Bridge Collapses In Congo During Inauguration అలా రిబ్బన్ కత్తిరించగానే.. ఇలా కుప్పకూలిన వంతెన..

Bridge collapses in congo during ribbon cutting ceremony as onlookers conceal delight

Viral Video, Viral Video from Congo, Congo bridge collapse, bridge collapse videos, viral bridge videos, Congo videos, Trending News, Viral News, Viral Video of the day, congo bridge collapse viral video, congo bridge collapse, ribbon-cutting ceremony, inauguration ceremony, viral video, congo news

A video, which has now gone viral, shows a footbridge in Congo collapsing during a inauguration ceremony even as the dignitaries lose balance and struggle to get off the broken bridge. Sharply-suited dignitaries gathered to inaugurate a footbridge in the Congolese capital on Monday only for the structure to collapse beneath their feet to the barely concealed delight of onlookers.

ITEMVIDEOS: వైరల్ వీడీయో: అలా రిబ్బన్ కత్తిరించగానే.. ఇలా కుప్పకూలిన వంతెన..

Posted: 09/08/2022 11:37 AM IST
Bridge collapses in congo during ribbon cutting ceremony as onlookers conceal delight

అందుగలదు ఇందు లేదన్న సందేహము వలదు.. ఎందెందు వెతికినా అందెందే కలదు అవినీతి అన్న విషయం కొత్తగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఏలాంటి నిర్మాణాలు కానీ.. ఎంత గొప్పగా నిర్మితమైనవి కానీ.. ఎంతమందిని ఉపశమనం కల్పించేది కానీ.. నిర్మించామా.? లేదా.? నిర్మాణం కనబడుతుందా.? లేదా.. అన్నదే ముఖ్యంశంగా చేపడుతున్నారే తప్ప.. వాటిని వినియోగించే స్థాయిని బట్టి.. నిర్మాణ నాణ్యత ఉండేట్లు చేపట్టడం లేదు. ఇక ఇలాంటి నిర్మాణాల్లో అవినీతి రాజ్యమేలుతోంది. ఎంతలా అంటే.. నూతన నిర్మాణాలు ప్రారంభోత్సవం రోజునే కుప్పకూలిపోతున్నాయి.

ఇటీవలి కాలంలో నూతనంగా నిర్మించిన వంతెనలు కుప్పకూలడం ఇది రెండో ఘటన. కాగా తాజా ఘటనలో అలా రిబ్బన్ కట్ చేసి అడుగు కూడా ముందుకు వేయకముందే బ్రిడ్జీ కుప్పకూలిపోయింది. ఈ ఘటన అక్కడే ఉన్న అధికారులు, నాయకగణం అందరూ విస్మయానికి గురయ్యారు. కాంగోలోని ఓ డీరెన్ లో ఒక చిన్న నదిపై ఒక వంతెనను ఇటీవల నిర్మించారు. ఇక ఈ నూతన వంతెనను ప్రారంభించేందుకు సిద్దం కాగా, అధికారులు ఘోర పరాభవాన్ని ఎదుర్కోన్నారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ గా మారింది.

కాంగోలో వర్షాకాలంలో ఈ చిన్న నది ఉద్దృతంగా ప్రవహిస్తుండటంతో దానిని దాటేందుకు స్థానికులు అనేక అవస్థలు పడుతుంటారు. ఈ నేపథ్యంలో నదిని దాటేందుకు చిన్న వంతెనను అక్కడి అధికారులు నిర్మించారు. ఇక దీనిని ప్రారంభించేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. ఈ బ్రిడ్జిని ఓ మహిళా అధికారి వచ్చి ప్రారంభించేందుకు రిబ్బన్ కట్ చేసింది. అలా రిబ్బన్ కట్ చేసిందో లేదో.. అడుగు కూడా ముందుకు వేయకముందే.. ఇలా ఆ బ్రిడ్జి కుప్పకూలిపోయింది. అయితే అక్కడే ఉన్న ఇతర సిబ్బంది.. అధికారులను సకాలంలో పట్టుకుని సురక్షిత ప్రాంతానికి తరలించారు. అదృష్టవశాత్తు ఎవరూ కిందపడలేదు.. ఎవరికీ గాయలు కాలేదు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ వీడియోనూ మీరు ఒకసారి వీక్షించండీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles