Two AP women farmers strikes diamond in a field మహిళా రైతులను వరించిన అదృష్టం.. పొలంలో వజ్రం లభ్యం..

Two kurnool women farmers of andhra pradesh stumbles upon diamond worth lakhs

Diamond, Jonnagiri Farmer, Agriculture land, Thuggali farmer, farmer found diamond while tilling land, Rs 25 Lakhs, Diamond merchant, Rs 40 lakh, field,Farmer,Diamond,agricultural fields at Thuggali, Kurnool, Diamond in Agriculture land, Andhra Pradesh

Two women farmers in Jonnagiri in Thuggali mandal has reportedly found diamonds in agriculture land while tilling the land for farming in two different incidents. One of then is a young girl, she went to work in their own land and found a 10 cents diamond. While another woman is a farm labour she found a coloured stone, local diamond merchant conformed it as diamond and purchased it.

మహిళా రైతులను వరించిన అదృష్టం.. పొలంలో వజ్రాలు లభ్యం..

Posted: 08/11/2022 11:40 AM IST
Two kurnool women farmers of andhra pradesh stumbles upon diamond worth lakhs

అదృష్టం నుదుటన రాసి ఉండాలే కానీ.. వచ్చి తగలక మానదు. తగు సమయం రాగానే భూమి పోరల్లో దాక్కున్నా వచ్చి తగులుతుంది. ఆరు నూరైనా వచ్చి తగులుతుందని పెద్దలు చెప్పిన మాటలు అక్షరసత్యాలని మరోమారు నిరూపితమైంది. పొలంలో పనులు చేసేందుకు వెళ్లిన ఓ యువతితో పాటు మహిళా రైతుకూలికి ఒకే రోజున అదృష్టం వరించింది. రెండు వేర్వేరు సంఘటనల్లో వీరికి వజ్రాలు లభించింది. దాని ధర కూడా లక్షల్లో ఖరీదు చేసింది. రాత్రికి రాత్రే ఇద్దరు మహిళలను లక్షాధికారులను చేసింది. వారి నుంచి స్థానిక వజ్రాల వ్యాపారులు దానిని కొనుగోలు చేశారని కూడా సమాచారం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా తుగ్గలి మండల పరిధిలోని జొన్నగరి గ్రామానికి చెందిన ఇద్దరు మహిళా రైతులకు అదృష్టం వరించి వారి కష్టాలను తీర్చడమే కాదు.. వారిని అకస్మాత్తుగా లక్షాధికారులుగా మార్చింది. వ్యవసాయ పనుల కోసం పోలాని వెళ్లిన ఇద్దరు మహిళా రైతులకు వజ్రాలు లభించాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి కళకళలాడిపోతూ ఉంటుంది. వర్షాకాలంలో జొన్నగిరి రైతుల్లో ఒకరిద్దరైనా రాత్రికి రాత్రే లక్షాధికారులుగా మారిపోతుంటారు. ఆ మట్టిలో విలువైన వజ్రాలు దాగి ఉండడమే అందుకు కారణం.

వర్షం కారణంగా మట్టి కొట్టుకుపోయి వజ్రాలు బయటపడుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఇద్దరు మహిళలను అదే అదృష్టం వరించింది. తుగ్గలి మండలంలో ఒక రైతు కుటుంబం, ఒక కూలీ కుటుంబం వజ్రాలు దొరకడంతో లబ్ధిపొందాయి. జి.ఎర్రగుడిలో రైతు కుటుంబానికి చెందిన యువతి పొలం పనులకు వెళ్లింది. సొంత పొలంలో ఆముదం పంటలో కలుపుతీస్తుండగా మెరుగురాయి తళుక్కుమంది. దాన్ని కుటుంబసభ్యులకు చూపించడంతో వజ్రం అని నిర్ధారణ చేసుకున్నారు. దాదాపు పది క్యారెట్లు ఉన్న ఈ వజ్రాన్ని సొంత చేసుకునేందుకు వజ్రాల వ్యాపారులు కూడా ఒక్కటి కావాల్సి వచ్చింది.

పెరవలి, జొన్నగిరి, గుత్తికి చెందిన పలువురు వ్యాపారులు సిండికేట్‌ అయి రూ.34 లక్షల నగదు, 10 తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేసినట్లు తెలిసింది. జొన్నగిరిలో టమాటాలు తెంచేందుకు కూలికి వెళ్లిన మహిళకు రంగురాయి దొరికింది. దాన్ని తీసుకెళ్లి వ్యాపారికి చూపించగా వజ్రమని తేల్చి రూ.6 లక్ష లకు కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ ఏడాది ఇప్పటివరకు జొన్నగిరి, జి.ఎర్రగుడి, పగిడిరాయి, గిరిగెట్ల గ్రామాల్లో ఏడువజ్రాలు లభ్యమయ్యాయి. ఏటా తొలకరి వర్షాలకు ఈ ప్రాంతంలో విలువైన వజ్రాలు లభ్యమవుతుంటాయి. వజ్రాలు వెతికేందుకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల నుంచి జనం వస్తుంటారు. జనం తాకిడి ఎక్కువ కావడంతో ఈ ఏడాది జొన్నగిరిలో రైతులంతా కలిసి కాపలాదారులను పెట్టారు. వజ్రాన్వేషకులు రాకుండా కాపలాదారులు నిలువరిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles