్ ఏకంగా 3 వేల డాలర్లు (అంటే మన లెక్కల్లో రూ.2.40 లక్షలు) ఆమెకు టిప్ ఇచ్చాడు. దీంతో ఆమె ఆశ్చర్యపోయింది.

ఇది నిజమేనా? అని ప్రశ్నిస్తే.. ‘టిప్స్ ఫర్ జీసస్’ అనే క్యాంపెయిన్ చూసి తను స్ఫూర్తిపొందానని, అందుకే ఇలా టిప్స్ ఇస్తున్నానని చెప్పాడు. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకే ఈ చార్జిపై తన క్రెడిట్ కార్డు కంపెనీకి రిపోర్టు చేశాడు స్మిత్. క్రెడిట్ కార్డు కంపెనీకి స్మిత్‌కు మధ్య కోర్టు వివాదం జరుగుతోందని తెలిసిన రెస్టారెంట్ యజమాని.. ఫేస్‌బుక్ ద్వారా స్మిత్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించాడు. కానీ అతన్నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. దీంతో ఆల్‌ఫ్రెడ్స్ పిజ్జా కేఫ్ మేనేజర్ జాచరీ జాకబ్‌సన్.. తను కూడా కోర్టుకెళ్లాడు. ఇంత గొడవ చేయాలని అనుకుంటే అసలు టిప్ ఇవ్వడం ఎందుకని ఆయన అడిగారు. ఈ డబ్బు తిరిగి చెల్లించాలని అడక్కపోతే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles