దేశీయంగా, అంతర్జాతీయంగా విమానయాన సేవలను ప్రయాణికులకు కల్పిస్తున్న స్పైస్ జెట్ విమానాయాన సంస్థ గతకొన్ని రోజులుగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోంటోంది. తమ సంస్థకు చెందిన విమానాలు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో స్పైస్‌జెట్ విమానయాన సంస్థకు ఏమైందంటూ.? విమానయాన ప్రమాణికులు అందోళన చెందుతున్నారు. ఫలితంగా ఆ విమానయాన సేవలను ఎంచుకోవడంలోనూ పునరాలోచన చేస్తున్నారు. ఈ సంస్థ విమానాలకు బదులు ప్రత్యామ్నాయ సంస్థలను ఎంచుకుంటున్నారు. దీంతో సంస్థపై ప్రయాణికులకు ఇన్నాళ్లు ఉన్న నమ్మకం సన్నగిల్లే అవకాశాలు ఉన్నాయి.
అదే జరిగితే సంస్థ నష్టాల్లోకి వెళ్లడం గ్యారంటీ. ఇలాంటి అభిప్రాయాలు ప్రయాణికుల్లో ఎందుకు ఉత్పన్నం అవుతున్నాయంటే.. గడిచిన మూడు వారాల వ్యవధిలో 8 స్పైస్‌జెట్ విమానాల్లో సాంకేతిక సమస్యలు వెలుగు చూశాయి. ఒక్క మంగళవారం రోజే రెండు విమానల్లో భద్రత సమస్యలు ఏర్పడి అత్యవసర ల్యాండింగ్ చేశాయి. ఢిల్లీ నుంచి దుబాయ్ కి బయలుదేరిన విమానం నుంచి ఇంధనం లీక్ కావడంతో పాకిస్థాన్ లోని కరాచీలో అత్యవసరంగా ల్యాండింగ్ చేసిన విషయం తెలిసిందే. అందులోని ప్రయాణికులను మరో విమానంలో దుబాయ్ కి తరలించింది స్పైస్ జెట్ యాజమాన్యం. ఈ ఘటనను ప్రయాణికులు మరువక ముందే మరో ఘటన చోటుచేసుకుంది.
తాజాగా మరో స్పైస్ జెట్ విమానం కల్‌కతా విమానాశ్రయం నుంచి బయలు దేరిన కొంత సమమానికే తిరిగి వెనక్కి వచ్చి ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. కల్‌కతా నుంచి చైనా బయలుదేరిన స్పైస్‌జెట్ కార్గో విమానంలో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. స్పైస్‌జెట్ బోయింగ్ 737 కార్గో విమానం జూలై అయిదో తేదీన కోల్‌కతా నుంచి ఛాంగ్‌క్వింగ్ వెళ్లాల్సి ఉంది. కోల్‌కతా నుంచి టేకాఫ్ అయిన తరువాత విమనాంలో వాతావరణ రాడార్ పనిచేయడం ఆగిపోయింది. దీంతో పైలట్ విమానాన్ని తిరిగి కోల్‌కతాకు తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. కోల్‌కతాలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని స్పైస్‌జెట్ ప్రతినిధి తెలిపారు.
కాగా ఈ ఘటన కంటే ముందు ఢిల్లీ నుంచి దుబాయ్‌కి వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం కారణంగా విమానాన్ని దారి మళ్లించి కరాచి ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. స్పైస్‌జెట్ విమానంలో ఇండికేటర్ లైట్ సరిగా పనిచేయకపోవడంతోనే కరాచికి మళ్లించారు. అంతేగాక గుజరాత్‌లోని కాండ్లా నుంచి బయలుదేరిన స్పైస్ జెట్ విమానం ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. విమానం గాల్లో ఉండగా విండ్‌షీల్డ్ ఔటర్ పేన్ పగలడంతో ముంబైలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. అయితే ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉన్నారని ఎయిర్‌లైన్స్ తెలిపింది. ఈ నేపథ్యంలో డిజీసిఐ స్పైస్ జెట్ సంస్థకు నోటీసులను అందించింది. విమాన సేవల్లో ఆటంకాలపై వివరణ కోరింది.
(And get your daily news straight to your inbox)
Aug 13 | దేశ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడుస్తున్న సందర్భంగా.. దేశప్రజలందరూ తమ ఇళ్లపై జెండాలను అవిష్కరించాలని ఇప్పటికే జెండాలను కూడా పంచిన క్రమంలో.. వాటితో తమ తమ... Read more
Aug 13 | కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ (JE) పోస్టుల నియాక ప్రక్రియను స్టాఫ్ సెలెక్షన్ కమిటీ (SSC) చేపట్టింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది. అర్హులైనవారు వచ్చే నెల 2... Read more
Aug 13 | మరో రెండేళ్లలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణాలపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే, సీ ఓటర్ సంస్థతో కలిసి చేపట్టిన జాతీయస్థాయి... Read more
Aug 13 | తెలంగాణ కాంగ్రెస్ చండూరు సభ వేడి తగ్గడం లేదు. ఎంపీ కోమటిరెడ్డిపై అద్దంకి దయాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేయటంతో మొదలైన రగడ... రోజురోజుకూ ముదురుతుంది. ఈ కామెంట్స్ పై సీరియస్ గా ఉన్న కోమటిరెడ్డి...... Read more
Aug 12 | ఉచిత తాయిలాలు వద్దన్న భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణపై రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ) అధినేత జయంత్ చౌదరి విమర్శలు గుప్పించారు. ముందుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తాను పొందుతున్న ఉచితాలేంటో... Read more