ATM refilling van driver flees with 60 lakhs ఏటీఎంలో పెట్టాల్సిన నగదుతో ఉడాయించిన వ్యాన్ డ్రైవర్..

Atm cash van driver decamps with 60 lakhs in kadapa

ATM cash van driver, van driver sharukh, cash logistics firm, bank ATM at ITI circle, Vinayaka Nagar, ATM, ITI circle, ATM cash, Rs 60 Lakh cash, Kadapa, Andhra Pradesh, Crime

A driver with a cash logistics firm fled away with a van ferrying Rs 60 lakh cash in Kadapa on Friday evening. According to sourcs, an agency fills cash, given by the bank, in the ATMs at various locations in the city. The agency staff took Rs 80 lakh cash from a bank on Friday and started in a vehicle. When the staff went to a bank ATM at ITI circle, the driver, Sharukh fled with the vehicle. It was said that there was about Rs 60 lakh cash in the vehicle.

ఏటీఎంలో పెట్టాల్సిన నగదుతో ఉడాయించిన వ్యాన్ డ్రైవర్..

Posted: 09/17/2022 03:33 PM IST
Atm cash van driver decamps with 60 lakhs in kadapa

కంచే చేను మేసిందన్న చెందంగా తాను పనిచేస్తున్న సంస్థకే కన్నం పెట్టిన ఘనుడితను. సంస్థలో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి అదే సంస్థకు కుచ్చుటోపి పెట్టి పారిపోయిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రతిరోజు ఏటీయం కేంద్రాలలో డబ్బులు పెట్టడమే కానీ.. వాటిని తనకోసం అంటూ వాడుకోవాలని అనుకున్నాడో ఏమో కానీ ఏకంగా ఏటీఎం కేంద్రాలలో నింపాల్సిన పెద్ద మొత్తంలోని నగదుతో ఉడాయించాడు. వ్యాను డ్రైవర్‌ ఎత్తుకెళ్లిన డబ్బు మొత్తం రూ.60 లక్షల వరకు ఉంటుందని సదరు బ్యాంకు అధికారులు గుర్తించారు.

ఈ ఘటన కడప జిల్లాలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్నది. నగదుతో పారిపోయిన వ్యాన్‌ డ్రైవర్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. కడప నగరంలోని వివిధ ప్రదేశాల్లో ఉన్న ఓ బ్యాంకుకు చెందిన ఏటీఎంలలో నగదును నింపే బాధ్యతను ఒక ఏజెన్సీకి ఇచ్చింది. నిత్యం సదరు ఏజెన్సీ సిబ్బంది ఆయా ఏటీఎంలలో నగదు నిల్వలను సరిచూస్తుంటారు. అయితే, శుక్రవారం బ్యాంకు నుంచి రూ.80 లక్షల నగదు తీసుకుని వాహనంలో ఏజెన్సీ సిబ్బంది బయలుదేరారు. ఐటీఐ సర్కిల్‌లోని బ్యాంకు ఏటీఎం వద్దకు సిబ్బంది వెళ్లగా.. ఇదే అదనుగా వ్యాను డ్రైవర్‌ షారుఖ్‌ వాహనంతో పరారయ్యాడు.

డ్రైవర్‌ షారుఖ్‌ పట్టుకెళ్లిన వాహనంలో దాదాపు రూ.60 లక్షల వరకు నగదు ఉన్నట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. నగర శివారులోని వినాయకనగర్‌ వద్ద డ్రైవర్‌ వ్యానును వదిలిపెట్టి నగదును సంచుల్లో వేసుకుని పరారైనట్లు సీసీ కెమెరాల ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. బ్యాంకు అధికారులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఐటీఐ సర్కిల్‌ నుంచి శివారులోని వినాయకనగర్‌ వరకు ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని కడప ఎస్పీ చెప్పారు. డ్రైవర్‌ షారుఖ్‌కు సంబంధించిన వివరాలను ఆరా తీసేందుకు, నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles