Jagga Reddy Sensational decision over 2023-assembly polls ఎన్నికలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన నిర్ణయం..

Congress mla jagga reddy sensational decision over 2023 assembly elections

TPCC Working President, Congress MLA, Sangareddy constituency, T Jayaprakash Reddy, Jagga Reddy, 2023-assembly polls, Munugode by-elections, Party key activist, wife Nirmala Jagga Reddy, Telangana, Politics

Congress sitting MLA from Sangareddy constituency T Jayaprakash Jagga Reddy is unlikely to contest the 2023-assembly polls. Instead, he wants the ticket to be given to one of the party leaders from the constituency or his wife Nirmala Jagga Reddy. If the party cadres overwhelmingly support his wife’s candidature, then he would work hard to ensure her victory.

రానున్న అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన నిర్ణయం..

Posted: 09/07/2022 05:01 PM IST
Congress mla jagga reddy sensational decision over 2023 assembly elections

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో జరగనున్న ఉప-ఎన్నికలకు కాంగ్రెస్ సమాయత్తమై తమ స్థానాన్ని తిరిగి నిలుపుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటే.. పార్టీ శ్రేణులు కూడా అందుకు అనుగూణంగా శ్రమిస్తున్నారు. కాగా ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా, కార్యకర్తలను ఉత్తేజపర్చే విధంగా ప్రకటనలు చేయాల్సిన నేతలు.. నిరుగార్చేలా ప్రకటనలు చేస్తున్నారు. మరో ఏడాదిన్న‌ర‌ సమయంలో రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి (జ‌గ్గారెడ్డి) సంచ‌ల‌న నిర్ణయాన్ని ప్రకటించారు.

ఆయన చేసిన ఈ ప్ర‌క‌ట‌న కాంగ్రెస్ కార్యకర్తలను నిరుత్సాహంలోకి వెళ్లేలా చేసింది. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో తాను సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోనని ఆయ‌న ప్ర‌క‌టించారు. త‌న స్థానంలో సంగారెడ్డికి చెందిన కాంగ్రెస్ కార్య‌కర్త‌ల్లోంచి చక్కని, చురుకైన వ్యక్తిని ఎంచుకుని ఆయనను బ‌రిలోకి దించుతాన‌ని ఆయ‌న ఆస‌క్తిక‌ర ప్ర‌క‌ట‌న చేశారు. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెదక్ జిల్లాలో భాగంగా ఉన్న సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. గెలిచిన తనకు అప్పటి నుంచి తన వెన్నంటే ఉండి అహర్నిషలు తనతో కొనసాగిన కార్యకర్తలకు రానున్న ఎన్నికలలో అవకాశం కల్పిస్తానని ప్రకటించారు.

తన నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక కార్యకర్తలు అంగీకరించని పక్షంలోనూ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోబోనని చెప్పారు. అయితే కార్యకర్తలు అభీష్టం తన నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్న పక్షంలో త‌న భార్య నిర్మ‌ల‌తో క‌లిసి బుధ‌వారం పార్టీ కార్యక‌ర్త‌ల‌తో భేటీ అయిన సంద‌ర్భంగా జ‌గ్గారెడ్డి ఈ ప్ర‌క‌ట‌న చేశారు. త‌నకు బ‌దులుగా సంగారెడ్డికి చెందిన పార్టీ కార్య‌క‌ర్త‌ను బ‌రిలోకి దించేందుకు పార్టీ శ్రేణులు ఒప్పుకోక‌పోతే... త‌న స్థానంలో త‌న భార్య చేత పోటీ చేయిస్తాన‌ని ఆయ‌న తెలిపారు. ఈ ఎన్నిక‌ల్లో తాను పోటీ చేయ‌న‌ని చెప్పిన జ‌గ్గారెడ్డి... 2028లో జ‌రిగే ఎన్నిక‌ల్లో మాత్రం సంగారెడ్డి నుంచి తానే పోటీ చేస్తాన‌ని ప్ర‌కటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles