కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో కరోనా కొత్త సబ్ వేరియంట్ ఒమిక్రాన్ బిఏ 2.75 కేసులు విజృంభిస్తున్నాయి. ఈ వేరియంట్ వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతూ ఢిల్లీలో కేసుల పెరుగుదలకు కారణం అవుతోంది. ఈ నేపథ్యంలో గురువారం ఢిల్లీ ఆరోగ్యశాఖ నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. దాంతో పాటు పలు ఆంక్షలను కూడా అమల్లోకి తీసుకువచ్చింది. రాష్ట్ర ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించింది. జనసామర్థ్యం ఉన్న ప్రాంతాల్లో బౌతిక దూరాన్ని పాటించాలని కూడా సూచనలు చేసింది.
ప్రజలు తప్పనిసరిగా శానిటైజర్ తో తమ చేతులను శుభ్రం చేసుకోవాలని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇక మాస్కులు ధరించని ప్రజలపై బాదుడుకు కూడా సిద్దమైంది. అయితే డబ్బులు వసూళ్లు చేయడం తమ ఉద్దేశం కాదని, ఈ ఆంక్షతోనైనా ప్రజలు మాస్కులు తప్పనిసరిగా ధరించి.. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బిఏ 2.75 బారిన పడకుండా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే తమ ఆంక్షలను తేలిగ్గా తీసుకుని మాస్కులు ధరించనివారిపై రూ.500 జరిమానా విధిస్తామని హెచ్చరించింది. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 2,100 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.
పాజిటివిటీ రేటు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాలు, పబ్లిక్ ప్లేసుల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించింది. కారులో ప్రయాణించేటప్పుడు మాత్రం ఈ నిబంధనలు వర్తించదని పేర్కొంది. కాగా, ఇటీవల ఢిల్లీలో కరోనా పాజిటివిటీ రేటు పెరుగుతూ వస్తోంది. కేసులు పెరుగుతున్న నేపథ్యం కరోనా ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్యులు భావిస్తున్నారు. అందుకే కరోనాను కట్టడి చేయాలని ఈ నిబంధనలను అమలు చేశారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరిగినా.. మరణాల రేటు తక్కువగా నమోదవుతోంది. ఇప్పటికే దేశంలో 8 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. మంకీపాక్స్‌ను అరికట్టడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more