ATM washed away in floods.. 24 lakh cash in it.. రూ.24 లక్షల నగదుతో వరదల్లో కొట్టుకుపోయిన ఏటీయం..

Uttarakhand uttarkashi atm washed away in floods 24 lakh cash in it

ATM washed away in floods, Uttarakhand floods, 8 shops washed away, 24 lakh cash washed away, ATM with 24 lakh washed away, Punjab National Bank ATM washed away, Punjab National Bank ATM, Punjab National Bank, Auto Teller Machine, Rs 24 cash filled ATM, Kumola river, Purola Bank manager, Uttarkashi district, Uttarakhand

The threat of floods continues in Uttarakhand. In Purola area of ​​Uttarkashi district of the state, public life has become chaotic due to heavy rains. The Kumola river has become turbulent due to heavy flood water. Punjab National Bank ATM in one of the shops. Officials say that 24 lakh rupees were deposited in this ATM on Wednesday evening. Customers are allowed to withdraw only a very small amount. This makes the rest of the cash look like water.

ITEMVIDEOS: ఉత్తరాఖండ్ వరదల్లో కొట్టుకుపోయిన ఏటీయం.. రూ.24 లక్షల నగదుతో..

Posted: 08/11/2022 12:44 PM IST
Uttarakhand uttarkashi atm washed away in floods 24 lakh cash in it

ఉత్తరాఖండ్​లో వరదల బీభత్సం కొనసాగుతుంది. రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాపై వరుణుడి ఉద్దృతి కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా పురోలా ప్రాంతంలో భారీ వర్షాలతో ప్రజాజీవనం అస్తవ్యస్తమయ్యింది. భారీగా వస్తున్న వరదనీటితో కుమోలా నది అల్లకల్లోలంగా మారింది. ఏకధాటి వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో పలు ఇళ్లు పాక్షికంగా, పలు ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నది ఉద్దృత ప్రవాహంతో వరదలు సంభవిస్తున్నాయి. దీంతో పురోలా ప్రాంతంలో భారీగా అస్థినష్టం సంభవించింది. అయితే ప్రాణనష్టం లేకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

ఈ క్రమంలో పురోలా ప్రాంతంలో నది వరదకు మట్టి కూడా కోసుకుపోయింది. దీంతో నది సమపంలో ఉన్న గల ఎనిమిది దుకాణాలు వదరనీటిలో కొట్టుకుపోయాయి. అందులోని ఒక షాపులో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం కూడా ఉంది. ఈ ఏటీఎంలో బుధవారం సాయంత్రమే 24 లక్షల రూపాయలు డిపాజిట్ చేసినట్లు పురోలా బ్యాంకు అధికారులు తెలిపారు. వర్షం కారణంగా చాలా తక్కువ మొత్తంలో మాత్రమే కస్టమర్లు డబ్బు ఉపసంహరణలు చేశారని.. అయితే అందుకు ఆర్బీఐ విధించిన విత్ డ్రా ఆంశలు కూడా ఒక కారణమని తెలుస్తోంది. దీంతో మిగిలిన క్యాష్ అంతా నీటిపాలు అయినట్లే కనిపిస్తుంది.

గత రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా కుమోల నదికి అకస్మాత్తుగా వరద ఉదృతి పెరగడంతో ఈ షాపులు కొట్టుకుపోయాయి. వాటిలో 2 నగల  దుకాణాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా అనేక నివాస గృహాలు, దుకాణాలకు ఇప్పటికీ ముప్పు పొంచి ఉంది. స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలోని నివాసితులంతా భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న తహసీల్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టడంతో పాటు నష్టాన్ని పరిశీలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles