Andhra Pradesh goes to Supreme Court against HC మూడు రాజధానులపై సుప్రీంకోర్టుకు ఏపీ సర్కార్‌

Andhra pradesh govt moves sc challenging highcourt order against 3 capitals plan

andhra govt petition in supreme, andhra govt moves SC, andhra govt against amaravati, supreme court on amaravati, High court orders on andhra three capital plan, high court on andhra pradesh capital, YS Jagan govt petition in supreme Court, andhra govt, andhra govt moves SC, amaravati, andhra three capital plan, andhra pradesh capital, SC, supreme Court, Andhra Pradesh, politics

The Andhra Pradesh government has approached the Supreme Court against the high court order stalling the YS Jagan Mohan Reddy government’s move to have an ambitious three-Capital plan for the state by directing that all three civic wings of the state – legislature, executive and judiciary-- will have Amaravati as the common capital.

మూడు రాజధానులపై హైకోర్టు అదేశాలకు వ్యతిరేకంగా ‘సుప్రీం’కు సర్కార్

Posted: 09/17/2022 04:28 PM IST
Andhra pradesh govt moves sc challenging highcourt order against 3 capitals plan

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు సమతూల్యతతో అభివృద్ది చెందుతాయని నమ్మకాన్ని వ్యక్తంచేస్తోంది. కాగా ఈ విషయంలో రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు ఇచ్చిన అదేశాలు అమలుచేసే విషయంలోనూ మిన్నకుండిన ఏపీ ప్రభుత్వం.. ఇక మూడు రాజధానుల అంశంపై తేల్చివేసేందుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం తలుపుతట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ దేశ అత్యున్నత న్యాయస్థాం సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఆరు నెలల్లో అమరావతిని అభివృద్ధి చేయాలన్న హైకోర్టు ఆదేశాలు సాధ్యంకాదని తమ పిటీషన్లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది.

అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానుల ప్రతిపాదన అని ప్రభుత్వం వివరించింది. మూడు రాజధానుల చట్టం రద్దుపై హైకోర్టుకు జోక్యం చేసుకునే అధికారం లేదని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పు శాసన వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నట్లుగా ఉందని పిటిషన్‌లో పేర్కొంది. రాజధాని అంశంపై చట్టం చేసే అధికారం శాసనసభకు లేదని గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేస్తు ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. అమరావతే రాజధాని అని ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని విన్నవించింది. హైకోర్టు తీర్పుపై వెంటనే స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. సీఆర్డీ చట్టం ప్రకారమే చేయాలనడం అసెంబ్లీ అధికారాలను ప్రశ్నించడమేనని పిటిషన్‌లో ప్రభుత్వం పేర్కొంది.

అయితే అమరావతి మాత్రమే ఏకైక రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి ప్రాంత రైతులు వెయ్యి రోజులకు పైగా నిరసన దీక్షలు చేస్తూనే ఉన్నారు. తమ భూములను తీసుకుని అమరావతి రాష్ట్ర రాజధానిగా అభివృద్ది చేస్తామన్న ప్రభుత్వం.. ఇప్పుడు అన్యాయం చేస్తోందని వారు అరోపిస్తున్నారు. ప్రభుత్వాలు తమకిచ్చిన మాట ప్రకారం తమ ప్రాంతాన్ని అభివృద్ది చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ నుంచి ప్రభుత్వం భూములను తీసుకునేప్పుడు మూడు రాజధానుల ప్రతిపాదనే లేదని.. అలాంటిది పాలకులు మారిపోగానే.. ప్రభుత్వాలు తమ నిర్ణయాలను ఎలా మార్చేసుకుంటాయని రైతులు ప్రశ్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles