భూమిపైన ఉన్న జంతుజాలంలో మనకు కనబడనవాటినే మనం గుర్తిస్తాం. కానీ మనకు తెలియని ఎన్నోరకాల జీవచరాలు భూమిపై ఉన్నాయన్న విషయం మీకు తెలుసా.? ఇక మనకు తెలిసిన వాటిలోనూ ఎన్నో అరుదైన జీవులు వున్నాయని, వాటిని ఇప్పటివరకు అత్యంత తక్కువ మంది మాత్రమే వీక్షించారని మీకు తెలుసా.? ఇలాంటి అరుదైన జీవరాశులు ఇప్పడు కనిపిస్తే.. ఏముందీ.? ఓ రెండు దశాబ్దాల క్రితం అయితే ఏమో కానీ.. ఇప్పుడైతే సోషల్ మీడియా ఫుణ్యమా అని ఆ అరుదైన జీవి ఫోటోలు, వీడియోలను మనం మన ఫోన్లోనే విక్షించే వెసలుబాటు కలిగింది.
ఇంతకీ ఇప్పుడు కనిపించిన ఈ అరుదైన జీవరాశి ఏదీ.? అంటారా.. సరీసృపం.. ఇందులో వింతేముంది మనకు కూడా చాల రకలా పాములు కనిపిస్తుంటాయి అంటారా.? అయితే ఈ పాములు కొంత స్పెషల్. నిజంగా.. ఇవి సంయోగ పాము. అవిభక్త కవలలు మాదిరిగా ఒకే తలతో ఉన్న రెండు పాముల గురించి మేము చెప్పడం లేదు.. అయితే సంయోగ దేహంతో రెండు తలలు విడిగా ఉన్న వింత పాము గురించి తెలుసా..? ఇప్పుడు మేము చెప్పబోతున్నది ఈ పాము గురించే. ఈ పాము ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ మారాయి. ఇంతకీ ఇది కూడా మార్పింగ్ ఫోటోనా లేక నిజమైనదేనా.? ఇలా కూడా పాములు ఉంటాయా.? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయా.?
ఇది నిజమైన సరీసృపమే. ఇది ఓ వ్యక్తి గార్డెన్ లోకి కనిపించగా.. ఆయన దానిని చూసి బెదిరిపోయి.. దానిపై ఓ కూజను పెట్టి వెంటనే స్థానికంగా పాములను పట్టుకుని నిక్ ఈవాన్స్ అనే వ్యక్తికి కబురుపెట్టారు. తన గార్డెన్లో రెండు తలల పాము వచ్చిందని తెలిపాడు. దీంతో ఆయన అక్కడికి వెళ్లి దానిని పరిశీలించి అది హానీకారక (విషపూరిత) పాము కాదని గ్రహించి మెళ్లిగా పట్టుకున్నాడు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ చోటుచేసుకుందంటే.. దక్షిణాఫ్రికాలో. ఈ దేశంలోని క్వాజులు-నాటల్ ప్రావిన్స్‌లోని తీరప్రాంత నగరమైన డర్బన్‌కు ఉత్తరాన 60కిమీ దూరంలో ఉన్న నడ్వెడ్వేకి చెందిన ఒక వ్యక్తి గార్డెన్ లో ఈ పాము దర్శనమిచ్చింది.
పాముల సంరక్షకుడు నిక్ ఎవాన్స్ ఈ రెండు తలల సదరన్ బ్రౌన్ ఎగ్-ఈటర్ సరీసృపాన్ని పట్టుకుని.. దాని ఫొటోలను ఫేస్బుక్లో షేర్ చేశాడు. ఓ వ్యక్తి తన గార్డెన్లో ఈ పాము కనిపించగా పట్టుకునేందుకు తనను పిలిచాడని, తీరా వెళ్లి చూస్తే ఈ అరుదైన పాము కనిపించిందని నిక్ తెలిపాడు. ఇది హానిచేయని జాతి అని, చాలా అరుదైనదని పేర్కొన్నాడు. ఈ పామును సీసాలో బంధించి తీసుకొచ్చినట్లు తెలిపాడు. ఈ వికృతమైన పామును చూడడం చాలా వింతగా అనిపించిందని, దీని తలలు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయని చెప్పాడు. ప్రస్తుతం దీన్ని తానే సంరక్షిస్తున్నట్లు తెలిపాడు.
(And get your daily news straight to your inbox)
Aug 13 | దేశ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడుస్తున్న సందర్భంగా.. దేశప్రజలందరూ తమ ఇళ్లపై జెండాలను అవిష్కరించాలని ఇప్పటికే జెండాలను కూడా పంచిన క్రమంలో.. వాటితో తమ తమ... Read more
Aug 13 | కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ (JE) పోస్టుల నియాక ప్రక్రియను స్టాఫ్ సెలెక్షన్ కమిటీ (SSC) చేపట్టింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది. అర్హులైనవారు వచ్చే నెల 2... Read more
Aug 13 | మరో రెండేళ్లలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణాలపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే, సీ ఓటర్ సంస్థతో కలిసి చేపట్టిన జాతీయస్థాయి... Read more
Aug 13 | తెలంగాణ కాంగ్రెస్ చండూరు సభ వేడి తగ్గడం లేదు. ఎంపీ కోమటిరెడ్డిపై అద్దంకి దయాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేయటంతో మొదలైన రగడ... రోజురోజుకూ ముదురుతుంది. ఈ కామెంట్స్ పై సీరియస్ గా ఉన్న కోమటిరెడ్డి...... Read more
Aug 12 | ఉచిత తాయిలాలు వద్దన్న భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణపై రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ) అధినేత జయంత్ చౌదరి విమర్శలు గుప్పించారు. ముందుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తాను పొందుతున్న ఉచితాలేంటో... Read more