Kavita Chawla wins Rs 1 crore on Kaun Banega Crorepati 14 కవితా చావ్లా.. చదివించి ఇంటర్.. నాలెడ్జీలో ఫంటర్..

Kbc 14 kavita chawla reaches rs 1 crore question but won t share it with pati

Kavita Chawla, KBC 14, Kaun Banega Crorepati 14, Kavita Chawla KBC 14, Kavita Chawla crorepati, KBC 2022, chawla, amitabh bachchan, kolhapur, sony television, kaun banega crorepati, kavita chawla, kbc

Kavita Chawla, a housewife from Kolhapur, became the first crorepati of Kaun Banega Crorepati 14. The lady, who has only studied till 12th grade, is elated with her victory on the Amitabh Bachchan-hosted show. Kavita created a record by winning Rs 1 crore on KBC 14.

చదివించి ఇంటర్.. నాలెడ్జీలో ఫంటర్.. కేబిసీలో రూ.కోటీ గెలుచుకున్న గృహిణి..

Posted: 09/20/2022 06:50 PM IST
Kbc 14 kavita chawla reaches rs 1 crore question but won t share it with pati

బాలీవుడ్ ప్రముఖ నటుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఓ టీవీ షోలో నిర్వహిస్తున్న ‘కౌన్‌బనేగా క్రోర్‌పతి-14’ కార్యక్రమంలో పాల్గొన్న ఓ సాధారణ గృహిణి అందరి అంచనాలను తారుమారు చేసి రూ. కోటి గెలుచుకుని సంచలనం సృష్టించారు. ఈ సీజన్‌లో రూ. కోటి గెలుచుకున్న తొలి వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఇంతా చేస్తే ఆమె చదువుకున్నది 12వ తరగతి కావడం మరో విశేషం. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన కవితా చావ్లా ఈ ఘనత సాధించారు. ఈ సందర్భంగా ‘ఇండియా టుడే’తో ఆమె మాట్లాడుతూ తన ఆనందాన్ని పంచుకున్నారు.

క్రోర్‌పతి షోలో కోటి రూపాయలు గెలుచుకున్న తొలి కొల్హాపూర్ మహిళను కావాలని అనుకున్నానని, తన కల నిజమైందని సంతోషం వ్యక్తం చేశారు. ‘ఓ రికార్డు సాధించా’ అని సంబరపడ్డారు. క్రోర్‌పతి 14 సీజన్‌లో కోటి రూపాయలు గెలుచుకోవడం అన్నది కేక్‌పైనున్న చెర్రీలాంటిదని కవిత అభివర్ణించారు. ఈ షోలో పాల్గొనేందుకు తను ఎలా సిద్ధమయ్యారో కూడా వివరించారు. ఇందులో పాల్గొనేందుకు తాను ప్రత్యేకంగా ఓ పుస్తకం కానీ, టీవీ చానళ్లు కానీ చూడలేదన్నారు. తన కుమారుడికి తాను ఏది బోధించినా ఆ పుస్తకాలనే తాను కూడా చదువుకునే దానినని, ముఖ్యమైన విషయాలను అండర్‌లైన్ చేసుకునే దానినని గుర్తు చేసుకున్నారు.

తాను కేబీసీ షోను ఫాలో అయ్యేదానినని, కాబట్టి ఎటువంటి ప్రశ్నలు అడుగుతారో తనకు తెలుసని అన్నారు. తాను పుస్తకాలు చదవినప్పుడల్లా ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకునే దానినని కవిత చెప్పుకొచ్చారు. కేబీసీ షోలో గెలుచుకున్న సొమ్ముతో ఏం చేస్తారని ప్రశ్నించగా.. ఆ డబ్బును తన కుమారుడి చదువు కోసం ఉపయోగిస్తానని, దానికే తన తొలి ప్రాధాన్యమని అన్నారు. పై చదువుల కోసం అతడిని విదేశాలకు పంపుతానన్నారు. విదేశాల్లో చదువుకుని దేశానికి గర్వకారణంగా నిలవాలన్నది అతడి కల అని తెలిపారు.

డబ్బుల గురించి మాత్రమే తాను షోలో పాల్గొనలేదంటారు కవిత. ఆత్మగౌరవం కోసమే తానీ షోలో పాల్గొన్నట్టు చెప్పారు. ఈ వేదికపై నుంచి పొందే గౌరవాన్ని తాను చూశానని, తన ప్రదర్శన ద్వారా అది సంపాదించాలని కలలు గన్నానని పేర్కొన్నారు. ఇది చాలా విలువైనదన్నారు. కోటి రూపాయలు గెలుచుకుని ఇంటికి వెళ్తానన్న నమ్మకంతో తాను షోకు వచ్చానని పేర్కొన్నారు. ఈ షో ద్వారా ప్రతి ఒక్కరు కోటి రూపాయలు గెలుచుకోవాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. అది కూడా తన కలేనని అన్నారు. కాగా, రూ. కోటి గెలుచుకున్న కవిత ఇప్పుడు రూ. 7.5 కోట్లు గెలుచుకోవడానికి సమాయత్తమవుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles