Owner fined Rs 5,000 after pet dog bites child in lift లిప్టులో చిన్నారిని కరిచిన పెంపుడు కుక్క.. యజమానికి జేబు గుల్ల

Ghaziabad woman fined rs 5 000 after pet dog bites child in lift

ghaziabad, dog, child, lift, dog bites child in lift, ghaziabad dog child lift, woman sees as dog bites child, ghaziabad fines Rs 5,000, woman fined after dog bites child, ghaziabad lift, charms castle, Raj Nagar Extension, pet dog, dog bite, 8yr old child, dog bite, housing society, dog attack, Ghaziabad, Uttar Pradesh, crime

The Ghaziabad Municipal Corporation has slapped a fine of Rs 5,000 on a woman whose dog bit a little kid inside a housing society lift. CCTV visuals of the incident, which went viral on social media, showed the canine attacking the boy as its owner looked on.

లిప్టులో చిన్నారిని కరిచిన పెంపుడు కుక్క.. యజమానికి జేబు గుల్ల

Posted: 09/07/2022 06:07 PM IST
Ghaziabad woman fined rs 5 000 after pet dog bites child in lift

ఓ చిన్నారి లిప్టులో ఒంటరిగా వెళ్తున్నాడంటే.. అతడ్ని చూసి చూడగానే పక్కనున్నవారు పలకరిస్తారు.. లేదా కనీసం ఓ చిన్న చిరునవ్వు అయినా నవ్వుతారు. ఈ రెండు చేయని వారు ఏదో విషయమై చింతిస్తూ ఉండాలి లేదా.. వారిని మరేదో విషయం బాధిస్తూ ఉండాలి. అయితే ఏ సమస్య లేకపోయినా.. పిల్లలంటే ఏమాత్రం పడని కొందరు సమాజాంలో మనుషులమని తిరుగేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో వీరి సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. చిన్నారులు ఇలాంటి వారు ఎదురవుతే మాత్రం మీరు తప్పుకుని తిరగండీ. తమ ఇంట్లోని పెంపుడు జంతువులకు ఇచ్చిన విలువ.. సాటి మనుషులకు ఇవ్వడం మాత్రం వీరికి తెలియదు.

అలాంటిదే ఓ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో జరిగింది. పెంపుడు కుక్కతో పాటు అపార్టుమెంటు లిప్టులో వెళ్తున్న ఓ వ్యక్తి.. అదే లిప్టులో ఎక్కిన ఓ ఎనమిదేళ్ల చిన్నారిని కరిచింది. అయితే దానిని వారించబోవాల్సిన ఆ యజమాని వేడుకను చూస్తూ కిమ్మనకుండా నిల్చువడంతో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు జేబును గుల్ల జేశారు. రూ. 5 వేల జరిమానా విధించింది. ఈనెల ఐదో తేదీ సాయంత్రం స్కూలు నుంచి తిరిగొచ్చిన ఓ బాలుడు ఘజియాబాద్‌లోని రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్ చార్మ్స్ కౌంటీ సొసైటీలో ఇంటికి వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కాడు. అప్పటికే ఒక మహిళ తన పెంపుడు కుక్కతో కలిసి లిఫ్ట్‌లోకి వచ్చింది. కాసేపటికే ఆ కుక్క పిల్ల... బాలుపైకి దూకి అతడిని కరిచింది.

ఆ చిన్నారి నొప్పితో అరుస్తున్నప్పటికీ ఆ మహిళ ఏ మాత్రం చలించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అతడిని పట్టించుకోకుండా వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై బాలుడి తల్లిదండ్రులు నంద్‌గ్రామ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై చర్యలు తీసుకున్న పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. తదుపరి విచారణ జరుగుతోంది. ఘటన తర్వాత ఘజియాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మహిళ ఇంటికి చేరుకుని పెంపుడు కుక్క వివరాలను నమోదు చేయలేదని గుర్తించారు. ఆమెకు రూ. 5 వేల జరిమానా విధించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles