Lecturer slaps & kicks student in Vijayawada, suspended విద్యార్థి చెంప వాయించి.. కాలితో తన్ని.. లెక్చరర్ వికృత చేష్టలు

Video of a vijayawada college student getting thrashed goes viral

Junior college lecturer beating student, lecturet thrashed student in inter college,l ecturer beating student video goes viral, intermediate college student video, lecturer kicking student video viral , lecturer beating student in Vijayawada, Sri Chaitanya college lectuerer inhuman activity, Tadigadapa, SFI, Andhra Pradesh, viral video

A video of a college staff beating a student mercilessly surfaced on social media on Friday. According to the reports, the incident happened in Sri Chaitanya Junior College at Tadigadapa near Vijayawada. In the video the college staff can be seen slapping a student and thrashing him with leg.

ITEMVIDEOS: విద్యార్థి చెంప వాయించి.. కాలితో తన్ని.. లెక్చరర్ వికృత చేష్టలు

Posted: 09/17/2022 02:01 PM IST
Video of a vijayawada college student getting thrashed goes viral

విద్యార్థులపై చేయి చేసుకుంటే నేరంగా పరిగణిస్తారన్న విషయం తెలిసి.. ఇలాంటి పలు ఘటనల్లో కొందరు ఉపాధ్యాయులు, అధ్యాపకులు, జైలు శిక్షలకు వెళ్లిన తరువాత కూడా లెక్చరర్ల ధోరణిలో మార్పు రావడం లేదు. విద్యార్థిపై చేయి చేసుకోవడమే కాకుండా కాలితో తన్ని.. ఆ తరువాత కూడా తన అహం సంతృప్తి చెందకపోవడంతో వీపుపై ఎడాపెడా కోట్టిన ఓ లెక్చరర్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. విద్యార్థులకు పాఠాలను అర్థమయ్యేలా చెప్పాడంతో పాటు.. అందుకుగాను సులువైన మార్గాలను, ఉదాహరణలను ఇవ్వాలి.. కానీ గుడ్డి ఎద్దు చేలో పడినట్టుగా కంఠస్థం చేయించి.. అవి రాకపోతే లెక్చరర్లు విద్యార్థులను గొడ్డును బాధినట్టుగా బాదేస్తున్నారు.

ఇలా ఓ విద్యార్థిపై తన ప్రతాపాన్ని చూపి.. చెంపలు వాయించి.. అంతటితో ఆగకుండా కాలితో తన్ని.. ఆపైన వీపుపై ఎడాపెడా వాయించిన లెక్చరర్ ఇప్పుడు రోడ్డునపడ్డారు. అతడ్ని కాలేజీ యాజమాన్యం విధుల నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యం లెక్చరర్‌ను సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సంఘటన విజయవాడ బెంజి సర్కిల్‌లోని భాస్కర్‌ భవన్‌ క్యాంపస్‌లో చోటుచేసుకున్నది. విద్యార్థిపై చేయి చేసుకోవడంతో పాటు కాలితో తన్నిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యం సదరు లెక్చరర్‌ను విధుల నుంచి తప్పించింది.

తరగతిలో తోటి విద్యార్థితో మాట్లాడిన ఓ విద్యార్థిని శ్రీ చైతన్య కాలేజీ లెక్చరర్‌ అందరి ముందే చెంపపై వాయించాడు. అంతటితో ఊరుకోకుండా కాలితో తన్నాడు. ఈ ఘటనను తరగతిలోని మరో విద్యార్థి వీడియో తీసి తల్లిదండ్రులకు పంపడంతో గొడవ పెద్దగా మారింది. శుక్రవారం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ ఘటనను జిల్లా విద్యాశాఖ, చైల్డ్‌లైన్ అధికారులతో పాటు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఇంటర్ బోర్డు స్థానిక ఇన్‌స్పెక్టర్ రవికుమార్, జిల్లా విద్యాశాఖాధికారి రేణుక కళాశాలకు వెళ్లి ఘటనపై ఆరా తీశారు.

సదరు విద్యార్థి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటున్నాడని, పలుమార్లు హెచ్చరించినా వినకపోవడంతో కోపం వచ్చి కొట్టినట్లు లెక్చరర్ వివరించారు. అయితే ఈ వార్డులో ఫోన్ తీసుకెళ్లేందుకు విద్యార్థులకు అనుమతి లేదని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. అలాంటప్పుడు ఇయర్‌ ఫోన్స్‌ పెట్టుకుని పాటలు వినే అవకాశమే ఉండదని వారు వాదిస్తున్నారు. కట్టడి పేరుతో విద్యార్థులను దండించడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకుల డిమాండ్ మేరకు సదరు లెక్చరర్‌ను సస్పెండ్ చేసినట్లు ఆర్‌ఐఓ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles