Video: Shiv Sena MLA Slaps Catering Manager Over Food క్యాట‌రింగ్ మేనేజర్‌పై చేయి చేసుకున్న షిండే వర్గం ఎమ్మెల్యే..

Team shinde s mla in viral video threatens break their leg i ll get you bail

Team Shinde, Team Thackeray, Shiv Sena, Kokani pada, Prakadh Surve, Shiv Sena leader Prakash Surve, MLA Prakash Surve, provoking party activists, Shiv Sena news, Shiv Sena alliance in maharashtra, prakash surve, Eknath Shinde, Eknath Shinde BJP, Shiv Sena (Bal Thackeray), Shiv Sena, Uddhav attacks BJP, Uddhav Thackeray, Maharashtra, politics

Shiv Sena leader Uddhav Thackeray's camp has lodged a police complaint against MLA Prakash Surve, who is a supporter of Chief Minister Eknath Shinde, for saying, "If you can't break their hand, break their leg. I will come the next day to bail you out," at a function. In an another incident, MLA Santosh Bangar abused and assaulted the manager for poor quality of food being served to labourers in Maharashtra's Hingoli district as part of a midday meal programme.

ITEMVIDEOS: ‘‘వాళ్ల కాళ్లు విరగొట్టండీ’’ కార్యకర్తలను రెచ్చగొట్టిన షిండే వర్గం ఎమ్మెల్యే

Posted: 08/16/2022 01:02 PM IST
Team shinde s mla in viral video threatens break their leg i ll get you bail

మ‌హారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్యేలు అధికారంతో రెచ్చిపోతున్నారా.? ఇన్నాళ్లు తమను పెంచి.. రాజకీయ నేతలుగా తీర్చిదిద్దిన ఎమ్మెల్యేల అసలైన శివసేన పార్టీనే వారు టార్గెట్ చేస్తున్నారా.? అంటే ఔననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నెట్టింట్లో ఇందుకు సంబంధించిన ఓ వీడియో కూడా వైరల్ అవుతోంది. షిండే వర్గానికి చెందిన ఓ ఎమ్మెల్యే ఈ మేరకు అసలైన శివసేన తమదేనంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా, మరోకరు కార్మికులకు సరైన అహారం ఇవ్వడం లేదని క్యాటరింగ్ మేనేజర్ పై చేయిచేసుకున్నారు.

ఈ రెండు వేర్వేరు ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ముంబైలోని మ‌గ‌థానే ప్రాంతంలోని కొక‌ని ప‌ద బుద్ద విహార్ లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్ర‌కాశ్ సుర్వే వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఆయన వ్యాఖ్యలపై ఉద్ద‌వ్ వ‌ర్గానికి చెందిన పార్టీ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఎవ‌రైనా మిమ్మ‌ల్ని అడ్డుకుంటే వాళ్ల చేతుల్ని విర‌గగొట్టాల‌ని, లేదంటే వాళ్ల కాళ్ల‌ను విర‌గ్గొట్టాల‌ని, ఆ త‌ర్వాత రోజు వ‌చ్చి తాను బెయిల్ ఇప్పించ‌నున్న‌ట్లు ఎమ్మెల్యే ప్ర‌కాశ్ అన్నారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ వైర‌ల్ అవుతోంది. ఇకపై ఎవ‌రి దాదాగిరి న‌డ‌వ‌ద‌ని, మిమ్మ‌ల్ని ఎవ‌రైనా ఏదైనా అంటే, వాళ్ల‌కు ఎదురు తిర‌గాల‌ని ఎమ్మెల్యే ప్రకాశ్ అన్నారు.


ఎవ‌రితోనూ గొడ‌వ‌ప‌డ‌మ‌ని, కానీ ఎవ‌రైనా కొట్లాడితే, వాళ్ల‌ను తాము వ‌ద‌ల‌బోమ‌న్నారు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఈ వ్యాఖ్య‌ల‌ను ఖండించిన థాకరే వ‌ర్గం ద‌హిసార్ పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. కార్యకర్తలను ఎమ్మెల్యే దేశ స్వతంత్ర్య వజ్రోత్సవ సభ సాక్షిగా రెచ్చగొడుతున్నారని ఉద్దవ్ థాకరే వర్గానికి చెందిన శివసేన నేతలు పోలీసులకు పిర్యాదు చేశారు. కార్యకర్తలను ఒక ఎమ్మెల్యే గొడవలకు పాల్పడాలని ప్రేరేపిస్తున్నారని వారు తమ పిర్యాదులో పేర్కోన్నారు. ఇదిలా ఉండగా మరో ఘటనలో మరో షిండే వర్గానికి చెందిన ఎమ్మల్యే సంతోష్ బాంగ‌ర్ మధ్యాహ్నా ఆహారం సరఫరా చేసే క్యాటిరింగ్ మేనేజర్ పై చేయిచేసుకున్నారు.


కార్మికుకలు నాణ్య‌మైన ఆహారం అందించడంలేద‌ని అత‌ని చెంప చెల్లుమ‌నిపించడంతొ పాటు అసభ్యపదజాలంతో దూషించాడు. హింగోలీ జిల్లాలో కార్మికుల‌ మ‌ధ్యాహ్నం భోజ‌నం కార్య‌క్ర‌మాన్ని చేప‌డుతున్న క్యాట‌రింగ్ మేనేజ‌ర్‌ను ఎమ్మెల్యే నిల‌దీశారు. నాణ్య‌తలేని ఆహారాన్ని అందిస్తున్న‌ట్లు త‌మ‌కు ఫిర్యాదు అందిన‌ట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆ ఫిర్యాదు మేర‌కు తాను త‌నిఖీ చేసిన‌ట్లు చెప్పారు. దీంతో క్యాటరింగ్ బాగోలేదని జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేస్తానని, అతని క్యాటరింగ్ కాంట్రాక్టు నిలుపుదల చేయిస్తానని హెచ్చరించారు. అయితే చేయి చేసుకోవాల్సిన అసవరం ఏంటని నెటిజనులు ప్రశ్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles