Fiasco at Mangaluru Airport: Two passengers booked ప్రయాణికుడి చాటింగ్.. 6గంటలు ఆలస్యంగా బయల్దేరిన విమానం..

You are a bomber girlfriend chats force indigo flight to delay by almost six hours

Mangaluru International Airport, scare at Mangaluru International Airport, Mangaluru, IndiGo flight, Indigo airlines, IndiGo flight delay, IndiGo passenger text, passenger phone text, Indigo flight bomb threat, indigo flight, indigo, Indigo airlines, Mangalore -Mumbai flight, suspicious message, Aviation security

Mangaluru city police have filed a case against two flight passengers, after their chat on Whatsapp created a scare and delayed departure of a Mumbai bound flight at the Mangaluru International Airport. The police gave the names of the passengers Dipayan Manji, 23, and his friend Simran Tom, 23, both hailing from Ghaziabad in Uttar Pradesh.

ప్రియురాలితో చాటింగ్ తంటా.. ఆరు గంటలు ఆలస్యంగా బయల్దేరిన విమానం..

Posted: 08/16/2022 02:00 PM IST
You are a bomber girlfriend chats force indigo flight to delay by almost six hours

విమానంలో తోటి ప్రయాణికుడు తన గాళ్ ఫ్రెండ్‌తో చేస్తున్న చాటింగ్‌ను వెనక సీట్లో కూర్చున్న ప్రయాణికురాలు చూడడంతో విమానం ఆరుగంటలపాటు నిలిచిపోయింది. కర్ణాటకలోని మంగళూరు విమానాశ్రయంలో జరిగిందీ ఘటన. మంగళూరు నుంచి ముంబై వెళ్లే ఇండిగో విమానం టేకాఫ్‌కు రెడీ అయింది. ప్రయాణికులు సీటు బెల్టులు ధరించి సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో విమానంలో తన ముందు సీట్లో కూర్చున్న యువకుడు తన ప్రియురాలితో చేస్తున్న చాటింగ్‌ను వెనక సీట్లో కూర్చున్న ఓ ప్రయాణికురాలు చూసింది. అందులో ‘యు ఆర్ ద బాంబర్’ అన్న మెసేజ్ కనిపించింది.

కీడు శంకించిన ఆమె వెంటనే విషయాన్ని విమాన సిబ్బంది దృష్టికి తీసుకెళ్లింది. అప్రమత్తమైన కేబిన్ సిబ్బంది దానిని పైలట్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వెంటనే విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కు చేరవేసి.. దీంతో విమానం టేకాఫ్ ఆగిపోయింది. ఆ తర్వాత విమానంలోని 185 మంది ప్రయాణికులను కిందికి దించేసి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే, అందులో అనుమానాస్పదంగా ఎలాంటి వస్తువు కనిపించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, తాను తన ప్రియురాలు సరదాగా చేసుకున్న ఫన్ టాక్ మాత్రమేనని.. సదరు ప్రయాణికుడు చెప్పారు.

మరోవైపు, చాటింగ్ చేసిన యువకుడిని, అదే విమానాశ్రయంలో బెంగళూరు వెళ్లే విమానం కోసం ఎదురుచూస్తున్న అతడి ప్రియురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కొన్ని గంటలపాటు ప్రశ్నించారు. వారి సంభాషణ సరదాగా సాగిందని తేలడంతో విమానం బయలుదేరేందుకు అధికారులు అనుమతినిచ్చారు. దాదాపు ఆరుగంటలపాటు నిలిచిపోయిన విమానం చివరికి సాయంత్రం 5 గంటలకు బయలుదేరింది. అయితే, విచారణ జరుగుతున్న నేపథ్యంలో యువకుడిని వెళ్లేందుకు అనుమతించలేదు, అలాగే అతడి ప్రియురాలు కూడా బెంగళూరు వెళ్లే విమానాన్ని మిస్సైంది. కాగా, వారిద్దరి మధ్య జరిగింది ఫ్రెండ్లీ చాటింగేనని, ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదని అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles