No fare for kids under five: SCR ఐదేళ్లలోపు పిల్లలకు రైల్వే బర్త్ కావాలంటే.. టికెట్ కొనాల్సిందే: రైల్వే క్లారిటీ

Kids under five book berths must pay for it south central railway

South Central Railway, SCR On Five Years Old Tickets, train tickets to under five, SCR Clarity On Tickets Under Five, South Central Railway Updates, Ticket To Five Years old, Train Travel, Under five, South central railway, railway berths, Railway Tickets, Travel Free, Berth purchase, Railway news, SCR News

Asserting that there is no change in ticket rules for children, the South Central Railway (SCR) has said it is optional for passengers to buy a ticket and book a separate berth for children below the age of five. The railway authorities added that free travel is allowed for children below the age of five if no berth is booked.

ఐదేళ్లలోపు పిల్లలకు రైల్వే బర్త్ కావాలంటే.. టికెట్ కొనాల్సిందే: రైల్వే క్లారిటీ

Posted: 08/18/2022 12:53 PM IST
Kids under five book berths must pay for it south central railway

ఐదేళ్లలోపు పిల్లలకు రైలు ప్రయాణానికి ఛార్జీలు వసూలు చేస్తున్నారని వార్త వైరల్ అయింది. దీనిపై సౌత్ సెంట్రల్ రైల్వే క్లారిటీ ఇచ్చింది. 'పిల్లల కోసం రైలు టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు భారతీయ రైల్వే తన విధానాన్ని మార్చుకుందని వార్తలు వచ్చాయి. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు రైలు టిక్కెట్‌ను కొనుగోలు చేయవలసి ఉంటుందని కొన్ని నివేదికలు వచ్చాయి. ఈ నివేదికలు తప్పుదారి పట్టిస్తున్నాయి. రైలులో ప్రయాణించే పిల్లలకు టిక్కెట్ల బుకింగ్‌లో భారతీయ రైల్వే ఎటువంటి మార్పులు చేయలేదు.' అని SCR తెలిపింది.

ప్రయాణికులు తమ ఐదేళ్లలోపు పిల్లలకు కావాలనుకుంటే టిక్కెట్‌ను కొనుగోలు చేసి బెర్త్‌ను బుక్ చేసుకునే అవకాశం ఉందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. వారు ప్రత్యేక బెర్త్ కోరుకోకపోతే.. ఇంతకుముందులాగానే ఉచితమని వెల్లడించింది. మార్చి 6, 2020 నాటి సర్క్యులర్‌లో ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ప్రత్యేక బెర్త్ లేదా సీటు లేకుండా ఉచితంగా ప్రయాణించవచ్చు. పిల్లలకు బెర్త్‌లు లేదా సీట్లు అవసరమైతే, వారు పూర్తి వయోజన ఛార్జీలను చెల్లించాలి. అంటే ఇలాంటప్పుడు పూర్తిగా, పెద్దలకు వర్తించే టికెట్ ధర వర్తిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles