Vijayashanti unhappy with BJP leadership in Telangana బీజేపి అధినాయకత్వంపై విజయశాంతి అసంతృప్తి..

Vijayashanti expresses discontentment for not giving preference in bjp

Vijayashanthi, BJP, Bandi Sanjay, Vijayashanthi sidelined, Vijayashanthi displeasure, Vijayashanthi discontentment, Sardar Sarvai Papanna Goud, Nampally, silent mode, Active politics, munugode byelections, telangana bjp, Telangana, politics

Vijayashanti, a member of the BJP's national executive committee, hinted at being sidelined by senior members of the Telangana Unit. Speaking to the media after coming out of the Bahujan Ruler Sardar Sarvai Papanna Goud anniversary celebrations at the BJP Telangana office at Nampally in the city, she said that party leadership had kept her in a silent mode.

‘‘నన్నెందుకు పక్కన పెడుతున్నారు..’’: బీజేపి నాయకత్వంపై విజయశాంతి అసంతృప్తి..

Posted: 08/18/2022 11:58 AM IST
Vijayashanti expresses discontentment for not giving preference in bjp

సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అన్న నానుడితో అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని దేశంలోని అన్ని రాష్ట్రాలలో తమ జెండాను ఎగురవేయాలని ప్రయత్నాలు చేస్తున్న బీజేపి రాష్ట్ర నాయకత్వంపై ఆ పార్టీ సినియర్ నాయకురాలు విజయశాంతి అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలోనే అందరు నాయకులను కలుపుకుని వెళ్లలేని పార్టీ.. ఇక అన్నివర్గాల ప్రజలను ఎలా కలుపుకుని వెళ్తోందని కూడా ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర నాయకత్వం.. తనను కావాలనే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా పక్కన పెడుతోందని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి అసంతృప్తి వ్యక్తం చేశారు.

జాతీయపార్టీతో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, రాష్ట్ర నాయకత్వమే తనను ఉపయోగించు కోవడం లేదని ఆమె ఆరోపించారు. పార్టీ రాష్ట్ర నాయకత్వంపై జాతీయ నాయకత్వం దృష్టి సారించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కరోనా కారణంగా పార్టీకి కొద్దికాలంగా తాను దూరంగా ఉన్న మాట వాస్తవమేనని, 24 ఏళ్ళు బీజేపీలో పనిచేశానని ఆమె గుర్తు చేశారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాల్లో విజయశాంతి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ ప్రసంగంతో సభ ముగిసింది. విజయశాంతికి మాట్లాడే అవకాశం రాకపోవడంతో ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పాపన్న జయంతి ఉత్సవాల్లో ఎందుకు మాట్లాడలేదని ఆమెను కలిసి మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. తన సేవలను ఎలా ఉపయోగించుకుంటారో బండి సంజయ్‌, లక్ష్మణ్‌లకు తెలియాలన్నారు. పార్టీ తనకు ఏమి బాధ్యతలు ఇచ్చారని పార్టీలో పనిచేయాలని ఆమె ప్రశ్నించారు. ఒకరిద్దరితో పార్టీలో పనులు జరగవన్నారు. ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉన్న వాళ్ళను ముందు వరసలో ఉంచాలని పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని ఆమె కోరారు. బాధ్యత కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పార్టీ కార్యక్రమాల్లో ఎందుకు చురుగ్గా పాల్గొనడం లేదనే మీడియా ప్రశ్నలకు, బండి సంజయ్‌ను అడిగితే బావుటుందని పేర్కొన్నారు. తాను ఎక్కడ నుంచి పోటీ చేయాలో పార్టీ అధిష్టానమే నిర్ణయిస్తుందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles