Presidential elections, a fight between two ideologies: Yashwant Sinha రాష్ట్రపతి ఎన్నికలు రెండు సిద్దాంతాల మధ్య పోరు: యశ్వంత్ సిన్హా..

Fight will continue even after the polls yashwant sinha on presidential elections

KCR, Yashwant Sinha, Telangana Chief Minister, KCR receives Yashwant sinha, Draupati murmu, Presidential election, PM Modi, Yashwant Sinha in hyderabad, Opposition's Presidential Candidate Yashwant Sinha, special plane, Indian Air Force, Begumpet Airport, Presidential polls, BJP national executive meet, Hyderabad, Telangana, Politics

Stating that the presidential elections are being held under "extraordinary circumstances", the opposition's presidential candidate Yashwant Sinha on Saturday said the fight will continue even after the polls. Speaking at a meeting organised by the TRS party in support of his candidature, Sinha said the election is not a fight between two individuals but a battle of ideologies.

అసాధారణ పరిస్థితుల్లో రెండు సిద్దాంతాల మధ్య పోరు: యశ్వంత్ సిన్హా..

Posted: 07/02/2022 04:41 PM IST
Fight will continue even after the polls yashwant sinha on presidential elections

దేశంలో రాష్టప్రతి ఎన్నికలకు తెర లేచిన సందర్భంలో ఈ ఎన్నికలు ఇద్దరు వ్యక్తులకు సంబంధించినవి కావని, రెండు సిద్దాంతాల మధ్య పోరుగా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పేర్కోన్నారు. దేశంలో నెలకొన్న ‘అసాధారణ పరిస్థితుల్లో’ రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. అయితే ఈ సిద్దాంతాలకు వ్యతిరేకంగా ఎన్నికలు ముగిసిన తరువాత కూడా పోరు కొనసాగుతూనే ఉంటుందని సిన్హా అన్నారు. తెలంగాణలో ప్రజాచైతన్యాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నట్లు చెప్పారు. చాలా రోజులుగా కేంద్రం అవలంభిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నానని ఆయన చెప్పుకోచ్చారు.

దేశంలో పరిస్థితులు నానాటికీ దిగజారుతుంటే చూస్తూ ఉండలేకపోతున్నామని అన్నారు. విశాల భారత పరిరక్షణ కోసం జరిగే పోరాటం. విద్వేషపూరిత ప్రసంగాలు సమాజానికి మంచివి కాదు. ఒక వ్యక్తి చెబుతుంటే 135 కోట్ల మంది వినాలా..? ఇదేనా ప్రజాస్వామ్యమని ఆయన ప్రశ్నించారు. ప్రధాని ఎప్పుడు ఏకాభిప్రాయంపై విశ్వసించలేదని, కేవలం ఘర్షణాత్మక వాతావరణాన్ని మాత్రమే ఆయన నమ్ముతున్నారని అరోపించారు. ఈ విధానాలపై ఇప్పుడు చేసే పోరాటం భారత్‌ భవిష్యత్తు కోసం. మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం చేసేదేనని ప్రజలు, ప్రజాప్రతినిధులు గుర్తించాలన్నారు.  

అటల్ బిహారీ వాజ్‌పేయి క్యాబినెట్‌లో తాను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యర్థులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను ఉపయోగించవచ్చని తాను ఊహించలేదన్నారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జలవిహార్‌లో ఏర్పాటు చేసిన సభలో యశ్వంత్‌ సిన్హా మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తమకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నందుకు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ ప్రతినిధులు చూపించిన ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు.దేశానికి కేసీఆర్‌ వంటి నేత అవసరమని... కేసీఆర్‌తో మరోసారి సమావేశమవుతానని యశ్వంత్ సిన్హా అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles